బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, (an idiot) పుట్టు వెర్రివాడు, వట్టిపశువు.

విశేషణం,

  • I. Produced or effected by nature, not artificial సహజమైన, స్వాభావికమైన, తనకు తానే కలిగిన.
  • a river is a natural stream, but a canal is artificial ఏరు దైవనిర్మితమైనది, కాలవ మనుష్యకృతమైనది.
  • this place is a natural garden ఇక్కడ స్వయంగా, వుద్భవించిన వొక తోట వున్నది.
  • a natural mark on the skin పుట్టుమచ్చ.
  • wine has a natural tendency to produce intoxication మైకము చేసేది సారాయికి సహజ గుణము.
  • a natural image, not carved by human hands స్వయంభువైన విగ్రహము, స్వయంవ్యక్తమైన విగ్రహము.
  • the fort has good natural defences ఆ కోటకు దైవ నిర్మతమైన రక్షణ వున్నది, అనగా కొండ, నది, అడవి మొదలైనవి.
  • a head three times the natural size సహజమైన తల కంటే మూడింతలుగా వుండే తల.
  • a diamond in its natural form దళముగా వుండే వజ్రము, పని చేయని వజ్రము.
  • when he lost his natural father కన్నతండ్రి చచ్చినప్పుడు.
  • the hair of his head was like a natural firework, erect and bristling వాని తల వెంట్రుకలు దేవనిర్మితమైన, బురుసు వలే నిక్కబొడుచుకొని పెళుచుగా వుండెను.
  • II. illigitimate, not legal పరస్త్రీకి పుట్టిన.
  • a natural son పర స్త్రీకి పుట్టిన కొడుకు, ఉంచుకున్నదాని కొడుకు.
  • III. bestowed by nature, not acquired జన్మతః కలిగిన, నైజమైన.
  • there is a natural enimity between the cat and the rat పిల్లికి యెలుకకు జన్మవైరము.
  • he has a natural turn for music వానికి సంగీతము తనకుతానే వస్తుంది.
  • a natural disposition స్వభావగుణము, నైజగుణము.
  • the natural frame ప్రాకృత శరీరము, స్థూల శరీరము.
  • IV. not forced, not farfetched: dictated by nature సరళమైన.
  • this book is written in a good natural style ఈ గ్రంధము మంచి సరళమైనశైలిలో వ్రాయబడినది.
  • V. following the stated course of things క్రమమైన.
  • there are the natural consequences of your folly నీ పిచ్చితనమునకు యిది కావలసినది సిద్ధమే.
  • youth is a sort of natural intoxication యవ్వనము తనంతటనే పుట్టే వొక మదము.
  • the natural period of life సహజమైన ఆయుస్సు.
  • during his natural life ప్రాణము వుండేదాక.
  • VI. consonant to natural notions ప్రకృతి సిద్ధమైన.
  • through a natural blindness to the faults of his son కొడుకు చేసే తప్పులు తండ్రికి కనపడకపోవడము సహజం గనుక.
  • VII. discoverable by reason; not revealed స్వతస్సిద్ధమైన, స్పష్టమైన.
  • history జీవకోటి వర్ణనము.
  • the natural history of this country ఈ దేశములో వుండే జీవులను గురించిన గ్రంధము.
  • natural theology సృష్టిగుండా సృష్టికర్తను వూహించే శాస్త్రము.
  • natural religion సృష్టిద్వారా సృష్టికర్తను వూహించే మతము, సమస్తమూ ప్రకృతిసిద్ధమనే మతము, ప్రకృత్యా కలుగుతున్నదనే మతము.
  • elements of natural philosophy (Yates says) పదార్థ విద్యాసారము.
  • VIII. tender: affectionate by nature కరుణ గల, కనికరము గల.
  • devoid of natural affection స్నేహరహితమైన,కనికరము లేని.
  • natural feelings prompted her to save her child కన్న కడుపు గనక తానడ్డపడి బిడ్డను తప్పించినది.
  • IX. unaffected, according to truth or reality తద్వత్తైన, వున్నది వున్నట్టుగా వుండే,అకృత్రిమమైన.
  • they used very natural language వారు తద్వత్తుగా మాట్లాడినారు.
  • this is a very natural description of the marriage ఇది ఆ వివాహము యొక్క తద్వత్తైన వర్ణనము.
  • X. opposed to violent as a natural death న్యాయమైన, a natural death న్యాయమైన చావు, కాల మరణము.
  • one was murdered, the other died a natural death వొకడికి దుర్మరణము సంభవించినది, వొకడు కాలమువచ్చి చచ్చినాడు.
  • in puris naturalibus దిగంబరముగా.
  • the natural day ఉదయాస్తమనముల ప్రకారముగా వుండే దినము, అనగా గంటల ప్రకారము కల్పితమైన దినము కాదు.
  • the natural man ప్రాకృతుడు.
  • not spiritual అధిభౌతికమైన.
  • the natural man is opposed to the spiritual man విషయాసక్తికిన్ని విరక్తికిన్ని విరుద్ధము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=natural&oldid=938737" నుండి వెలికితీశారు