సుజాత గారూ! పని మొదలుపెట్టేసినందుకు అభినందనలు. ఒక చిన్న విషయం.. పేజీ ఎలా ఉండాలనే విషయమై ఒక మూసను అనుకున్నాం. దాని ప్రకారమే అమ్మ పదానికి పేజీ తయారుచేసాం. మీరు ఆ మూసలో అవసరమనిపించిన మార్పులు చేర్పులు చేసి, ఆ మూసనే వాడండి. నేనిది ముందే మీకు చెప్పి ఉండాల్సింది, నాదే పొరపాటు. __చదువరి 03:32, 23 సెప్టెంబర్ 2006 (UTC)

కొన్ని మార్పులు, సూచనలు <small>మార్చు</small>

సుజాత గారూ, మీరు తయారు చేసిన పేజీలో కొన్ని మార్పులు- బంకోలు పేజీలో ఈ మార్పులు చేసాను.

  1. భాషావిభాగము ను భాషాభాగము గాను
  2. ఉత్పత్తి ని వ్యుత్పత్తి గాను మార్చాను.

కొన్ని సూచనలు: నానార్థాలు / నానార్ధాలు: ఈ రెండింటిలో ఏది సరైనదో చూడగలరు. పద ప్రయోగాలు విభాగంలో మూడు ఉపవిభాగాలు అవసరం లేదేమోనని నా ఉద్దేశ్యం, ఆలోచించండి. ఉంచదలిస్తే, వాటిలోని తప్పులను సరిచెయ్యండి. కొత్త కొత్త పదాలను రాస్తున్నారు. థాంక్సండి. అలాగే వాటి అర్థాలు కూడా రాయండి. -చదువరి 13:39, 28 సెప్టెంబర్ 2006 (UTC)

మరో దోషం - సంభదిత పదాలు - కనపడుతూంది. దాన్ని కూడా సవరించగలరు. ఒక సందేహం.. కేవలం మూసను మాత్రమే పెడుతున్నారు కదా, అర్థం తరువాత రాద్దామనా? __చదువరి 03:00, 30 సెప్టెంబర్ 2006 (UTC)

సుజాత గారూ, విక్షనరీ నుండి వికీపీడియాకు లింకు ఇవ్వవచ్చు. లింకుకు ముందు w: అని రాస్తే చాలు, తెలుగు విక్షనరీ నుండి తెవికీకి, ఇంగ్లీషు విక్షనరీ నుండి ఎన్వికీకి లింకులు ఏర్పడతాయి. నేను బందా పేజీనుండి తెవికీలోని బందా కనకలింగేశ్వరరావు పేజీకి లింకు ఇచ్చాను, చూడండి (అక్కడ ఆ పేజీ లేదులెండి). తెవికీలో ఆ పేజీ ఉందా లేదా అనేది పట్టించుకోకండి. ఇప్పుడు లేకపోయినా తరువాత సృష్టించవచ్చు కదా. ఉచితమనిపించిన ప్రతి పేజీలోను ఈ లింకు ఇస్తే బాగుంటుందనుకుంటాను. ఆలోచించండి. __చదువరి 03:23, 30 సెప్టెంబర్ 2006 (UTC)

ఇది చూడండి <small>మార్చు</small>

చర్చ:అనువాద పద కోశము పేజీలో ఒక సూచన రాసాను, చూడగలరు. __చదువరి 15:05, 30 సెప్టెంబర్ 2006 (UTC)

కొత్త పేజీ <small>మార్చు</small>

పదాలకు పేజీలను సృష్టించేటపుడు, వట్టి మూస కాకుండా, కనీసం ఒక్క అర్థమన్నా ఇస్తే బాగుంటుంది. పేజీ చూసేవారికి నిరాశ కలగదు. __చదువరి 08:40, 2 అక్టోబర్ 2006 (UTC)

అభినందనలు <small>మార్చు</small>

మన విక్షనరీ 100 పేజీలను చేరింది. ఈ ఘనతలో సంహభాగం మీదే! మీకు నా అభినందనలు. __చదువరి 15:00, 14 అక్టోబర్ 2006 (UTC)

