విక్షనరీ:రచ్చబండ/పాత చర్చ 3
|
డా.రాజశేఖర్ స్పందన
<small>మార్చు</small>- భాస్కరనాయుడుగారు 8 నెలలు శ్రమించి 30,000 వేల విక్షనరీ పేజీలను యాంత్రికంగా తయారుచేస్తే (ప్రదీప్ గారు బాటును ఉపయోగించి మాత్రమే ఇంతటి పనిచేయగలిగారు) ప్రసాద్ గారిలాంటి సీనియర్ సభ్యులు అవి నిరుపయోగం అనడం చాలా తప్పు. ఆయనికి ఆ పని చేయమని చెప్పింది నేను కాబట్టి ఆ ? తప్పు ఏదైనా వుంటే అది నాదేనని భావిస్తున్నాను. ఎవరో నేర్పించాలి, ఏదో ఎవరో చేయాలి అనడం కన్నా మీరే ఆ పని చేయవచ్చును కదా. మీరు చేసిన చిన్న తప్పులకు గుర్తించి వాటిని సరిచేయడానికి ప్రయత్నించడం కూడా తప్పంటారేమో.Rajasekhar1961 (చర్చ) 13:14, 3 మే 2013 (UTC)
- Rajasekhar1961 గారు, మీరు అసలు విషయాల్ని సరిగా అర్థం చేసుకోవడము లేదనే అనిపిస్తున్నది. మీరే చెబుతున్నారు అవి యాంత్రికంగా తయారు చేసినవి, మీరు ఆ పని చేయమని చెప్పాను అని అంటున్నారు. యాంత్రికంగా చేసినవి అవి సరిగా లేవనే నేను చెప్పేది. అది తప్పు ఎలా అవుతుంది. అసలు ఆ పేజీలు ఎలా ఉండాలో ఒకసారి కొన్ని పేజీలలో చర్చలు చేద్దాము. ఒకరిని పని చేయమని చెప్పలేము. ఎవరు చెప్పినా చేయనవసరము లేదు ఎవరికి. కాని ఎవరైనా పని చేస్తున్నప్పుడు ఆ పని ఎలా చేయాలో అప్పుడే చెబితే చేసిన పని మరల మరలా చేయనవసరముండదు అని నేను చెబుతున్నాను. తప్పులు ఎవరయిన సరిదిద్ద వచ్చును. మీకు తెలియదేమో నాయుడు గారు చేసిన పేజీలలో నేను సరిదిద్దుతున్నాను. ఆయన గమనించటము లేదు. మీరు గమనించి ఆయనకు చెప్పండి. ఎలా చేయాలో. అందరికీ శ్రమ తగ్గుతుంది. నాకు తెలిసినది అసలు పదాలు ఎలా పొందు పరచాలో, నేను వ్రాసినవి చూడండి. ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేదే లేదు. మీరు సరిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 16:43, 3 మే 2013 (UTC)
మే నెల 3 వ తారీఖున JVRKPRASAD గారు విక్షనరీ రచ్చ బండలో నాపై వ్వక్తి గత నిందారోపణలకు నాస్పందన
<small>మార్చు</small>[[వారు వ్రాసినది: భాస్కరనాయుడు గారు వ్రాసిన వేలపదాలు విక్షనరీ నిబంనలకు అనుగుణంగా ఖచ్చితంగా లేవు. ఆ విషయాన్ని ప్రతి పేజీలోను వ్రాయగలను ....................... ....................... ........................... ]]
== పైన కనబరిచిన ఆరోపణకు నాస్పందన==(నాపేరు పెట్టి వ్వక్తి గతంగా వ్రాసి నందున నేను కూద వ్వక్తిగతంగానే స్పందించాను)
(అంతియే గాక..... ఈ విషయంలో మిగతా వాడుకరులు, నిర్వహకులు, అధికారులు కూడ త్వరగా స్పందించి తమ అభిప్రాయాలను తెలియ జేయవలసినదిగా..అభ్యర్థన)
- 1. నేను వ్రాసిన వన్నీ తప్పులు గా అనిపిస్తే.... నిర్థారణ చేసుకొని అన్ని రద్దు చేయండి.
- 2. మీరు నాకొక పథకాన్ని బహూకరించారు. అది అచంచలంగా తిరుగుతున్న చక్రం. దాని క్రింద ఇలా వ్రాశారు. విక్ష్నరీలో మీరు చేసిన అద్వితీయ కృషికి గుర్తింపుగా ఈ పథకాన్ని సమర్పిస్తున్నాను, ఆలస్యమైనందుకు అన్యదా భావించకండీ. అని. అది కూడ ఈ మద్యనే ఇచ్చారు. ఈ కొద్ది రోజుల్లోనె... నేను వ్రాసినవి శుద్ధ తప్పులుగా కనిపించాయా.? మొన్న నా వ్రాతలు అద్వితీయంగా కనబడి కొన్ని రోజులకే అవన్నీ శుద్ధ తప్పులుగా ఎలా కనించాయి? కారణం తెలుపగలరా?... తప్పులు వాసినవారికి పథకాలు ఇస్తే ఇచ్చినవారికి అవమానము కాదా? కనుక మీరిచ్చిన ఆ పథకాన్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాను. (అసలు దానిని నేనింత వరకు గ్రహించనేలేదు.)
- 3. పేరు పెట్టి ఇతని వ్రాతలు ఖచ్చితంగా నిబందనలకు విరుద్దం తప్పూ అని వ్వక్తి గతంగా నిందించడము సభ్యతగా వుందా? నిజంగా తప్పులు వుంటే ఆనాడే సలహాలిచ్చి మేల్కొలిపి వుండవచ్చు గదా? పైగా తమరు నిర్వహకునిగా కూడా వున్నారు. అలా వాడుకరులను సలహాలతో సరి దిద్దడం నిర్వాహుకుల భాద్యత అని నేనను కుంటున్నాను. ఇంకేదైనా కారణంగా మనిద్దరి మధ్యావిభేదాలున్నాయనుకున్నా వ్వక్తిగతంగాగానీ, చర్చల్లోగాని మనం ఇంతవరుకు మాట్లాడుకోనే లేదు. ఆ అవకాశం లేదు.
4. ఎవరిపనులు వారు చేసుకుంటున్నా (వికీకి సంబందించి) లేకున్నా ఇతరులు చేస్తున్న పనులలో లేని తప్పులు వెతకవచ్చు, వ్వక్తిగతంగా ఆరోపణనలుచేయనూ వచ్చు... ననే కొత్త పందాకి తెర తీశారు. ఇది ఎంతవరకూ దారి తీస్తుందో వేచి చూడాలి.
ఎల్లంకి (చర్చ) 15:59, 3 మే 2013 (UTC) భాస్కరనాయుడు
```` భాస్కరనాయుడు
(నాపైవ్వక్తిగత నిందారోపణలకు మరేదైనా కారణాలున్నాయా??????? ఆలోచించాలి.... అంత వరకు సెలవ్) సశేషం. మిగతా వచ్చే సంచికలో...... ఎల్లంకి (చర్చ) 16:00, 3 మే 2013 (UTC)
మే నెల 3 వ తారీఖున,2013 ఎల్లంకి గారు విక్షనరీ రచ్చ బండలో నాపై వ్వక్తి గత నిందారోపణలకు నాస్పందన,
<small>మార్చు</small>తదుపరి, మీరు ఒక వాక్యభాగాన్ని వ్రాయడము కాదు. ఇది చర్చలోని కొంతభాగం చదవండి. [<pre> [[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] గారు, నేను ఏ పనికి అనవసర హోదా కల్పించుట లేదు. ఆ పదవులు ఏమిటో ఒక మాజీ నిర్వాహకునిగా నాకు కొంత అవగాహన ఉంది. ఎవరు ఏ పదవులలో ఉన్నా వారి నాణ్యమైన సేవలు ఎంతవరకు సభ్యులకు అందుబాటులో ఉంటాయి అని నేను వాదించేది. ఎంతో ఆసక్తి గల ఒక వాడుకరి తను చేయు పని గురించి వికీ పద్ధతులలో సరి అయిన మార్గములో పదవులలో ఉన్నవారు దారి చూపించితే, ఆ వాడుకరి మరికొంత మెరుగైన సేవలు (కొత్త పనులు) అందించటానికి ఆస్కారము ఉంటుంది. అలా కాకుండా కొన్ని సంవత్సరాల తదుపరి ఎప్పుడో మొదటగా మొదలు పెట్టి పొందుపరచినవి వికీ నియమాలకు విరుద్ధము అని పదవులలో ఉన్నవారు చెప్పి, ఆ పని అంతా తొలగిస్తే ఆ వాడుకరి మానసిక పరిస్థితి, స్థితి ఎలా ఉంటుంది ? ఉదా. భాస్కర నాయుడు గారు పొందు పరచిన వేల పేజీలు వికీ (విక్షనరీ) పద్ధతులకు అనుగుణంగా ఖచ్చితంగా లేవు. ఆ లోపాలు గురించి ప్రతి పేజీలో వ్రాయమంటే వ్రాస్తాను. మరి ఎవరూ ఆ విషయము ఈ రోజువరకు వారికి ఎలా చేయాలో తెలియ చెప్పరు. నేను నాయుడుగారికి చెప్పాను. సమాధానము అడగలేదు.]
