బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, పడడము, పతనము.

క్రియ, నామవాచకం, పడుట.

 • his countenance fell (In Gen. iv. 6.విషణ్నవదనుడాయెను.)వాడి ముఖము పెంకువలె అయినది.
 • dew or rain falls కురుస్తున్నది.
 • the price of rice fell బియ్యము వెల తరిగినది.
 • the wind fell గాలి అణిగినది.
 • the stream or tide fell ప్రవాహము తీసిపోయినది, పోటు అణిగినది, పాటు వచ్చినది.
 • the leaves fell ఆకులు రాలినవి.
 • when the shadow fell upon this line ఆ నీడయీ గీత మీదకి వచ్చినప్పుడు.
 • he fell in the field యుద్ధరంగంలో చచ్చినాడు.
 • he fell a victim to love మరుబారిపడ్డాడు.
 • It fell to his lot tobreak his leg వాడి అదృష్టము వాడి కాలు విరిగినది.
 • It fell to my shareఅది నాపాలిటికి వచ్చినది.
 • the estate fell to him ఆ యాస్తికి వాడికివచ్చనది.
 • he fell asleep నిద్రపోయినాడు.
 • they fell down at his feetin homage సాష్టాంగదణ్నములు బెట్టినారు, వాడి కాళ్లమీద పడ్డారు.
 • he has fallena away చిక్కిపోయినాడు, కృశించిపోయినాడు, సన్ననూలు వడికినాడు.
 • his face has fallen away వాడి ముఖము పీల్చుకపోయినది.
 • the family has fallen awy ఆ కుటుంబం నశించిపోయినది.
 • he fell awayfrom God ఆ రూఢ పతితుడైనాడు.
 • they fell away from him అతనియందు భక్తిని విడిచినారు.
 • his friends fell away from him స్నేహితులు అతణ్ని చేయి విడిచినారు.
 • the troops fell back ఆ బారు వెనక్కు వెనక్కే అడుగు బెట్టుకొని జరిగినది, ఆ బారు వెనక్కు నడిచినది.
 • the army fell back to the village ఆ వూరికి వచ్చినది.
 • our troops fell back upon the wood మా సేన మళ్లి తిప్పుకొని ఆ యడవికివచ్చినది.
 • అనగా ముందు మించిదాటిపోయిన ఆ యడవి కే వచ్చినదనుట.
 • hefell back from his promise వాడు ఆడిన మాట తప్పినాడు.
 • the boy fell back in learning ఆ పిల్లకాయ చదువులో జబ్బు అయినాడు వెనక్కుపడ్డాడు.
 • he walked on and she fell behind.
 • వాడు ముందు మించిపోయినాడు.
 • అది వెనక చిక్కినది, వెనకబడ్డది.
 • his boat fellclear of mine వాడి పడవ నా పడవమీద తగలకుండా తొలిగిపోయినది.
 • the boat fell down the river పడవ ప్రవాహమును అనుసరించి పోయినది.
 • when the bill falls due హుండి గడువు నాటికి.
 • his boat fell foul of mineవాడి పడవ నాపడవ వొకటితో వొకటి కొట్టుకొన్నది.
 • his carriagefell foul of mine వాడి బండి నా బండి వొకటితో వొకటి కొట్టుకొన్నది.
 • he fell foul of them వాండ్ల మీద తిరిగినాడు, అనగా రేగినాడు.
 • he fell in debt వాడు అప్పులపాలైనాడు.
 • the roof has fallen inఆ యింటి పై కప్పు కూలినది.
 • the well has fallen in ఆ బావి పడిపోయినది.
 • the horse has fallen in flesh ఆ గుర్రము చిక్కిపోయినది, బక్కచిక్కినది.
 • he fell in love with her దానియందు వ్యామోహపడ్డాడు.
 • he fell in withthem వాండ్లలో అయిక్యమైనాడు, వాండ్లతో కలుసుకొన్నాడు.
 • his opinion fallsin with mine వాడి అభిప్రాయమున్ను నాదిన్ని వొకటిగానే వున్నది.
 • he fellin with them on the road దోవలో వాడికి వాండ్లు అడ్డుపడ్డారు, యెదురు పడ్డారు.
 • where did you fall in with the horse ఆ గుర్రము నీకు యెక్కడ చిక్కినది.
 • తగిలినది.
 • they fell into conversation మాటల్లో పడ్డారు, మాట్లాడసాగారు.
 • the river falls into the sea ఆ యేరు సముద్రగామి అవుతున్నది.
 • he fell intothe procession ఆ వూరేగింపులో కలుసుకొని పోయినారు.
 • he fell into thesnare వాడు వలలో చిక్కినాడు, తగులుకొన్నాడు, మోసపోయినాడు.
 • he fell in to the hands of the enemy శత్రువు లచేత చిక్కినాడు.
 • he fell intosin పాపగ్రస్తుడైనాడు.
 • he fell into apostasy మత భ్రష్టుడైనాడు.
 • he fell into disgrace అవమానపడ్డాడు.
 • the horse fell lame గుర్రము కుంటిది అయినది.
 • the rope fell loose దారము వదిలింది, ఆ కట్టు వదిలింది.
 • when it fell night చీకటి కాగానే, చీకటి పడగానే.
 • In age the hair fallsoff యేండ్లు చెల్లితే వెంట్రుకలు రాలిపోతవి, వూడిపోతవి.
 • his hat felloff వాడి టోపి పడిపోయినది.
 • his health begins to fall off వాడికి ఆరోగ్యము మట్టు పడడమునకు ఆరంభించినది.
 • the school is now falling off ఆ పల్లె కూటము యిప్పట్లో క్షీణగతిగా వున్నది.
 • they fell on their knees వాండ్లు మోకాలించినారు.
 • he fell on his back వెల్ల వెలికలపడ్డాడు.
 • he fell on his belly బోర్లపడ్డాడు.
 • the feast falls on the 5th ఆ పండుగ అయిదో తేదీ వస్తున్నది.
 • when my eye fell upon him వాడి మీద నాదృష్టి పారినప్పుడు.
 • the truth fell out నిజము బయటపడ్డది.
 • it fell out that the house was vacant ఆ యిల్లు వూరక వుండేటట్టుసంభవించినది.
 • they fell out or wrangled వాండ్లకు కలహము వచ్చినది.
 • he fell sick రోగముతో పడ్డాడు.
 • to fall to మొదలుబెట్టుట,ఆరంభించుట.
 • the whole party then fell to అందరు భోజనము చేయసాగినారు, మొదలుబెట్టినారు.
 • this word falls under that ruleయీ శబ్ధమునకుసూత్రము ఆధారముగా వున్నది.
 • to let fall జారవిడుచుట.
 • some words that he let fall వాడి నోరు జారివచ్చిన మాటలు.
 • wemust take care of lambs at their first falling గొర్రెపిల్ల లనువేసేటప్పుడు మనము జాగ్రత్తగా వుండవలసినది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fall&oldid=931069" నుండి వెలికితీశారు