మీ కృషి అభినందనీయం. ఎదైనా సహాయము కావలంటే తప్పకుండా అడగండి --వైఙాసత్య 17:54, 18 నవంబర్ 2006 (UTC)

ధర్మం <small>మార్చు</small>

ధర్మం మీద ఆ వ్యాఖ్య నేను చెయ్యలేదు..ఎవరో అజ్ఞాత సభ్యుడు చేశాడు..దాన్ని చూసి నేను దర్మము నుండి ధరమము కు తరలించాను అంతే. అచ్చుతప్పులు దొర్లుతాయని భయపడకండి..ఎవరో ఒకరు దిద్దుతారు. మీరు చేస్తున్న కృషి అభినందనీయము. మీకు వికీ విధివిధానాలు ఈపాటికి అర్ధం అయ్యే ఉంటాయి అనుకుంటాను..అందువళ్ల నిర్వాహక హోదాకు అభ్యర్ధన పెట్టాలని నా కోరిక --వైఙాసత్య 20:55, 28 ఫిబ్రవరి 2007 (UTC)Reply

విక్షనరీ మూస <small>మార్చు</small>

సుజాత గారు, మీరు తెలుగు విక్షనరీలో ఇలా తమిళ్ పదాలు, ఆంగ్ల పదాలు రాయటానికి కారణం కాస్త చెప్తారా? నేను ఈ తెలుగు విక్షనరీకి కొత్త.

విక్షనరీ తెలుగు -> తెలుగు పదకోశమే కాకా తెలుగు -> అనేక భాషలు, అనేక భాషలు -> తెలుగు పదకోశము కూడా --వైఙాసత్య 19:51, 12 మార్చి 2007 (UTC)Reply

అజ్ఞాత సభ్యునికి <small>మార్చు</small>

విక్ష్నరీలో పనిచేసే సభ్యుల ఇతర భాషా పరిజ్ఞానము తెలుగు సోదరులకు ఉపయోగ పడటానికి ఎవెరికి తెలిసిన ఇతర భాషా పదాలను వాళ్ళు చేర్చడానికి అనువుగా అనువాదాలు ఉప విభాగం ఉపయోగ పడుతుంది.మీరు కూడా మీకు తెలిసిన ఇతరభాషా పదాలను చేర్చవచ్చు.ఇక మీదట చర్చా మీసంతకం చేయండి.అప్పుడే మీకు సరి అయిన సమాధానం ఇవ్వడానికి వీలు ఔతుంది. T.sujatha 16:56, 12 మార్చి 2007 (UTC)Reply

నిర్వాహక హోదా <small>మార్చు</small>

సుజాత గారూ, నేను మిమ్మల్ని నిర్వాహక హోదాకై ప్రతిపాదించా. ప్రతిపాదనకు మీ ఆమోదం ఇక్కడ తెలియజేయండి. ఆ తరువాత మీరు దానికై ఇక్కడ ఒక అభ్యర్ధన చెయ్యాల్సి ఉంటుంది. అభ్యర్ధనను స్టీవర్డ్లు పరిశీలించి వారం రోజుల్లో నిర్వాహక హోదా ఇస్తారు.

ఇంకో విషయం, నేను వికీపీడియాలోలాగా ఇక్కడ కూడా ఎడిట్ బాక్సులోనే తెలుగు వచ్చేటట్లు చెయ్యాలనుకుంటున్నా. మీ అభిప్రాయం తెలియజేయగలరు. --వైఙాసత్య 19:07, 28 జూన్ 2007 (UTC)Reply
సుజాత గారూ, తెలుగు విక్షనరీలో నిర్వాహకులు అయ్యిన సందర్భంగా శుభాబినందనలు --వైఙాసత్య 15:08, 5 జూలై 2007 (UTC)Reply

బ్రౌన్ పదకోశం <small>మార్చు</small>

బ్రౌన్ పదకోశాన్ని తెలుగు వీక్షనరీలోకి ఎక్కించటానికి ఒక బాటు ప్రోగ్రామును తయారుచేసాను. అయితే విక్షనరీలో ఆ బాటును నడపటానికి నా బాటుకు బాటుహోదా తీసుకోవాలి. అందుకోసం ఇక్కడ మీ అంగీకారం తెలుపగలరు. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 18:12, 11 జూలై 2007 (UTC)Reply