దానితో పాటు మొత్తం చర్చలు, అందరి సమాధానాలు చదవండి. అసలు మొత్తం చర్చలు ఒకటికి నాలుగు సార్లు చదవండి, చదివించండి (అందరికీ ఒకేలా ఒకే స్పందన ఉండదు కాబట్టి). నేను మీరు వ్రాసినవి రద్దు చేయటానికి కాదు నా చర్చ. మీరు (నాయుడు గారు) వ్రాసిన పేజీలలో కూడా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు అవి ఉంచుతారా లేక తొలగిస్తారా లేక సరి చేయాలా అని అడగటము జరిగింది. అది వ్యక్తిని అన్నట్లు ఎలా అవుతుంది ? వ్యక్తిగతంగా తీసుకోనవసరము ఏముంది ? ఇవి అసెంబ్లీ చర్చలు కావు. నేను లేకుండా నా పేరు ఎందుకు ప్రస్తావించారు అనటానికి. మీగురించి వచ్చిన ఆ చర్చల విషయానికి వస్తే, మీరు ఊహించి, స్పందించి, పైన పొందు పరచిన ఆ అంశాలు అంతలా వ్రాయవలసిన అవసరము లేదు. మీగురించి వచ్చిన చర్చ కేవలము మీరు రూపొందించిన వేల పేజీలు తొలగిస్తే మీలాంటి వారు మానసికంగా బాధ పడతారు. అందువల్ల ముందుగా కొత్తవారికి, పాతవారు (మీకు తెలిసిన వారు ఎవరైనా ఒకరైనా ఉంటారు కదా) నేర్పితే ముందు ముందు దిద్దుబాట్లు పని సమస్యలు వెంటవెంటనే రావు అని మాత్రమే. ఎవరూ ఎవరికి పనులు నేర్పించక్కర్లేదు. చేయాలనుకునే చేసే ఏ కాస్త పని అయినా సవ్యంగా చేస్తే మళ్ళీ మళ్ళీ మార్పులు చేసే శ్రమ తగ్గుతుంది. అసలు నేను నిర్వాహకుడిని కాదు. నాకు ఏ పేజీ రద్దు చేసే అధికారమూ లేదు. నేను ఒకరికి సలహాలు చెప్పనవసరము అసలు లేదు, ఎవరయినా ప్రత్యేకంగా అడిగితే తప్ప. అది కూడా నాకు తెలిసినంత వరకే. నాకు అసలు ఏం తెలుసు ? తెలిసింది కాస్త అడిగితే తెలియ జెప్పడము. అంతేకాని పని చెయ్యమని చెప్పను. మీకు సలహాలు ఎప్పుడు ఇచ్చానో లింకు, ఎప్పుడు మీ పేజీలను సరి చేశానో లింకులు చూసి ఇక్కడే ఇస్తాను. బయట ప్రతివారికి కావలసిన అండదండలు ఉంటాయి. అదివేరు. నిజజీవితానికి ఇక్కడ ప్రతిబింబించదు. మరోటి, ప్రతిసారి మీతోపాటు కొందరు నేను నిర్వాహకుడిని కాదు అని తెలిసి కూడా, కాని, నన్ను పేజీలను రద్దు చేయమని అడుగుతున్నారు. నేను మీలానే మామూలు సభ్యుడిని మాత్రమే. తదుపరి మీకు ఒక పథకాన్ని ఒకటి బహూకరించాను మీరు కష్టపడి పని చేస్తున్నారు అని. నాకు కూడా చక్రాలు ఇచ్చారు. చాలా మంది పొగిడారు. నన్ను ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లోనే నా పనులు పనికిరానివని, చెడ్డవాడినని, అనవసర చర్చలు చేస్తున్నారు కొందరు. ఎందుకనో మరి నాకు అర్థం కావడము లేదు. మీరు చేసిన పనులు, నేను చేసిన పనులు ఇప్పుడు పనికి రానివి చెప్పండి, తొలగిస్తాము అని ఒక చర్చలో ప్రస్తావించారు. అందుకని చెప్పాను. అందరినీ అడిగేది ఒకటే. ఏ పని ఎవరు చేస్తున్నా, చేసినా...ఆ పని వికీ నియమాలకు లేదా విక్షనరీకి విరుద్ధంగా ఉందని ఎవరయినా గమనిస్తే ఆ విషయము మీకైనా, నాకైనా, ఎవరికయినా వీలయినంత త్వరలో తెలిస్తే ఆ పని సరిదిద్దు కుంటాము. మనము చేసిన పని కంటే ఎవరయినా మెరుగుగా పని చేస్తాము అని ఒక నమూనా చూపినా అందరమూ ఆమోదిస్తే ఆ కొత్త పద్ధతి పాటించ వచ్చును. ఇప్పటికయినా మీకు తెలిసిన విక్షనరీలో పేజీలు ఎలా పొందుపరచాలో చెప్పండి. అది చర్చలో పెట్టి అదే పద్ధతి పాటించుదాము. మీరు డా.రాజశేఖర్ గారికి తెలిసిన వారు అని నాకు తెలుసు. మీరు, పాలగిరి గారు కష్టపడి ఇక్కడ పని చేస్తున్నారు అని, కొత్తవారిని ప్రోత్సహించాలని, నాకు అర్హత లేకపోయినా, అధిక మార్పులు చేసిన వారికి పతకము ప్రోత్సాహము ఇవ్వడము చేశాను. అది పని నాణ్యతగా నేను కొలమానముగా తీసుకోలేదు. మీకు సలహాలు, మీరు పొందు పరచిన పేజీ పుటలలో మార్పులు ఇదివరకు చేశాను. మీరు గమనించటము లేదు. పాలగిరి గారు తెలుసుకుంటున్నారు. అడుగుతున్నారు. నేను నిర్వాహకుడిని కాదు. ఒకరి పనుల గురించి మరొకరు వ్రాయడము మీకు కొత్తగా ఉంది. అది వికీలలో అందరూ వ్రాస్తునే ఉన్నారు. ఎంతవరకు దారి తీయడానికి ఇందులో ఏముంది ? చిత్తగించండి. శలవు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 17:01, 3 మే 2013 (UTC) (అంతియే గాక..... ఈ విషయంలో మిగతా వాడుకరులు, నిర్వహకులు, అధికారులు కూడ త్వరగా స్పందించి తమ అభిప్రాయాలను తెలియ జేయవలసినదిగా..అభ్యర్థన)
- ఇలా ఒక ఫార్మాటింగు పద్ధతి లేకుండా అస్తవ్యస్తంగా వ్రాయటం వళ్ళ చదవటానికి కష్టంగా ఉంది. మిగిలిన వాళ్ళు చదవాలనుకుంటే వికీ పద్ధతిలో సరళంగా ఉంచగలరు. వ్యాఖ్యలు యధాతధంగా ఉదహరించాలంటే <pre> </pre>ట్యాగులను ఉపయోగించగలరు --వైజాసత్య (చర్చ) 02:28, 4 మే 2013 (UTC)
అసలేం జరిగింది / జరుగుతుంది
<small>మార్చు</small>సమస్యను అర్ధం చేసుకునే క్రమంలో కొన్ని ప్రశ్నలు. వ్యక్తిగత దూషణలు/ ఆరోపణలు చెయ్యకుండా సమాధానం ఇవ్వగలరు. ఈ ప్రశ్నలు ప్రసాద్ గారికే. మిగిలిన వారు కాస్త ఈ చర్చను ఇలాగే వదిలెయ్యమని ప్రార్ధన.
- "ఈ కొద్ది రోజుల్లోనే నా పనులు పనికిరానివని, చెడ్డవాడినని, అనవసర చర్చలు చేస్తున్నారు" - ఎందుకిలా అనిపించింది. ఇలాంటి చర్చలు ఎక్కడ జరిగాయో ఆ చర్చలకు లింకులు ఇవ్వగలరు. (ఇక్కడ అతికించక్కర లేదు)
- ఇంకో చర్చలో విక్షనరీలో కోటరీ నడుస్తుందని అన్నారు. మీకు ఎందుకలా అనిపించింది?
