బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, a., అందుకొనుట, చేతయెత్తి యిచ్చుట.

 • hand me that book ఆపుస్తకాన్ని యిట్లా అందియియ్యి.
 • he handed her into the room దానికి చెయ్యి యిచ్చియింట్లోకి తీసుకొని వచ్చినాడు.
 • they handed down the estate to him పరంపరగావాండ్ల ఆస్తి వాడికి వచ్చినది.
 • the puranas have handed down this story యీ కథ పురాణాల క్రమముగా వచ్చినది.
 • he handed the house over to me ఆ యింటిని నాపరము చేసినాడు.
 • to hand up ఫిర్యాదు చేసుట.

నామవాచకం, s, చెయ్యి, హస్తము, కరము.

 • I paid him the money with my own hand వాడికి ఆ రూకలు నా చేతులార చెల్లిస్తిని.
 • they bound his hands behind his back వాణ్ని పెడ రెక్కలు విరిచి కట్టినారు.
 • the letter was in my brother's hand i.e. his writing ఆ జాబు మా అన్న అక్షరాలు.
 • he put his hand to the bond ఆ పత్రములో చేవ్రాలు చేసినాడు.
 • witness my hand Rangaya రంగయ్య యెరుగుదను.
 • or palm అరిచెయ్యి, కరతలము.
 • the hollow of the hand పుడిసిలి.
 • the hollow of the joined hands అంజలి.
 • the hand of a clock గడియారపు ముల్లు, బహువచనం. ముండ్లు.
 • he clapped his hands చేతులు తట్టినాడు.
 • to cut off the hands మణికట్లను తెగకొట్టుట, చేతులను తీసివేసుట.
 • (metaphorically) In this I see the hand of God యిందులో యీశ్వర ఘటన తెలుస్తున్నది, by the hand of Providence దైవ యత్నము చేత, దైవవశముగా, దైవాధీనముగా.
 • this is the hand or finger of God యిది యీశ్వర తంత్రము, ఈశ్వరమాయ (Phrases,) a new hand కొత్త మనిషి, చెయి తిరగనివాడు.
 • ten hands were employed in building it దాన్ని పది మంది కట్టుతూ వుండినారు.
 • all hands were engaged in this business అందరు యీ పని మీద వుండినారు.
 • this picture is painted by a celebrated hand యీ పఠమును వ్రాసినది మంచి గొప్ప చెయ్యి అనగా ప్రసిద్ధుడు.
 • I have this news from a sure hand (Addision)నమ్మతగిన వాడి గుండా యీ సమాచారము విన్నాను.
 • will you lend me a hand ? సహాయము చేస్తావా.
 • he tried his hand at the work తన చేత అవుతున్నదో కాదో అని చేసి చూచినాడు.
 • his hand is now in వాడికి యిప్పుడు చెయి తిరిగి వున్నది.
 • when his hand was in వాడికి అందులో ప్రవేశము కలిగివుండినప్పుడు.
 • when you have the pen in your hand నీవు పేనా పట్టి వున్నప్పుడు.
 • the papers that are in my hands నా వద్ద వుండే కాగిదములు.
 • I have the letter in my handజాబు యిదుగో.
 • I have the money in my hands (బహువచనం) ఆ రూకలు నా స్వాధీనములో వున్నవి, నా వశములో వున్నవి.
 • bear a hand ! or make haste త్వరగా కాని, ఆలస్యము చేయవద్దు.
 • hand over hand బిరబిర.
 • the estate passed from hand to hand and at last came to him ఆ యాస్తి వాడి వాడి చేతిలోబడి తుదకు అతనికి చేరినది.
 • the property changed hands ఆ సొత్తు వొకని చెయి విడిచి మరి వొకని చేతికి పోయినది.
 • they came hand in hand చేతులు గూర్చుకొని వచ్చినారు.
 • hand in hand with Telugu he read Tamil తెలుగు అరవము యేక కాలమందు చదివినాడు.
 • they joined hand in hand that business ఆ పనిలో వొక చెయిగా వుండినారు.
 • they are hand and glove with him వాండ్లున్ను అతడున్ను క్షీరోదక న్యాయముగా వున్నారు.
 • he sought her hand దాన్ని పెండ్లి చేసుకో వలెనని యత్నము చేసినాడు.
 • she bestowed her hand on him వాణ్ని పెండ్లాడినది.
 • round hand or text hand బటువైన అక్షరములు, గుండక్షరములు.
 • running hand గొలుసు అక్షరములు.
 • Italian hand జిలుగు అక్షరములు.
 • Roman hand పెద్దక్షరములు.
 • short hand సంకేత లిపి.
 • I had no hand in that business నేను ఆ జోలికి పోలేదు.
 • the estate came into his hands ఆ యాస్తి వాడిపరమైనది.
 • Hands off ! (Johnson) చెయితీ, చెయివిడుపు, విడిచిపెట్టు, అంటవద్దు.
 • On the one hand on the other hand యీ పక్షమందు ఆ పక్షమందు.
 • illness on one hand and hard work on the other వొక తట్టు రోగము వొక తట్టు కష్టము.
 • the poems are all nonsense but on the other hand they teach us the grammar కావ్యములంతా వట్టి పిచ్చి అయితే అందుచేత మనకు వ్యాకరణము తెలుస్తున్నది.
 • it is allowed on all hands that he is the heir అతడు వారసుదారుడై నట్టు వుభయులు వొప్పినారు.
 • a hand at cards కాకితాళ ఆటలో వొకడి చేతికి వచ్చినకాకితాలు.