సుజాతగారు, మీ సహకారానికి ధన్యవాదాలు. నా బాటుకు ఇంకా అనుమతి రాలేదు. రావడానికి ఇంకో వారం 10 రోజులు పడుతుంది. అందుకనే ప్రస్తుతం, వికీపీడియా సాంప్రదాయం ప్రకారం, బాటు ద్వారా నిమిషానికి ఒక్క పదాన్నే ఎక్కిస్తున్నాను. అంతేకాదు బాటులో ఏమయినా లోపాలున్నాయోమో అని ప్రస్తుతం పరీక్షిస్తున్నాను కూడా. అలాగే మీరు నా బాటు ఎక్కిస్తున్న సమాచారాన్ని చూసి ఇంకేమయినా జతచేయొచ్చేమో సలహాలు ఇవ్వగలరు. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 16:38, 12 జూలై 2007 (UTC)Reply

అక్షరాలు <small>మార్చు</small>

నాదొక సందేహము - అక్షరాలులో వత్తులతో కూడిన అక్షరములు చేర్చడము అవసరమా?

ఉదాహరణకు "స్త్రీ" అనే పదాన్నీ సీ అక్షరసముదాయము లోను, "బ్రాహ్మణుడు" అనే పదాన్ని బా అక్షర సముదాయములోను చేర్చవచ్చును కదా! -- అన్వేషి 08:26, 2 ఆగష్టు 2007 (UTC)

ఆంగ్ల పదాలు <small>మార్చు</small>

ఆంగ్ల పదాలకు ఇక్కడ పేజీలను సృష్టించడం కంటే ఇక్కడినుండి ఆంగ్ల వికీకి లింకులు ఇవ్వవచ్చును కదా! నా ఉద్దేశ్యము ప్రకారము ఆంగ్ల పదాలకు సృష్టింఛిన పేజీలన్నింటినీ (అందులోని తెలుగు పదాలను చేర్చిన తరువాత) తొలగించాలి. మీరేమంటారు?

అలాగే " ఆదిగా గల పదములు" లాంటి పేజీలను REDIRECT చెయ్యాలి లేదా తొలగించాలి. ఒక్కసారి Special:Lonelypages చూడండి.

వర్గం:తొలగించు ఉంచండి, తొలగించవలసిన పేజీలను మీకు తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. అన్వేషి 10:37, 3 ఆగష్టు 2007 (UTC)

ఇతర బాషలకు లింకులు <small>మార్చు</small>

తెలుగు పదాలకు ఇతర బాషల అనువాదములను చేర్చినప్పుడు వాటికి లింకులివ్వడం తేలికగా ఉండటానికి ఇతర బాషలకు మూసలను చేర్చాను. ఉదాహరణకు ఇసుక అనే పదానికి ఆంగ్ల మూస {{en}} పక్కన [[:en:sand]] అని చేరిస్తే సరిపోతుంది. అలాగే ఇతర బాషలకు కూడా!

అక్షరలక్షలు <small>మార్చు</small>

ఒక్క నిముషము ఆగుదాం.

తెలుగుపదాలు అక్షరలక్షలు (ఒకో అక్షరానికి లక్ష పదాలనుకున్నా 56 లక్షలకు పైనే ఉంటాయి). ఇంతవరకూ మనము అక్షరక్రమములో పదాలను చేర్చుతున్నాము. అలాచేర్చడమువల్ల సమయమువృధా అవుతుందన్నది నా అభిప్రాయము. దిద్దుబాట్లు ఎక్కువ అవుతాయి (అన్నీ చిన్న చిన్న దిద్దుబాట్లు). ఒక పదానికి నానార్థాలు చేర్చేటప్పుడు ఒకోసారి ఎన్ని అర్థాలు ఉంటే అన్ని (ప్రథమాక్షర) పేజీలలోను కూడా దిద్దుబాట్లు చెయ్యవలసి ఉంటుంది. ఇప్పటివరకూ విక్షనరీలో దగ్గర దగ్గర 15000 దిద్దుబాట్లు జరిగాయి. కాని వ్యాసాల సంఖ్య 3500 కూడా మించలేదు.