ఇక నా అభిప్రాయాలుమ్ కొన్ని
- తోటి సభ్యులను ప్రోత్సహించడానికి అర్హత అవసరం లేదు.
- మీరు కొన్నాళ్ళు నిర్వాహకుడిగా పనిచేశారు కాబట్టి, మిమ్మల్ని కొన్ని నిర్వాహణ పనులు చేయమని అడిగి ఉండవచ్చు. అందులో నాకు తప్పేమీ కనిపించడం లేదు. మీరు నన్ను విక్షనరీలో అధికారిని అని అనుకున్నట్టే వారూ మిమ్మల్ని నిర్వాహకులని అనుకొని ఉండవచ్చు.
--వైజాసత్య (చర్చ) 02:54, 4 మే 2013 (UTC)
వైజాసత్య గారికి,
- పై మొత్తం సంభాషణ వ్యాఖ్యలు వల్ల [2] నాకు అలా అనిపించాయి. మానసికంగా తప్ప అక్షర రూపంలో ఖచ్చితంగా చూపించలేనేమో ?
- కోటరీ కూడా అలాంటిదే. ఈ నెలలో చర్చలు అన్నీ చూస్తున్నారు. కొన్నాళ్ళ తరువాత మీరే గమనించండి.
మీ అభిప్రాయాలు: నా సమాధానము
- మీరన్నట్లు తోటి సభ్యులను ప్రోత్సహించడానికి అర్హత అవసరం లేదు. ప్రస్తుత కాల పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు. అందుకనే నాకు ఇలాంటి అనుభవాలు ఈ నెలలోనే జరుగుతున్నాయి. ఎప్పుడూ లేదు. కానీ నాకు మిత్ర సభ్యులు తక్కువయితే నేనే కొంతకాలము మౌనముగా ఉండటము మంచిదేమో ?
- నేను అందరికీ నేను విగత (మాజీ) నిర్వాహాకుడిని అని అందరికీ తెలుసు. అయినా చాలా సందర్భాలలో నేను మాజీని అని కూడా తెలియచెప్పాను.
ప్రస్తుతానికి ఎక్కడా ఎటువంటి చర్చలు నేను చేయకుండా, పాల్గొనకుండా కొంతకాలము నన్ను దూరంగా ఉంచే విధంగా, నేను ఉండే విధంగా దయచేసి అందరూ సహకరించగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 03:55, 4 మే 2013 (UTC)
- మీలాంటి అనుభవమున్న సభ్యున్ని విక్షనరీ కోల్పోతున్నందుకు చింతిస్తున్నాను. కొన్నాళ్ళు విరామం తీసుకొని మళ్ళీ వస్తారని ఆశిస్తున్నాను --వైజాసత్య (చర్చ) 05:51, 4 మే 2013 (UTC)
వ్యుత్పత్తి-సందేహము
<small>మార్చు</small>వ్యుత్పత్తి అనగా పుట్టుక లేదా మూలం అనికదా అర్థము.ఇంగ్లీసు విక్షనరీలో Etymology అంటారు.అనగా ఆపదము యొక్క పుట్టుక మూలమేదని. తెలుగులోని కొన్ని పదాలు ఇతర భాషల నుండి వచ్చాయి.అనగా ఆపదాలు ఆభాషలలో వ్యుత్పత్తి అయ్యాయని అర్థము. అవే తత్సమము (సంస్కృతసమము), తత్బవము (తత్+భవము),దేశ్యము (తెలుగు), వైకృతము (ప్రాకృతసమమును సంస్కృతప్రాకృతభవము నైన పదము), ద్వయము (వైకృతమును దేశ్యమును మిశ్రమైన పదము), ఉభయము (కొన్ని యర్థములయందు అచ్చతెనుగు, కొన్నియర్థములయందు సంస్కృతమునైనపదము), యుగళము (కొన్నియర్థములయందు దేశ్యమును, కొన్నియర్థములయందు వైకృతమును అయ్యినపదము) ఇత్యాదులు అనినా భావన. విక్షనరీలో వ్యుత్పత్తి స్థానములో అర్థవివరణ లేదా పదకలయికను వ్యుత్పత్తిగా చూపుచున్నారు.ఉదా: శ్వేతాద్రి పదానికి 'తెల్లని పర్వతము ను వ్యుత్పత్తిగా చూపారు.కాని శ్వేత+అద్రి రెండు సంస్కృత పదాలు, కావున ఆపదము సంస్కృతసమము అవుతుందిఅని నా భావన. ఇలాంటివి వేలసంఖ్యలో వున్నాయి.కొన్ని చోట్ల క్రియలను, విశేషణాలను నామవాచకముగా చూపారు. ఇక్కడ నేను ఏ సభ్యుడను వ్యక్తిగతంగా తప్పుపట్టటంలేదు.అందువలన వ్యుత్పత్తి అనగా ఎది సరియైనదో సహసభ్యులు తెలుపవలసినదిగా కోరుచున్నాను. ఎందుకనగా, నేను పదములను దిద్దుబాటు చేయునప్పుడు వ్యుత్పత్తి అనివున్నచోట సంస్కృతసమము, దేశ్యము, ఉభయము, దేశ్యము అంటూ చేర్చుచున్నాను. ఒకవేళ నాదిద్దుబాట్లు తప్పయినచో, అలా చెయ్యకుండ మునుముందు జాగ్రత్త పడగలను.పాలగిరి (చర్చ) 02:53, 6 మే 2013 (UTC)
- మీరు చెప్పింది సరైనదే. అసలు ఉండాల్సింది అలాగే. కాని సంధి వచ్చిన పదాలను మూల పదాల మాదిరిగా చూడకూడదు. ఇంకా స్పష్టంగా అర్ధ వివరణలో సంధిగురించి వివరించవచ్చును. మూలపదాలకు మీరు చెప్పిన పద్ధతిలో ఆంగ్ల విక్షనరీలో పాటిస్తారు. తెలుగులో నేను మొదలుపెట్టాను. ఒకసారి వర్గం:సంస్కృతం నుండి పుట్టిన తెలుగు పదాలు చూడండి. వ్యాసాలు విస్తరిస్తుంటే తరువాతి కార్యక్రమంలో మనం వ్యుత్పత్తి ని కూడా ఉద్యమంలాగా చేద్దాము. ప్రస్తుతానికి వ్యుత్పత్తిలో తత్సమము మొదలైనవి చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 16:01, 6 మే 2013 (UTC)
పాలగిరిగారూ ! విక్షనరీ సభ్యులకు తెలుగు తెలుసు కానీ పాండిత్యం ఉండదు. చిన్నప్పుడు చదివినవి గుర్తుకు తెచ్చుకుని వ్రాస్తున్నవి చాలా ఉంటాయి. కనుక నామవాచకము, క్రియ, విశేషణము, క్రియావిశేషణము విషయంలో కొన్ని చోట్ల అయోమయం నెలకొంటున్న మాట నిజం. మీరు గమనించినప్పుడు వాటిని సరిచేయండి. ఉతపత్తికి పదము యొక్క మూలము వ్రాయచ్చు. ఉదాహరణకు : - నీలకమలము అనే పదములో నీలము అనే విశేషణము తీదివేసే కమలము ను ఉత్పత్తి అని వ్రాస్తున్నాము. దేశ్యము, ప్రాకృతము వంటివి పదానికి మూలము అని పేర్కొనవవచ్చు. ఉత్పత్తి విభాగం కింద " మూలము " అనే విభాగం చేర్చండి. మీ అభిప్రాయాలు సరి అయినవే కాని అందరికీ అర్ధం కావు కనుక వ్రాయలేరు. మీరు గమనించిన వాటిని సరిచేయండి. ఉదాహరణగా శ్వేతకమలము చూడండి. --T.sujatha (చర్చ) 07:32, 7 మే 2013 (UTC)
- సుజాత గారు,
కమలము వ్యుత్పత్తి కాదు,కమలము అనేది కమలమ్(సంస్కృతపదము)+ఉ(డు,ము, ఉ,లు:ప్రధమా విభక్తి.) =కమలము,అందువలన సంస్కృతపదం కమలమ్ వ్యుత్పత్తి. (చూడండిsa:कमलम्)..మనం చిన్నపుడు చదివినవి గుర్తుకు తెచ్చుకొని విక్షనరీలో వ్రాస్తే ఎలా? వ్రాసేముందు ఇతరపుస్తకాలను(నిఘంటువులు లేదా వ్యాకరణ పుస్తకాలను) చూసి,సరిచూసుకొని వ్రాయడం ,మంచిదని నా అభిప్రాయం.పాలగిరి (చర్చ) 08:03, 7 మే 2013 (UTC)
