నోరు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నోరు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
- నోళ్ళు.
అర్థ వివరణ
<small>మార్చు</small>శరీరానికి కావలసిన ఆహారాన్ని అందించే ప్రవేశ చ్వారం నోరు.నాలుక,దంతాలు,పిండి పదార్ధాలను గ్లూకోజ్ గామార్చే లాలాజల గ్రంధులు కలిగిన భాగం
- పుణ్యకార్యములు చేయు మన దేహభాగములలో ఒకటి. ఆ సప్తదేహపుణ్య కార్యములు:...... 1. మనస్సు. దేవుని యందు భక్తి కలిగి వుండుట. 2. నోరు, దేవుని నామము స్మరించుట. 3. చేతులు, దేవుని పూజించుట. 4. కాళ్ళు , దేవాలయమునకు పోవుట. 5. కన్నులు, దేవుని కన్నులార కాంచుట. 6. చెవులు , దేవుని కథలువినుట, 7. శిరస్సు, దేవునికి వందనము చేయుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
నోటిలో / నోటిమాట / నోట్లో మట్టిగొట్టు / నోరు వాయి/
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "నోరు మాట్లాడు తుంది నొసలు వెక్కిరిస్తుంది" అనగా మనసులో ఒకటి వుంచుకొని బయటకు మరొకటి మాట్లాడె వాడని అర్థం.
- "నోరు పారేసుకోద్దు" అనగా తప్పుడు మాటలు మాట్లాడొద్దని అర్థం:
- "నోరు మంచి దయితే ఊరు మంచిది అవుతుంది" అనగా అందరితొ మంచిగా మాట్లాడాలని అర్థం.
- "నోరెళ్ల బెట్టాడు" అనగా ఆచ్యర్య పడ్డాడని అర్థం.
- ఒక పద్యంలో పద ప్రయోగము: ఇమ్ముగ జదవని నోరును, అమ్మాయని పిలిచి అన్న మడగని నోరున్, తమ్ముల బిలువని నోరును, కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