నాది ఒక సూచన. ఇప్పటివరకూ విక్షనరీలో 50 వర్గాలు కూడా దాటలేదు. మనము వర్గముల వారీగా పదాలను చేర్చినట్లయితే బాగుంటుంది. దీనివల్ల ప్రతి పదము ఆ వర్గము పేజీలో ఉంటుంది. అన్ని పదాలూ సంబందిత వర్గాల్లో చేరుతాయి. ఇప్పుడు మన విక్షనరీలో వర్గీకరించని పేజీలు 1670 ఉన్నాయి. మనము వర్గాల వారీగా పదాలను చేర్చినట్లయితే వర్గీకరించని పేజీలు మరియు అనాథ పేజీలు లేకుండా చెయ్యవచ్చు. మన పదజాలానికి (పదభావనకు / పదాలోచనకు) మద్యలో అంతరాయము కలుగదు (ఒక వర్గంలో పదాలన్నింటిని ఆ వర్గంలో ఏకవచన, బహువచన, వ్యతిరేక పదాలు మరియు నానార్థాలతో సహా చేర్చిన తరువాత ఆ పదాలకు పేజీలను సృష్టించవచ్చు లేదా అప్పటికే ఉన్న పేజీలకు ప్రస్తుత వర్గాన్ని కూడా చేర్చవచ్చు).

మనము ప్రతి పదాన్ని వెంటనే ప్రథమాక్షర పేజీలో పెట్టవలసిన పని లేదు. విక్షనరీ లోని అన్నిపేజీలులో పదాలన్నీ అకారాది అక్షర క్రమంలో ఉంటాయి. ప్రథమాక్షర పేజీలలో చేర్చాలంటే మన విక్షనరీలో కొత్త పదాలు లేదా వ్యాసాలు 10000 లేదా 5000 చేరిన తరువాత ఆ పదాలను అన్నిపేజీలు నుండి కాపీ చేసుకొని చేర్చవచ్చు.

ఉదాహరణకు పుష్పాలు, పండ్లు మరియు శరీరావయవాలు పేజీలు లేదా వర్గాలను చూడండి.

సుజాతగారూ, ఒక అభ్యర్దన. మీరు మీఅభిరుచులలో ఇతరులనుండి మెయిల్ రిసీవ్ చేసుకొనేటట్లు మార్పులు చేయండి. మీతో సంప్రదించడానికి, మీరు ఇతరులను సంప్రదించడానికి, మీ సహాయాన్ని కోరడానికి మరియు మీరు అందజేయడానికి అవకాశము ఉంటుంది.

ఇంకా ఎవరికైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో అడగవచ్చు లేదా నాకు ఈ-మెయిల్ పంపవచ్చు --అన్వేషి 10:08, 8 ఆగష్టు 2007 (UTC)