పాలగిరిగారూ ! విక్షనరీ ఉద్దేశం తెలుగు పదాలను ఒకచోట చేచడం . వ్యాకరణ వివరాలు తెలిసిన వారు వ్రాస్తారు. లేకుంటే వ్యాకరణ వివరాలు వ్రాసి తీరాలని నియమం లేదు. ఒక పదం వ్రాసినప్పుడు వ్యవహారంలో దానికి సమానమైన పదం వ్రస్తేనే చదివే వారికి. అర్ధం ఔతుంది. విఆకరణ దోషాలు ఉన్నప్పుడు వాటిని సరిదిద్దండి. ఒకే మాటను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వాడుతుంటారు అవి విక్షనరీలో చేరాలన్నది విక్షనరీ ప్రధాన లక్ష్యాఅలో ఒకటి. ఆ దిశలో అనుకున్న పని అంతగా జరిగ లేదు. ఇతర భాషానువాదాలు కూడా విక్షనరీ లక్ష్యాలలో ఒకటి. తప్పులు ఉంటే సరిదిద్దండి , సభ్యులకు సూచించండి, చర్చా పేజీలో సూచించండి. తెలిసినంత వ్రాయాలన్నది వికీపీడియా నియమాలలో ఒకటి అన్నీ తెలుసుకునే వ్రాలన్నది నియమం కాదు. అలా వ్రాయమంటే వ్రాసేవారు ముందుకు రారు. వ్యాకరణ వివరాలు వదిలి కూడా పద సృష్టి చేయవచ్చు. పద సృష్టి చేసి విడువకుండా ఇతర వివరాలు ఏవైనా వ్రాయడం మంచిది. --T.sujatha (చర్చ) 13:20, 7 మే 2013 (UTC)
- సుజాతగారు,నేను అన్నితెలుసుకొని వ్రాయమని చెప్పలేదు.ఏక్కడవ్రాసానో చూపించండి.అధారం లేకుండ నిందలు వెయ్యకండి.అలాగే సభ్యులు ఎవ్వరు రారు అన్నారు మీరు.నేను ఏసభ్యుడకు అన్ని తెలుసుకొని వ్రాయండి అంటూ సందేశాలేమి పెట్టలేదే? బెదరించలేదే? .అంటే అధికారంలో వున్నవాళ్ళు,వారిమద్ధతుదారులు తప్పులు వ్రాస్తూ,వుంటే,సందేహనివృత్తికై అడగటమే నేరమా?విక్షనరీ ఒక్కరి సొంత ఆస్తికాదు? మేము ఇష్టం వచ్చినట్లు వ్త్రాస్తాము?మమ్మల్ని ఎవ్వరు అడుగరారు అంటే ఎలా?.విక్షనరీ అంటే ఎవ్వరిష్టం వచ్చినట్లు వారు వ్రాయడం కాదు.ఒట్టి పదసృష్టి నేను చెయ్యలేదు.వివరాలేమి లేకుండ వేల సంఖ్యలోవున్న పదాలకు భాషాభాగాలు,వ్యుత్పత్తి,అర్థవివరణలు తదితరాలు చేర్చానే తప్ప,వేలఒట్టి పదసృష్టి చెయ్యలేదు.శబ్దరత్నాకరమును దగ్గరపెట్టుకొని వివరాలు చేర్చుచున్నాను.అలాంటి సమయంలో నిఘంటువులో వుండి,విక్షనరీలో లేనివి,అవికూడా అవసరం అనుకున్నవే చేర్చుచున్నాను(అవికూడా వందలలోపే).రచనలు నేను వికీమీడియాకు వచ్చి కొత్తగా నేర్చుకోలేదు.రాకముందే 15 సంవత్సరాలుగా రచనా రంగంలో వున్నవాన్నే? ఎదైన దిద్దుపాటు చేసేముందు ఒకటికి పదిసార్లు అవసరమా అని అలోచించాక మత్రమే దిద్దుపాట్లు చేస్తున్నాను.అందువలన పదసృష్టి చేసి వదలిందినేనుకాదు.వికీమీడియాకు పదేళ్ళు దాటుచున్నప్పటికి ఎక్కువ సంఖ్యలో కొత్తవారురాకపోవటానికి,వచ్చినా ఎక్కువ కాలం నిలవకపోవటానికి కారణమేమిటో సినియరు సభ్యులు ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది.ఎవ్వరు ఎవ్వరిని బెదరిస్తున్నారో? విక్షనరీలో ఎమి జరుగుతున్న చూస్తూ వూరుకుంటే ఓ.కే.ఏదైన అనుమానమొచ్చీ, సందేహనివృత్తికై అడితేచాలు..దాడి..వేట మొదలైతుంది. ఒక్కటిమాత్రం చెప్పగలను. వ్యక్తులు శాశ్వితం కాదు,వ్యవస్త శాశ్వితము.విక్షనరీని కొంతమంది వ్యక్తులు ఎంతకాలం తమ గుప్పిట్లో పెట్టుకుంటారు. ఐదేళ్ళు..పదేళ్లు.పదేనేళ్ళు...తరువాత మార్పు తధ్యం.విక్షనరీలో వ్రాయకపోతే నాకు వచ్చే నష్టమేమి లేదు.గుడ్ బై>పాలగిరి (చర్చ) 16:46, 7 మే 2013 (UTC)
- నాకీ విక్షనరీలో ఏం జరగుతుందో అసలే అర్ధం కావటం లేదు. ఉదాహరణకి ఈ చర్చ. పాలగిరి గారు వ్యుత్తత్తిని చక్కగా అర్ధం చేసుకున్నారు. అలా వ్యుత్పత్తి ఉండవలసిన చాలాచోట్ల అర్ధ వివరణ ఉందని ఎత్తిచూపారు. దానికి సుజాత గారు, అందరికీ అంత భాషా పరిజ్ఞానంలేదు, వీలైనంత వరకు తోచినవి వ్రాస్తున్నారు. మీకు ఏమైనా తప్పనిపిస్తే భేషుగ్గా దిద్దండి అని పాలగిరి గారితో అన్నారు. కానీ ఆ తర్వాత చర్చలోకి బెదిరింపు, దాడి, వేట ఎందుకొచ్చాయో అర్ధం కాలేదు. దయచేసి ఎవరైనా వివరించగలిగితే కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు. --వైజాసత్య (చర్చ) 08:24, 20 మే 2013 (UTC)
వ్యుత్పత్తి..... సందేహము
<small>మార్చు</small>ఆర్యా.....
పైకనబరచిన విషమమై ఒక వాడుకరి వ్రాస్తూ వ్యుత్పత్తి అనగా పుట్టుక/మూలమని కనుక ఆయాపదాల వ్యుత్పత్తులకు సదరు పదము తత్సమమా/ సంస్కృతమా, దేశ్యమా/ మొదగలు నవి వ్రాయాలని భావించి అలావ్రాస్తున్నాని అన్నారు. ఈ విషయంలో కొందరు వ్యుత్పత్తి ఆయా పదాల అర్థవివరణ వ్రాస్తున్నారని కూడ అన్నారు. ఈ అయోమన స్థితిని పోగొట్టడానికి ఏది సరైన పద్దతో తెలుపమని కోరియున్నారు. ఇది చాల సమంజసమైన సందేహమే. తప్పక తీర్చుకోవలసినదే.
ఇక.... నేను పదాలకు వ్యుత్పత్తులను ఈ క్రింది విధంగా వ్రాయుచున్నాను:
- (పదము) శ్వేతాద్రి = తెల్లని పర్వతము (వ్యుత్పత్తి) .. హిమాలయ పర్వతము (అర్థ వివరణ)
- (పదము) వృక్షచరము = చెట్లలో సంచరించునది (వ్యుత్పత్తి)..... కోతి, (అర్థవివరణ)
- (పదము) శ్వేతధాతువు = తెల్లని ఖనిజము (వ్యుత్పత్తి) ..... సున్నపురాయి (అర్థవివరణ)
పైవిధంగా నేను వ్రాయడానికి ఆదారము:
కొన్ని పదాలనిచ్చి వాటికి వ్యుత్పత్తి చెప్పమని కొందరు విద్యార్తులకు, తెలుగు పండితులను కూడ అడగడం జరిగింది. వారందరు పైన నేను వ్రాసిన విదంగానే సెలవిచ్చారు. ఏఒక్కరు కూడ మూలమైన సంస్కృతమా/దేశ్యమా... .... అలాంటివి వ్రాయమని చెప్పలేదు. వారు చెప్పిన మాటలు ప్రమాణముకాదని భావించి, పదవతరగతి తెలుగు పాఠ్యపుస్తకాన్ని తీసుకొని పరిశీలించాను. ఆ పుస్తకంలో తామసి. అనే 8 వ పాఠంలో (పుట.... 50) చివర అభ్యాస వేధికలో ఇతర భాషా సంబందమైన విషయాలతో బాటు వ్యుత్పత్తి కి సంబందించిన వివరాలు కూడ వున్నాయి. వాటిని యదాతదంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను.
