పెరుగు:-1 ఎదుగుదల,వృద్ధి, అభివృద్ధి, వర్ధ్హిలుట, వ్యాపించుట, విస్తరించుట 2 పాల సంబంధిత ఆహార పదార్ధము.
కలుగు:-1 పొంది ఉండుట 2 ఎలుక నివాసము 3 నేత్ర వ్యాధి.
తరుగు:-1 క్షీణించుట, తగ్గుట 2 కత్తి పీటతో ముక్కలు చేయుట.
మరుగు:-1 చాటు, అజ్ఞాతము 2 పాలు, నీళ్ళు వంటి ద్రవపదార్ధములను పొయ్యిమీద కాచినప్పుడు చేరుకును గరిష్ట ఉష్ణ పరిమితి. తెర్లుట, మసలుట అనే ఇతర అర్ధాలు ఉన్నాయి.
తొక్కు:- 1 తొక్కు కాలితో తొక్కుట అనే క్రయాపదం. 2 పండ్లు కాయలు మొదలైన వాటి పైన ఉండే రక్షణ కవచం.
చెక్కు:- పదునైన వస్తువుతో మెత్తని వస్తువును చెక్కుట అనే క్రియా పదము. చెక్క, రాయి మొదలైన వాటిని చెక్కి పని ముటులు, అలంకరణ వస్తువులు చేస్తారు. 2 శాకాహారపు రక్షణ కవచాన్ని కూడా చెక్కు అంటారు. వేరుచనగ చెక్కులు మొదలైనవి.