దిద్దుబాట్ల సంఖ్య పెరగటంలో సమస్యేమీ లేదు. దిద్దుబాట్లు తక్కువుంటేనే మిగిలిన విక్షనరీలు మనవైపు అనుమానంగా చూస్తాయి (అలా అని అనవసరంగా దిద్దుబాట్లు చెయ్యమని కాదు)
ప్రథామాక్షర పేజీలు అంటే (ఇలాంటివి -> ) అయితే..ఇవి ప్రస్తుతం సుజాత గారు సౌలభ్యం కొరకు ఉపయోగిస్తున్నారని అర్ధం చేసుకున్నాను..ఇవి మెయిన్ నేంస్పేసులో కాకుండా Index లాంటి కొత్త నేంస్పేసుకు మార్చాలి (ఎందుకంటే ఇవి నిజానికి నిఘంటువు ఎంట్రీలు కావు..కేవలం ఇండెక్స్ పేజీలే). ఇవి ఉండటం వళ్ళ కూడా నష్టమేమీ లేదు. పదాలు బాగా పెరిగినప్పుడు (అంటే అన్వేషి గారన్నట్టు వేలు,లక్షల్లోకి చేరినప్పుడు) వ ఇండెక్స్ పేజీలో వ, వా, వి, వీ మొదలైన ఇండెక్స్ పేజీలకు లింకులుంటాయి. అన్వేషి గారన్నట్లు ఇండెక్స్ (ప్రథమాక్షర పేజీ)ల్లో ఒకేసారి అన్నిపేజీల నుండి కూడా కాపీ చెయ్యవచ్చు..కానీ సుజాతగారికి అవి సౌలభ్యాన్నిస్తే అలాగే కొనసాగించమని నా సలహా.
వర్గీకరణ తప్పకుండా చెయ్యాల్సిందే. శరీరావయవాలు వంటి పేజీలు కూడా ఒకరకమైన ఇండెక్సులే..పేజీలకు వర్గాలను చేర్చటంతో పాటు..సమంజమనిపించినప్పుడల్లా శరీరావయవాలు, పండ్లు లాంటి ఇండెక్స్ పేజీలు తయారు చెయ్యాలి. --వైఙాసత్య 12:07, 8 ఆగష్టు 2007 (UTC)
ఆంగ్ల విక్షనరీలో ప్రథమాక్షర పేజీల్లాంటి పేజీలకు Index అనే నేంస్పేసు, పండ్లు, శరీరావయవాల్లాంటి పేజీలకు Appendix అనే నేంస్పేసు వాడుతున్నారు. వీటినీ మనమూ పెట్టించుకోవాలి. మీకు వీటికి తెలుగు పేర్లేమైనా సముచితమనిపిస్తే చెప్పండి నేను ప్రోగ్రామర్లను ఆ నేంస్పేసులను సృష్టించమని అడుగుతాను. --వైఙాసత్య 12:18, 8 ఆగష్టు 2007 (UTC)

అభినందనలు. --అన్వేషి 04:51, 18 ఆగష్టు 2007 (UTC)

మీ కృషి అమోఘం. అందుకోండి నా తరఫున కూడా అభినందనలు --వైఙాసత్య 13:21, 18 ఆగష్టు 2007 (UTC)

సుజాత గారూ, నా అభినందనలు కూడా స్వీకరించండి. __చదువరి 05:25, 28 ఆగష్టు 2007 (UTC)

చర్చా పేజి <small>మార్చు</small>

సుజాత గారు , నన్ను నిర్వాహకుడి ఎన్నికలొ మద్దతు చెప్పినందుకు ధన్యవాదాలు. ఒక చిన్న విషయం తప్పులు ఎన్ను వారు తమ తప్పులు ఎరుగరు , దీనిని మననం చేసుకొంటు ఇది చెప్పుతున్నాను. శాస్త్రి గారి సభ్యత్వ పేజిలొ వ్రాశారు. మాములుగా చర్చా పేజిని ఇటువంతి వాటికి వినియోగించాలి. సభ్యుడు పేజి సభ్యుడి సొంత పేజి క్రింద, బహుమతులు అవి ఇస్తే తప్ప ఆ ఒకరి సభ్యత్వ పేజిని వాడరాదు.--़18:33, 20 ఆగష్టు 2007 (UTC)~़

ఈ వారం పదము <small>మార్చు</small>

ఈ వారం పదము అనే శీర్షిక మొదటి పేజి లొ చేరిస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యము. పెద్దలు సమాలొచన చేసి ఆలోచించండి. పదము దాని అర్థము మరియు బొమ్మ మరియు తెలిసిన ఇతర భాషలలొ ఏమంటారు--మాటలబాబు 00:51, 27 ఆగష్టు 2007 (UTC)

30వేలవ పదం <small>మార్చు</small>

మీరు సృష్టించిన జనని అనే పదం వీఅనరీలో 30వేలవ పదంగా నమోదయ్యింది. ధన్యవాదాలు. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 08:55, 12 సెప్టెంబర్ 2007 (UTC)

భలే భలే చాలా బాగుంది. శుభాకాంక్షలు --వైఙాసత్య 18:19, 12 సెప్టెంబర్ 2007 (UTC)

ఉపయోగకరమైన లింకులు <small>మార్చు</small>

రచ్చబండకు తరలిస్తున్నాను. --అన్వేషి 06:49, 14 సెప్టెంబర్ 2007 (UTC)