- vi(a). ఈ క్రింది మాటల వ్యుత్పత్తిని పరిశీలించండి
- 3.ధరణి...... విశ్వాన్ని ధరిస్తుంది గాబట్టి ఇది ధరణి (భూమి)
- 4.తామసి..... అమితమైన తమస్సు కలిగినది కాబట్టి తామసి (కారుచీకట్లు కలిగిన రాత్రి)
- 5.సౌథము...... సుధ అంటే... సున్నం. సున్నం కలిగినది కాబట్టి సౌధం. (భవనము)
పైన కనబరచిన వాటిలో దేనిలోనైన మూలపదాలైన సంస్కృతము అనీ గానీ.. లేదా మరేదైనా వ్రాయబడలేదు. కనుక అర్థ వివరణ లాంటిదే వ్రాయాలని భావించి అలా వ్రాశాను. వ్యుత్పత్తులు అన్ని పదాలకు వుండవు. కానీ మూల పదాలుగా వ్రాయాలంటే ప్రతి పదానికి ఒక మూలపదముంటుంది. ఇది పెద్ద విభాగమే. కనుక తొందరగా అయోమయ నివృత్తి చేసుకుంటే మంచిది. ఒక్క మనవి: విక్షనరీ ప్రతి తల పుటలోను భాషాభాగము, ఆర్థ వివరణ, మొదలగు వాటితో బాటు చివరగా మూలాలు/ వనరులు అని కూడ వున్నది. అక్కడ ఎవ్వరూ ఏమీ వ్రాయడంలేదు. అక్కడ ఏమి వ్రాయాలి అనే సందేహాన్నికూడ నివృత్తి చేసుకుంటే మంచిదేమో....? ఈ విషమై నాదొక చిన్న సూచన:... విక్షనరీ తరుపున పైన కనబరచిన రెండు సందేహాలతో బాటు మరేదైన అనుమానాలుంటే లిఖిత పూర్వకంగా తెలుగు విశ్వవిద్యాలయానికి తెలియజేసి వారి అమూల్యమైన సలహాలు పొందగలిగితే ..... అంతకన్నా ప్రామాణికత ఏముంటుంది?
వాడుకరి... భాస్కరనాయుడు.... ఎల్లంకి (చర్చ) 15:08, 16 మే 2013 (UTC)
వ్యుత్పత్తి.... సందేహము.... మరో నిరూపణ
<small>మార్చు</small>ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కళాభవన్, హైదరాబాదు వారు ప్రచురించిన తెలుగు నిఘంటువులో పదాలకు ఇతర వివరాలతో పాటు వ్యుత్పత్తి కూడ వ్రాయబడి వున్నది. వాటిలో కొన్నింటిని యదాతదంగా ఈ క్రింద కనబరుస్తున్నాను.
- 1.ఖచరుడు.... స.వి. వ్యు. ఖ + చరుడు.. ఆకాశమున చరించు వాడు = సూర్యుడు.
- 2. చీకటిగొంగ. స.వి. వ్యు. చీకటికి శత్రువు = సూర్యుడు.
- 3. తెఱవ ... స.వి. వ్యు. తెరవ + వాయి = రహస్యము దాగని నోరు గలది = స్త్రీ.
- 4. తెలిగంటి.... వి. వ్యు. తెల్లని కన్నులు గలది. = స్త్రీ
- 5. ద్విజుడు, స.వి. వ్యు. జన్మించినపిదప ఉపనయనముచే రెండవ పుట్టుకగొన్న వాడు = బ్రాహ్మణుడు/క్షత్రియుడు/వైశ్యుడు.
- 6. నాభిజన్ముడు. స.వి. వ్యు. బొడ్డు నుండి జన్మించిన వాడు... = బ్రహ్మ.
- 7 సప్తజిహ్వుడు. స.వి. వ్యు. ఏడు నాలుకలున్న దేవుడు = అగ్ని
- 8. సనాసరుడు. స.వి. వ్యు. గొప్ప సేన గల వాడు = ఇంద్రుడు.
- (చూచన: స.వి. అనగా.... సంస్కృత విశేష్యము . వ్యు అనాగా వ్యుత్పత్తి, వి. అనగా దేశ్యవిశేష్యము..)
పైన కనబరచినవన్నీ నేను వ్రాయుచున్న వాటికి అనుకూలంగానే వున్నవి. కనుక నేను అదేవిధానాన్ని అనుసరిస్తున్నాను. వాడుకరి. భాస్కరనాయుడు. ఎల్లంకి (చర్చ) 07:52, 25 మే 2013 (UTC)
- సుదీర్ఘమైన వివరణ తర్వాత మరికొన్ని మూలాలను తెల్పినందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 09:28, 16 ఆగష్టు 2013 (UTC)
Tech newsletter: Subscribe to receive the next editions
<small>మార్చు</small>- Recent software changes
- (Not all changes will affect you.)
- The latest version of MediaWiki (version 1.22/wmf4) was added to non-Wikipedia wikis on May 13, and to the English Wikipedia (with a Wikidata software update) on May 20. It will be updated on all other Wikipedia sites on May 22. [3] [4]
- A software update will perhaps result in temporary issues with images. Please report any problems you notice. [5]
- MediaWiki recognizes links in twelve new schemes. Users can now link to SSH, XMPP and Bitcoin directly from wikicode. [6]
- VisualEditor was added to all content namespaces on mediawiki.org on May 20. [7]
- A new extension ("TemplateData") was added to all Wikipedia sites on May 20. It will allow a future version of VisualEditor to edit templates. [8]
- New sites: Greek Wikivoyage and Venetian Wiktionary joined the Wikimedia family last week; the total number of project wikis is now 794. [9] [10]
- The logo of 18 Wikipedias was changed to version 2.0 in a third group of updates. [11]
- The UploadWizard on Commons now shows links to the old upload form in 55 languages (bug 33513). [12]
- Future software changes
- The next version of MediaWiki (version 1.22/wmf5) will be added to Wikimedia sites starting on May 27. [13]
- An updated version of Notifications, with new features and fewer bugs, will be added to the English Wikipedia on May 23. [14]
- The final version of the "single user login" (which allows people to use the same username on different Wikimedia wikis) is moved to August 2013. The software will automatically rename some usernames. [15]
- A new discussion system for MediaWiki, called "Flow", is under development. Wikimedia designers need your help to inform other users, test the prototype and discuss the interface. [16].
- The Wikimedia Foundation is hiring people to act as links between software developers and users for VisualEditor. [17]
If you want to continue to receive the next issues every week, please subscribe to the newsletter. You can subscribe your personal talk page and a community page like this one. The newsletter can be translated into your language.
You can also become a tech ambassador, help us write the next newsletter and tell us what to improve. Your feedback is greatly appreciated. guillom 21:15, 20 మే 2013 (UTC)Trademark discussion
<small>మార్చు</small>Hi, apologies for posting this in English, but I wanted to alert your community to a discussion on Meta about potential changes to the Wikimedia Trademark Policy. Please translate this statement if you can. We hope that you will all participate in the discussion; we also welcome translations of the legal team’s statement into as many languages as possible and encourage you to voice your thoughts there. Please see the Trademark practices discussion (on Meta-Wiki) for more information. Thank you! --Mdennis (WMF) (talk)
Universal Language Selector to replace Narayam and WebFonts extensions
<small>మార్చు</small>On June 11, 2013, the Universal Language Selector (ULS) will replace the features of Mediawiki extensions Narayam and WebFonts. The ULS provides a flexible way of configuring and delivering language settings like interface language, fonts, and input methods (keyboard mappings).
Please read the announcement on Meta-Wiki for more information. Runab 14:12, 5 జూన్ 2013 (UTC) (posted via Global message delivery)
లిప్యంతరీకరణ ...
