కనకము
(కనకం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- సంస్కృతము कनक నుండి పుట్టింది.
- బహువచనం లేక ఏక వచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>కనకం అంటే బంగారము. అతి విలువైన లోహం దీని సాగేగుణం, మెరుపు, త్వరగా నల్లబడని స్వభావం ఆభరణాలకు చేయడానికి అనువుగా ఉంటుంది. పూర్వకాలంలో రాజులు తమ సిం హాసనాలకు, కిరీటాలకు, భోజన పాత్ర లకు వీటిని ఉపయోగించేవాళ్ళు. దీనిని పలుచని రేకు లలా చేసి భోజన పదార్ధాల మీద వేసి భుజిస్తారు.ఆయుర్వేద ఔషదాలలో దీనిని భస్మము చేసి వాడతారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ఉమ్మెత్త
- సంపెంగ
- నల్ల అగలు
నాగకేశరము
- మోదుగ
- సమానార్ధకాలు
- మేలిమిబంగారు
- కుందనము
- మేలిమి
- స్వర్ణము
- పుత్తడి
- కాంచనము
- బంగారము
- సువర్ణము
- పసిడి
- ఉదరి
- కడాని
- కుమారము
- జాళువా
- భృంగారము (భృంగారము ప్రకృతి, బంగారము వికృతి)
- సంబంధిత పదాలు
- కనకపు సింహాసనం.
- కనకాంగి
- కనకాంబరము
- కనకాభిషేకము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"భూతిగడ్డకేల పుట్టించె వాసన, కనకము తనకేమి కల్లజేసె" - వేమన. కనకపు సింహాసనమున శునకంబు కూర్చుండ బెట్టి శుభలగ్నమునన్, దొనరగ పట్టము గట్టిన, వెనుకటి గుణమేల మాను వినురా సుమతీ