- ముద్దు — చుంబనం
- కౌగిలి — ఆలింగనం
- చూపు — దృష్టి, దృక్కు, చూడ్కు
- అన్నం — తిండి, కూడు, భోజనం, బువ్వ
- రోగం — తెగులు, జబ్బు, వ్యాధి, నలత, అనారోగ్యం
- బంగారం — స్వర్ణం, పసిడి, కనకం, పుత్తడి, హేమం, హిరణ్యం, సువర్ణం, పైడి, బంగారు
- శ్రేయస్సు — సంక్షేమం
- చిల్లు — బొర్రు, రంధ్రం, కంత, బొరియ, కలుగు, బొక్క, బొరక, బెజ్జము,
- అప్పు — అరువు, బాఖీ, ఋణం
- రంగు = వర్ణం, వన్నె
- నైపుణ్యం = చాతుర్యం, ప్రావీణ్యం, కౌశలం, లాఘవం
- చప్పుడు = రొద, సడి, సవ్వడి
- తడి = తేమ, చెమ్మ
- విన్నపం = అభ్యర్థన, విజ్ఞాపన, గోడు, మొర, మనవి
- వేగం = గతి
- చెమట = స్వేదం
- ప్రగతి = వృద్ధి, అభివృద్ధి, పురోభివృద్ధి
- వాడుక = రివాజు
- తరువాత = తదుపరి, అనంతరం, దరిమిలా
- ధనికులు = భాగ్యమంతులు, శ్రీమంతులు, ఉన్నవారు, కలవారు
- పేదలు = బీదలు, లేనివారు, అభాగ్యులు