<small>మార్చు</small>భాషల మధ్య మార్పు కొరకు క్రొత్తగ ఏర్పాటు చేసిన లిప్యంతరీకరణ ఆలస్యంగా నైనా నా యంత్రములో చేరినది. విక్షనరీలో ఎందుకో వెంటనే రాలేదు. ఆతర్వాత అన్నింటిలోను వచ్చింది. కాని ఈ రోజు వికిపీడియాలో మొదట బాగానే వచ్చింది. మొదట వెతుకు పెట్టెకు పెట్టెకు క్రింద వచ్చేది. అలా వచ్చినప్పుడు ఆ వచ్చిన పెట్టె సగభాగము అనగా క్రింది భాగము మాత్రము కనబడేది. పై భాగము కనబడలేదు. తెలుగు భాష లోకి మారడానికి . ఆ పెట్టెలో కనబడే క్రింది భాగములోని ఒక దానిపై నొక్కగా అది పూర్తిగా మరుగై పోయింది. అనగా వికిపీడియాలో ప్రస్తుతం నా యంత్రములో భాషల మద్య మారడాని అవకాశము లేకుండా పోయింది. దీనికేదయినా ఉపాయమున్నదేమో తెలిసిన వారు చెప్పగలరు. (చర్చ) 14:39, 13 జూన్ 2013 (UTC)
జ్యోతిశ్శాస్త్ర సంబందిత పదాలు
<small>మార్చు</small>25/6/2013 సుమారు అరవై పదాలు జ్యోతిషశాస్త్ర సంబంధించినవి విక్షనరీలో చేర్చాను. పొరబాటున లోనికి ప్రవేశించ కుండా లాగిన్ కాకుండా చేర్చడము జరిగింగి. కనుక వాటిలో నాపేరు నామోదు కాలేదు. వాటిని చేర్చవచ్చునా లేదా.... అందులో తప్పులున్న యడల వాటన్నిటికీ నాదే బాధ్యత. వాటిస్థానం సందర్భోచితం కాకుంటే తొలిగించండి. వాటి కెదురుగా నాపేరు నామోదు అయి వుంటే ఇది వ్రాయవలసి వచ్చేది కాదు................... వాడుకరి భాస్కరనాయుడు.103.24.126.214 13:59, 25 జూన్ 2013 (UTC)
(Sorry for writing in English. You can translate the proposal.)
Should X!'s edit counter retain the opt-in requirement? Your input is strongly encouraged. Voice your input here.—cyberpower ChatAutomation 05:03, 23 జూన్ 2013 (UTC)
- Distributed via Global message delivery. (Wrong page? Fix here.)
సినిమా పాటలు
<small>మార్చు</small>తెలుగు సినిమా పాటలలోని ముఖ్యమైన తెలుగు పదాలను వాటి పదప్రయోగాలతో చేర్చడానికి నిర్ణయించాను. లవకుశ సినిమాతో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఆసక్తిగల సభ్యులు చేరవచ్చును.Rajasekhar1961 (చర్చ) 11:21, 6 జూలై 2013 (UTC)
విక్షనరీ తలపుట గురించి
<small>మార్చు</small>తలపుటలో వున్న శీర్షికల గురించి తెలుసుకోవాలని.... వెతికెతే నాకు ఎక్కడా కనబడలేదు. ఇంకెక్కడైనా వున్నాయేమో మరి..... సందేహ నివృత్తి కొరకు వ్రాస్తున్నాను.
- భాషా భాగము
- ఇందులో ఆ పదము నామవాచకమా, సర్వనామమా, విశేష్యమా, విశేషణమా, క్రియా మొదలైనవి వ్రాయ వచ్చునని నాభావన. (కొన్ని పదాలు.... నామవాచకము, విశేషణము, మరియు క్రియ లకు కూడ సంబందించి వుంటుంది. అలాంటప్పుడు ఆ మూడు వ్రాయవచ్చునని నా భావన.
- వ్యుత్పత్తి
- దీని గురించి గతంలో వివరించడం జరిగింది.
- ఏకవచనము/బహువచనము
- ఇది అన్ని పుటలలో లేదు... అవసరాన్ని బట్టి మనమే వ్రాసుకోవచ్చు.ఇందులో సందేవహం లేదు.
- అర్థ వివరణ
- దీని విషయమై కొంత సందిగ్దత వున్నది. ఇక్కడ వ్రాయవలసిన విషయము మరింత స్పష్టంగా చెప్పగలరు. పద అర్థము వాఖ్య రూపంలో వుండాలంటారు..... ఇది అన్ని పదాలకు సాద్య పడదు... ఉదాహరణకు: పృథివి. అర్థం = భూమి. ఈ విషయంలో ఇక్కడ నేను వ్రాస్తున్నది... భూమి కి వున్న అనేక నామాలలో ఇది ఒకటి అని. ఇది సమంజసమేనా?
- పదాలు
- శీర్షికన.....
- నానార్థాలు
- అనగా ఒక పదానికి భిన్న అర్థాలుంటాయి. వాటిని ఇక్కడ వ్రాయాలని నాభావన. ఉదా: పదము అనగా సరైన అర్థాన్నిచ్చే అక్షరాల సమూహము, మరొక అర్థము అడుగు మొదటి అర్థము అర్థ వివరణలో వచ్చి వుంటుంది. ఈ రెండో పదము నానార్థాలు: లలో వ్రాయాలి. మరో ఉదాహరణ: కృషి అనగా శ్రమ అని అర్థము. మరొక అర్థము వ్వవసాయము. అని వున్నది. దీనిని ఇక్కడ వ్రాయవచ్చు. ఇక్కడ చాలమంది సంబందిత పదాల సమానార్థలను వ్రాయు చున్నారు. వారిని చూసి నేను కూడ వ్రాశాను. అది సరైన పద్దతి కాదని నా వుద్దేశము.
భిన్న ఆర్థాలు కు కొన్ని ఉదాహరణలు: వలచి= ప్రేమించి... విడదీసి (పండును వలచి) పాము= సర్పము, రుద్దడము,. / కరువు= క్షామము, కరచుట, / త్రాచు= నాగుపాము, తక్కెడ , /ముక్కు= నాశిక, గట్టిగా ముక్కడము / చేయి= hand అనే అర్థం, రెండోది పని చేయి అనే అర్థంలో, / ఇలా చాల పదాలకు భినార్థాలుంటాయి వాటిలో ఒక దానిని అర్థవివరణ లోనూ..... మరో దానిని పర్యాయ పదాలు వర్గంలో చేర్చాలి. అని నా భావన. ఈ విషయాన్ని పరిశీచండి.
- సమానార్థాలున్న పదాలను పర్యాయ పదాలు అని అంటారు (synonyms) పర్యాయ పదాలు అని శీర్షిక లేదు. ఇటీవల నేను అటువంటి పదాలను వ్రాయు నప్పుడు పర్యాయపదాలు అని శీర్షిక పెట్టి వ్రాస్తున్నాను. గమనించ గలరు. ఇది సరియైన విధానమేనా? .....
- సంబందిత పదాలు
ఆయా అర్థాలకు సంబందించిన పదాలను వ్రాయవచ్చు. ఉదా: పద ప్రయోగం లాంటిదే.... కాకపోతే ..... పద ప్రయోగము ... ఏదైన పద్యంలో గాని.... గ్రంధంలో గాని వాడిన పదాన్ని వ్రాయాలి. పదప్రయోగము అనే దానీకెదురుగా వ్రాయాలి. కాని సంబందిత పదాలు అనే దానికెదురుగా మనం తీసుకున్న పదాన్ని ఏ విదంగా దానిని వాక్యంలో వాడ వచ్చో మన సవంత వాక్యంలో వ్రాసి చూపించ వచ్చు... దీని వలన ఆ యా పదాల ప్రయోగము మరి కొంత వివరముగా అర్థం అవుతుంది. ఉదాహరణకు. క్షామము అనే పదం తీసుకుంటే .... పదప్రయోగము కెదురుగా..... స్వంత వాఖ్యంలో..... అనంతపురం జిల్లా నిత్యం క్షామము తో విల విల లాడుతున్నది. అని వ్రాయవచ్చు. పద ప్రయోగము: అనే దానికెదురుగా మన స్వంత వాఖ్యాలు వ్రాయకూడదు. ఈ విధంగానే నేను వ్రాయుచున్నాను. ఇందులో అబ్యంతర ముంటే ఆధారాలతో తెలియ జేస్తే.... సరిదిద్దుకుంటాను.
- వ్వతిరేక పదాలు
ఇందులో సందేహం లేదు.
- పద ప్రయోగాలు
ఇందులు పైన కనబరచిన విధంగా ఏదేని గ్రంధంలోని, పద్యంలోని, పాటలోని మొదలగు రూడితమైన పదాల ప్రయోగం మాత్రమే వ్రాయాలి..... అని నా నిర్ణయం. నేను అలాగే వ్రాస్తున్నాను. ఆ యా పదాలను మన స్వంత వాక్యాలలో ఉదాహరణగా వ్రాయ కూడదు. అందులో తప్పేమి లేదు కాని...... నిర్దుష్టమైన ప్రామాణికత లోపిస్తుందని నా భావన. నేను అలాగే వ్రాస్తున్నాను.
- అను వాదాలు
- , ఈ విభాగంలో ........ ఎక్కువగా ఆంగ్లం తప్ప వేరే భాషా అనువాదాలు వ్రాయడం లేదు కనుక ప్రస్తుతం సందేహం లేదు.
