T.sujatha
తెలుగు విక్షనరీని వేలుపట్టి పది వేల అడుగులు వేయించిన సుజాతగారికి సభ్యులందరి తరఫున కృతజ్ఞతాపూర్వక వందనాలతో ఈ పతాకాన్ని ప్రదానము చేస్తున్నాను - వైఙాసత్య |
తెలుగు విక్షనరీలో విశేష కృషి చేస్తున్న సుజాత గారికి సభ్యులందరి తరఫున అభినందనలతో ఈ పతాకాన్ని ప్రదానము చేస్తున్నాను - సభ్యుడు:విశ్వనాధ్.బి.కె. |
విక్షనరీ ప్రతిపాదిత మూస
<small>మార్చు</small>
నా గురించి
<small>మార్చు</small>నా పేరు సుజాత.నేను సాధారణ గృహిణిని.చదువు అంతంత మాత్రమే స్కూల్ ఫైనల్.వయసు అమ్మమ్మనైన వయసు ఏభైరెండు.కంఫ్యూటర్ పాఠాలు మా అబ్బాయి దగ్గర నేర్చుకున్నాను.నా సుదీర్ఘ జీవితంలో తెలుసుకున్న తెలుగు పదాలను విక్షనరీలో పొందుపరచాలని విక్షనరీ సభ్యత్వం తీసుకున్నాను.
నూతన పదము
<small>మార్చు</small>కొత్త తెలుగు పదం | new english word | |
గమనిక: ఆంగ్ల పదాలను కేవలం చిన్న అక్షరాలు (lower case) తోనే సృష్టించండి. |
తెవీకీ
<small>మార్చు</small>తెలుగు గురించి ఏమి వ్రాస్తానా అనుకుంటున్నారు కదా ! వ్రాయడానికి ఉంది మరి.నేను తెలుగు గడ్డ మీద పుట్టి తమిళనాట మెట్టిన కారణంగా నా మాతృ భాష తెలుగు ఎంత చక్కనిదో ఎంత మధురమైనదో నాకు అర్ధమైంది. ఎవరి మాతృ భాష వారికి మధురమైనదే మరి. అమ్మలా తీయనైనది మాతృ భాష. ఇతర భాషలు ఎన్ని తెలిసినా మాతృభాషా అమ్మ ఒడిలా అపురూపమైదే మరి. ఎందుకంటే మాతృ భాషా పుస్తకాలు, మాతృ భాషా చలన చిత్రాలకు దూరమై ఇంకా అనేక భాషా సంబంధిత విషయాలకు దూరమై అమ్మకు దూరమైనంత బాధను అనుభవించాను. అందువలనే నాకు భాషాభిమానం కలిగిందా లేక అది సహజంగా నారక్తంలో ఉందో భగవంతుడికి ఎరుక. పుస్తకాలకు దూరం కాలేక నేను తమిళం చదివి అర్ధం చేసుకోవడం నేర్చుకున్నాను. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ దాటితే తెలుగుతో అనుబంధం పోయినట్లే. ఎందుకంటే అప్పట్లో నా వంటి మధ్యతరగతి గృహిణికి తెలుగు పత్రికలు, నవలలు లాంటివి దొరకడం కష్టమే. దొరికినా అవి నా అవసరాన్ని పూర్తి చేయలేక పోయాయి. కాని ఇప్పుడు అంతర్జాలంలో తెలుగులో అనేక విషయాలు లభిస్తున్నాయి. నేను చిన్నతనం నుండి చదవాలని తపిస్తున్న అనేక విషయాలు ఇప్పుడు తెలుగులో లభించాయి. అందుకే నాకు చేతనయినంత నేనూ చేయాలని అనుకున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన తెవీకీ కి నేను ఎప్పుడూ ఋణ పడి ఉంటాను. సాంకేతికంగా అంతగా జ్ఞానం లేని నేను, తెవీకీ ప్రవేశం తరువాత నేను కొన్ని అవసరమైన సాంకేతిక విషయాలు నేర్చుకున్నాను.
ఇతరాలు
<small>మార్చు</small>యోగి వేమన
<small>మార్చు</small>శివ సహస్రనామావళి వాటి అర్ధాలు
<small>మార్చు</small>[[]] నామవాచకం
{{subst:గ్రామాలు ఉపశీర్షికలు}}