 • a hand of four inches in measuring horses బెత్త.
 • horse that is sixteen hands high అయిదు అడుగులు బెత్తెడు పొడుగు గల గుర్రము.
 • he did not come into the court with clean hands తనయందు శుద్ధము లేక వుండగా వొకరి మీద కోర్టులో ఫిర్యాదు చేసినాడు.
 • they got the upper hand of him వాణ్ని వంచించినారు.
 • I have my hands full at present ప్రస్తుతము నాకు పని చాలా వున్నది, నా కిప్పుడు తీరదు.
 • you must keep a strict hand over them నీవు వాండ్లకు కొంచెము బెదురుతో వుంచవలసినది.
 • to lay hand on or seize పట్టుకొనుట, అటకాయించుట.
 • the Bishop laid hands on the priest బిషపు వాడి తల మీద హస్తములను వుంచి మంత్రము చెప్పి పాదిరినిగా చేసినాడు.
 • they laid violent hands upon him వాడి మీద దౌర్జన్యమును జరిగించినారు.
 • If I can lay my hand on the book I will send it ఆ పుస్తకము చిక్కితే పంపిస్తాను.
 • he put the last or finishing hand to the work ఆ పనిని తీర్పు చేసినాడు.
 • he put the last or finishing hand to the statue జీవ రేఖలు తీర్చినాడు.
 • at hand తటస్థమైన, దగ్గిరించిన, సన్నిహితమైన.
 • winner was now at hand యింతలో చలి కాలము తటస్థించినది.
 • I received it at his hands వాడి చేతిగుండా పుచ్చుకొన్నాను.
 • I was before hand with him నేను వాడికంటే ముందు మించుకొన్నాను.
 • he was behind hand with the money వాడికి రూకలు జాగ్రత కాలేదు.
 • he was behind hand in preparing this దీన్ని సిద్ధపరచడములో తాత్సారముగా వుండినాడు.
 • the minister took him by the hand and brought him forward మంత్రి అతణ్ని అభిమానించి ముందుకు తెచ్చినాడు.
 • I sent the money by the hand of my brother నా తమ్ముని చేత రూకలు పంపించినాను.
 • she brought the child up by hand ఆ బిడ్డను పోతపాలు పోసి పెంచినది.
 • they live from hand to month నానాటికి తెచ్చుకొని గడుపుకొంటారు నానాటికి తెచ్చుకొని పొట్టపోసుకొంటారు.
 • with a hand high hand డంభముగా, జంభముగా, తమాషాగా.
 • the case in hand జరిగేవ్యాజ్యము.
 • the work is still in hand ఆ పని యింకా తీరలేదు.
 • he took the business in hand ఆరంభించినాడు, మొదలుపెట్టినాడు.
 • he left the case in my hands ఆ వ్యాజ్యాన్ని నాకు వొప్పించినాడు.
 • he came sword in hand ఖడ్గహస్తుడై వచ్చినాడు.
 • payment in hand రొక్కరూకలు.
 • they are in his hands నా వశములో వుండే యిల్లు.
 • I fell into his hands వాడి చేతిలో చిక్కినాను.
 • heplayed into the enemies hand శత్రువులకు అనుకూలముగా నటించినాడు.
 • he took the law into his own hands అధికారిచేయవలసిన శిక్ష ను తానుగా చేసినాడు.
 • he delivered it into their hands దాన్ని వాండ్లకు వొప్పించినాడు.
 • he got the house into his own hands ఆ యింటిని తన స్వాధీనము చేసుకొన్నాడు.
 • off hand తక్షణము, నిరాయాసముగా, లటక్కున.
 • he did the business off hand ఆ పనిని ధారాళముగా చేసినాడు.
 • off hands ! చెయితీ తాకక, I will take the horse off your hands ఆ గుర్రము యొక్క తొందర నీకేల నేను పెట్టుకొంటాను.
 • those goods are still on handసరుకులు యింకా విక్రయము కాలేదు.
 • the estate is still on his hands ఆ సొత్తులు యింకా విక్రయము కాలేదు.
 • he has two daughters on his hand s వాడు యింకా యిద్దరు కూతుండ్లకు పెండ్లి చేయవలసివున్నది.
 • my son died and left a widow and two children on my hands నా కొమారుడు, పెండ్లాన్నిన్ని యిద్దరు బిడ్డలునున్ను నాకాళ్లకట్టి చచ్చినాడు.
 • the time hung heavy on his hands వాడికి ప్రొద్దుపోలేదు.
 • the work I have on hand యిప్పుడు నేను చూస్తలూ వుండే పని.
 • there is much work on hand చేయవలసిన పని చాలా వున్నది.
 • an underhand business కుట్ర, పితలాటకము.
 • he did this in an underhand manner కృత్రిమముగా చేసినాడు.
 • his letter came to hand వాడి జాబు చేరినది.
 • they fought hand to hand చెయిచెయి కలిపి పోట్లాడినారు.
 • he found it was done to his hands వాడు చూచేటప్పటికి సిద్ధము అయి వుండినది.
 • why should you translate it ? it is translated to your hands అది భాఠాంతరమైన సిద్ధముగా వుండగా భాషాంతరము చేయవలసిన శ్రమ నీకెందుకు.
 • why should you fight with him ? he is vaniquished to your hands వోడిపోయిన వాడిమీద యుద్ధ మెందుకు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hand&oldid=933527" నుండి వెలికితీశారు