భాస్కరనాయుడు.................ఎల్లంకి (చర్చ) 03:15, 21 జూలై 2013 (UTC)
- మీరు వ్రాసిన విషయాలు అన్నీ బాగున్నాయి. అన్ని కరక్టుగా తెలియజేశారు. Rajasekhar1961 (చర్చ) 15:29, 21 జూలై 2013 (UTC)ఎల్లంకి (చర్చ) 16:08, 20 ఆగష్టు 2013 (UTC)
Pywikipedia is migrating to git
<small>మార్చు</small>Hello, Sorry for English but It's very important for bot operators so I hope someone translates this. Pywikipedia is migrating to Git so after July 26, SVN checkouts won't be updated If you're using Pywikipedia you have to switch to git, otherwise you will use out-dated framework and your bot might not work properly. There is a manual for doing that and a blog post explaining about this change in non-technical language. If you have question feel free to ask in mw:Manual talk:Pywikipediabot/Gerrit, mailing list, or in the IRC channel. Best Amir (via Global message delivery). 13:50, 23 జూలై 2013 (UTC)
ఆగష్టు నెల ప్రణాళిక
<small>మార్చు</small>2013 ఆగష్టు నెలలో తెలుగు విక్షనరీలో చేయవలసిన ముఖ్యమైన పనులు:
- విక్షనరీలోని అన్ని తెలుగు పదాలను భాషాభాగం ఆధారంగా వర్గీకరించడం.
- క్రియా పదాల నుండి మార్పుచెంది ఏర్పడిన తెలుగు నామవాచకాలు గురించిన పేజీలను ఇప్పటికే ఉన్న పేజీలనుండి తయారుచేయాలి.
- తెలుగు పదబంధాలు అనే వర్గాన్ని మొదలుపెట్టి వివిధ రకాలైన (సంధులు, సమాసాలు మొదలైనవి) పదబంధాలుగా ఏర్పడిన వాటిని ఇందులో చేర్చడం. వాటిని వ్యాకరణబద్ధంగా విడదీసి వర్గీకరించడం. దీనికి మూలం పదబంధాలుగా ఏర్పడిన తెలుగు పదాల్ని గుర్తించడము.
- వీలైనన్ని విక్షనరీ పేజీలలో బొమ్మల్ని చేర్చడం.
- విభిన్న అర్ధాలు కలిగిన తెలుగు పదాలు వర్గాన్ని విస్తరించి విక్షనరీలోని అన్ని పదాలకు ఫార్మాటు మార్చి ఒక్కొక్క భాషాభాగానికి చెందిన విభాగాన్ని వేరుచేయండం.
- కొన్ని ముఖ్యమైన మూలపదాల ఉచ్చారణ మరియు భాషాంతరాలు చేర్చడము.Rajasekhar1961 (చర్చ) 03:21, 5 ఆగష్టు 2013 (UTC)
HTTPS for users with an account
<small>మార్చు</small>Greetings. Starting on August 21 (tomorrow), all users with an account will be using HTTPS to access Wikimedia sites. HTTPS brings better security and improves your privacy. More information is available at m:HTTPS.
If HTTPS causes problems for you, tell us on bugzilla, on IRC (in the #wikimedia-operations
channel) or on meta. If you can't use the other methods, you can also send an e-mail to https@wikimedia.org
.
Greg Grossmeier (via the Global message delivery system). 19:45, 20 ఆగష్టు 2013 (UTC) (wrong page? You can fix it.)
First, I’d like to apologize for the English. If you can, please help to translate this for other members of your community.
The legal team at the Wikimedia Foundation would greatly appreciate your input on the best way to manage the "community logo" (pictured here) to best balance protection of the projects with community support. Accordingly, they have created a “request for consultation” on Meta where they set out briefly some of the issues to be considered and the options that they perceive. Your input would be invaluable in helping guide them in how best to serve our mission.
Thank you! --Mdennis (talk) (via the Global message delivery system). 03:15, 24 సెప్టెంబరు 2013 (UTC) (wrong page? You can fix it.)
కొత్త విక్షనరీ నిర్వాహకులు జాబితా
<small>మార్చు</small>ఈ క్రింద పొందుపరచిన కొత్త విక్షనరీ నిర్వాహకులు జాబితాను పాతవారు (సభ్యులు) ఒకసారి పరిశీలించండి . నిర్వాహకుల జాబితాలోని తేదీలను సరి చేయండి.
- Bhaskaranaidu (చర్చ | రచనలు) (నిర్వాహకుడు) (సెప్టెంబరు 30, 2011 న 22:36కి చేరారు)
- Rajasekhar1961 (చర్చ | రచనలు) (నిర్వాహకుడు) (జూన్ 30, 2007 న 11:19కి చేరారు)
- T.sujatha (చర్చ | రచనలు) (నిర్వాహకురాలు) (సెప్టెంబరు 20, 2006 న 16:34కి చేరారు)
- వైజాసత్య గారిది అసలు లేదు. నా పేరు అసలు లేనే లేదు. గమనించండి.
- ఎవరెవరు నిర్వాహకత్వం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారో తెలియ జేయండి.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 10:21, 29 సెప్టెంబర్ 2013 (UTC)
(This message is in English, please translate as needed)
Greetings!
Notifications will inform users about new activity that affects them on this wiki in a unified way: for example, this new tool will let you know when you have new talk page messages, edit reverts, mentions or links -- and is designed to augment (rather than replace) the watchlist. The Wikimedia Foundation's editor engagement team developed this tool (code-named 'Echo') earlier this year, to help users contribute more productively to MediaWiki projects.
We're now getting ready to bring Notifications to almost all other Wikimedia sites, and are aiming for a 22 October deployment, as outlined in this release plan. It is important that notifications is translated for all of the languages we serve.
There are three major points of translation needed to be either done or checked:
- Echo on translatewiki for user interface - you must have an account on translatewiki to translate
- Thanks on translatewiki for user interface - you must have an account on translatewiki to translate
- Notifications help on mediawiki.org. This page can be hosted after translation on mediawiki.org or we can localize it to this Wikipedia. You do not have to have an account to translate on mediawiki, but single-user login will create it for you there if you follow the link.
Please let us know if you have any questions, suggestions or comments about this new tool. For more information, visit this project hub and this help page. Keegan (WMF) (talk) 19:17, 4 అక్టోబరు 2013 (UTC)
- (via the Global message delivery system) (wrong page? You can fix it.)
Speak up about the trademark registration of the Community logo.
<small>మార్చు</small>Hi all,
Please join the consultation about the Community logo that represents Meta-Wiki: m:Community Logo/Request for consultation.
This community consultation was commenced on September 24. The following day, two individuals filed a legal opposition against the registration of the Community logo.
The question is whether the Wikimedia Foundation should seek a collective membership mark with respect to this logo or abandon its registration and protection of the trademark.
We want to make sure that everyone get a chance to speak up so that we can get clear direction from the community. We would therefore really appreciate the community's help in translating this announcement from English so that everyone is able to understand it.
Thanks, Geoff & Yana 20:56, 8 అక్టోబరు 2013 (UTC)
ఆరుద్రపురుగు
<small>మార్చు</small>ఆరుద్ర పురుగు పుటను చూడండి. ఇందులో రెండు బొమ్మలున్నాయి. రెండవ బొమ్మ నేను చేర్చినది. మా ప్రాంతంలో వెల్వెట్ రంగులో వుండే పురుగునే ఆరుద్రపురుగు అని అంటారు. దాని రంగును బట్టి కూడ దానిని వెల్వెట్ పురుగు అని ఆధునిక పిల్లలు అంటుంటారు. ఈ ఆరుద్ర పురుగులు కేవలము ఆరుద్ర కార్తె సమయములోనే భూమిపైన కనిపిస్తాయి. అందుకే వాటిని ఆరుద్ర పురుగు అని అంటారు. నల్ల చుక్కలున్న ఎర్ర పురుగును కొన్ని ప్రాంతాలలో ఆరుద్ర పురుగు అని అంటారేమో..... తెలియదు. రెండు విభిన్న రీతులలో వున్న ఒకే పురుగు .... కొందరికి ఏది ఆరుద్ర పురుగు అనే సందేహాన్ని కలిగించ వచ్చు. కనుక ఈ విషయములో ఆలోసించి ఒకే బొమ్మను అక్కడ చేరిస్తే మంచి దేమో.....? ....వాడుకరి భాస్కర నాయుడు.
పేజీ గణాంకాలలో తేడా
<small>మార్చు</small>పేజీ గణాంకాలు కు విక్షనరీ గణాంకాలకు తేడా గురించి వివరం ప్రకారం వ్యాసాలు గణాంకాలలో లెక్కకు రావాలంటే కనీసం ఒకటయిన అంతర లింకు ఇతర వ్యాస పేజీలకు కలిగి వుండాలి. (ఉదా:సరియైన అంతర్వికీ లింకు లేని పదం )కనుక అలాలేని పదపేజీలను వీలైనంత వరకు సవరించితే పద వ్యాసాల సంఖ్య మొత్తము వ్యాసాల సంఖ్యకు చేరుకోగలదు. --అర్జున (చర్చ) 05:46, 31 అక్టోబరు 2013 (UTC)
- పైది సరియాకాదా అని పరీక్షించడానికి నేను చిన్న మార్పు చేశాను. వెంటనే పేజీగణాంకాల 63586 నుండి 63587కు మారాయి. మొదటి పేజీలో కనబడేది అలానే వుంది.క్యాచి తొలగించలేదు కాబట్టి. మూసలతో చేర్చినపదాలకు ఏదో ఒక అంతర లింకు కలిగివున్నవి కనుక అవి లెక్కించబడుతున్నాయి. బ్రౌను నుండి ప్రోగ్రామ్ తో చేర్చిన పదాల పేజీలలో అంతరలింకులు లేకపోతే అవిలెక్కకు రానట్లుగా వుంది. వాటికి తగిన లింకులు చేర్చితే మొదటి పేజీలో కనబడే గణాంకాల సంఖ్య మొత్తము ప్రధానపేరుబరిలో వున్న వాటికి సరిపోతుంది. --అర్జున (చర్చ) 16:07, 31 అక్టోబరు 2013 (UTC)
- వీటిని సరిదిద్దటానికి ఈ అన్వేషణ పదబంధం వాడి అలా కనబడిన పేజీలలో వీలైనంతవరకు అంతర లింకులు, సమానమైన అర్ధాలుగలపదాలు యొక్క మూలరూపానికి మాత్రమే చేర్చండి. ఎర్రలింకువుంటే ఆకొత్త పేజీనిసృష్టించండి. అలాసృష్టించకపోయినా ఈ వ్యాసం గణాంకాలలోకి వస్తుంది, కాని సృష్టించితే మంచిది --అర్జున (చర్చ) 02:14, 1 నవంబరు 2013 (UTC)
- ఆర్యా......
- బ్రౌన్ నిఘంటువులోని పదాలకు పైన చెప్పిన విధంగా కొన్నింటికి లింకులు ఇచ్చాను.... గమనించగా వాటి సంఖ్యలు అదనంగా చేరుతున్నాయి. ఆ విధంగా ఈ ఒక్క రోజో సుమారు 100 చేరాయి. ఇచ్చిన మూలపదం ఎర్రగా వస్తుంటే వాటికి క్రొత్త పదాలు సృష్టిస్తున్నాను. ఈ క్రొత్త పదాల సృష్టి మాత్రం అన్నింటికి చేయడము లేదు. ఎందుకనగా అది ఆనాటి భాష. యాస కొంత తేడా వున్నది. నేను చేస్తున్న పని కాస్త గమనించి అది సక్రమమేనా? కాదా అన్న విషయం చెప్పితే అదె విధానము కొనసాగిస్తాను. వాడుకరి భాస్కరనాయుడు. 2/11/2013/ఎల్లంకి (చర్చ) 12:34, 2 నవంబరు 2013 (UTC)
- మరొక్క విన్నపం:
- విక్ష్నరీ మొదటి పుటలో ప్రస్తుతం...... 63711 పదములున్నాయి అని చూపిస్తున్నది. కానీ పూర్తి గణాంకాలలోకి వెళ్ళితే విషయపు పేజీల సంఖ్య. 63772 గా చూపిస్తున్నది. దేనిని పరిగణన లోనికి తీసుకోవాలి? ఎల్లంకి (చర్చ) 13:43, 2 నవంబరు 2013 (UTC)
- నేను గమనిస్తున్నాను. చాలా వరకు బ్రౌన్ నిఘంటువు లోని పదాలకు తెలుగు పదాల అంతర్వికీ లింకులు లేవు. అందువల్లనేమో అవి వ్యాసాల సంఖ్య లెక్కలోని తీసుకోవడం లేదు. మీరీపనిని పూర్తిచేయండి. మనం లక్ష వ్యాసాలకు చేరుతాము. లోపాన్ని గుర్తించిన అర్జునగారికి ధన్యవాదాలు. భాస్కరనాయుడు గారు ఈ అంతర్వికీ లింకులు అన్ని ఆంగ్ల పదాలను చూచి చేర్చండి. మీపని అంతరాయం లేకుండా కొనసాగాలని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:15, 3 నవంబరు 2013 (UTC)
- ఎల్లంకి గారికి, మొదటి పేజీలో నంబరు మారాలంటే సత్వర మెమరీని తాజా చేయాలి దానికొరకు ?action=purge అనేదానిని యూఆర్ ఎల్ కి చేర్చాలి లేక ఈ లింకు వాడండి. లేకపోతే మరుసటిరోజు చూస్తే తాజా సంఖ్య కనబడుతుంది--అర్జున (చర్చ) 06:53, 5 నవంబరు 2013 (UTC)
- బ్రౌన్ నిఘంటువు పదాలకు అంతర్వికీ లింకులిచ్చే పనిని భాస్కరనాయుడు దీక్షగా చేస్తున్నారు. తదనుగుణంగా గణాంకాలు కూడా మారుతున్నాయి కూడా. నాయుడు గారు ఈ పనిని పూర్తిచేయాలని కోరాను. దానికి వారు అంగీకరించారు. సభ్యులు ఇదేదో వారి స్వంత గణాంకాల కోసం చేస్తున్నది కాదని గమనించాలి.--Rajasekhar1961 (చర్చ) 10:51, 16 నవంబరు 2013 (UTC)
....*ఈ విషయంలో సహ సభ్యులు ఒకరిద్దరైనా పాల్గొన గలిగితే..... రాబోయే ఉగాది నాటికి విక్షనరిలో పుటల సంఖ్య ఒక లక్ష చేరుకోవడములో సందేహము లేదు. కనుక ఒక రిద్దరైనా సహ సభ్యులు సహకరించ గలరని విన్నపము. నేను మాత్రము విక్షనరీ పుటల సంఖ్య ఒక లక్ష (రాబోవు ఉగాది నాటికి) అనే లక్ష్యంతో పని చేస్తాను. వాడుకరి: భాస్కర నాయుడు.
Introducting Beta Features
<small>మార్చు</small>(Apologies for writing in English. Please translate if necessary)
We would like to let you know about Beta Features, a new program from the Wikimedia Foundation that lets you try out new features before they are released for everyone.
Think of it as a digital laboratory where community members can preview upcoming software and give feedback to help improve them. This special preference page lets designers and engineers experiment with new features on a broad scale, but in a way that's not disruptive.
Beta Features is now ready for testing on MediaWiki.org. It will also be released on Wikimedia Commons and MetaWiki this Thursday, 7 November. Based on test results, the plan is to release it on all wikis worldwide on 21 November, 2013.
Here are the first features you can test this week:
- Media Viewer — view images in large size or full screen
- VisualEditor Formulæ (for wikis with VisualEditor) — edit algebra or equations on your pages
- Typography Refresh — make text more readable (coming Thursday)
Would you like to try out Beta Features now? After you log in on MediaWiki.org, a small 'Beta' link will appear next to your 'Preferences'. Click on it to see features you can test, check the ones you want, then click 'Save'. Learn more on the Beta Features page.
After you've tested Beta Features, please let the developers know what you think on this discussion page -- or report any bugs here on Bugzilla. You're also welcome to join this IRC office hours chat on Friday, 8 November at 18:30 UTC.
Beta Features was developed by the Wikimedia Foundation's Design, Multimedia and VisualEditor teams. Along with other developers, they will be adding new features to this experimental program every few weeks. They are very grateful to all the community members who helped create this project — and look forward to many more productive collaborations in the future.
Enjoy, and don't forget to let developers know what you think! Keegan (WMF) (talk) 20:42, 5 నవంబరు 2013 (UTC)
- Distributed via Global message delivery (wrong page? Correct it here), 20:42, 5 నవంబరు 2013 (UTC)
Call for comments on draft trademark policy
<small>మార్చు</small>Hi all,
The Wikimedia legal team invites you to participate in the development of the new Wikimedia trademark policy.
The current trademark policy was introduced in 2009 to protect the Wikimedia marks. We are now updating this policy to better balance permissive use of the marks with the legal requirements for preserving them for the community. The new draft trademark policy is ready for your review here, and we encourage you to discuss it here.
We would appreciate if someone would translate this message into your language so more members of your community can contribute to the conversation.