తొగించాల్సిన వ్యాసాలు <small>మార్చు</small>

సుజాతగారు, ఈ పేజీలో కనిపిస్తున్న పేజీలను తొలగించగలరు. అవన్నీ స్పాము (అవాఛనీయమైన/అనవసరమైన) సమాచారం. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 03:40, 15 సెప్టెంబర్ 2007 (UTC)

తూము అనే పేజి ఏర్పాటు చెయ్యండి--మాటలబాబు 10:43, 22 సెప్టెంబర్ 2007 (UTC)

15000 దిద్దుబాట్లు పూర్తి చేసిన మీకు (మీకృషికి మరియు దీక్షకు) అభినందనలు. అన్వేషి 10:04, 17 డిసెంబర్ 2007 (UTC)

'అంధవిస్వాసము' <small>మార్చు</small>

సుజాత గారూ, మీ ప్రోత్సాహానికి థాంక్స్. మీరు రాసిన spelling 'అంధవిస్వాసము' తప్పు (సరి అయిన పదం 'అంధవిశ్వాసము'). దానిని సరిచేయడానికి ప్రయత్నించాను, కాని ఆ పేజ్ సరి అవ్వలేదు.... సుండ్రు

ధన్యవాదాలు సుజాత గారూ- పద్మావతి

సుజాత గారూ విక్షనరీ లో కొత్త పదం ఎలా చేర్చాలి ?padma 08:43, 12 ఫిబ్రవరి 2008 (UTC)Reply

కంప్యూటర్ <small>మార్చు</small>

సుజాతగారూ,
కంప్యూటర్ కు ధిక్యంత్రం అనే పేరు తెలుగులో ఉన్నట్లు గతంలో ఎక్కడో చదివాను. దీన్ని పరిశీలించి వీలయితే విక్షనరీలో చేర్చండి.
-208.85.244.2 01:01, 16 ఫిబ్రవరి 2008 (UTC)Reply

interwiki links in translations tables <small>మార్చు</small>

Hi,

You created a large number of entries with iwiki links in the translations tables; missing the leading ":" that makes it a displayed link.

You did fix one here, but note that the iwiki bot "fixed" the rest.

Somehow we need to go through all these and edit from the previous revisions and format the translations properly. (Although, oddly, the "English" translations don't appear to be English? Is there something else going on here? And the fr translations aren't French? Nor zh Chinese?)

best to reply on en:User talk:Robert Ullmann Robert Ullmann 07:03, 2 ఏప్రిల్ 2009 (UTC)Reply

Replied on Sujatha's behalf -- Arjunaraoc 12:40, 22 సెప్టెంబరు 2010 (UTC)Reply
  • సుజాత గారు,
  • ఆమె పదము ఒకసారి చూసి చెప్పండి.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 05:54, 8 నవంబరు 2010 (UTC)

నా పని చూసి చెప్పండి <small>మార్చు</small>

  • సుజాత గారు,
  • నమస్కారములు.
  • ఈ రోజు (నేను చేస్తున్న) నా పని ఎలా వుందో కాస్త చూసి వెంటనే చెప్పండి.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 03:46, 9 నవంబరు 2010 (UTC)

అంక అంటే అర్ధము <small>మార్చు</small>

  • అం--> అంక అనే పదమునకు సంబందించి ఒక్కొక్క పదానికి వేరు వేరు అర్ధాలు వున్న పదములు సంబంధిత పదాలు చోట చేర్చుతున్నాను.
  • దీని గురించి మీ అభిప్రాయము చెప్పండి.
  • మీరు చెప్పినవి కూడా తప్పకుండా జత చేయవచ్చు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:41, 9 నవంబరు 2010 (UTC)

  • +++++++++
  • మీరు అంక పదమును ఒకసారి చూడగలరు.
  • ఒక పదానికి నానా అర్ధములు ఎన్ని వ్రాయ వచ్చునో తెలుపగలరు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:46, 9 నవంబరు 2010 (UTC)

అప్పుడప్పుడు పలకరించండి <small>మార్చు</small>

  • మీరు చేస్తున్న పనికి నా సహకారము తప్పక అందివ్వగలను. అప్పుడప్పుడు మీరు మాత్రం తప్పకుండా పలకరించండి. దాని వల్ల మరికొంత ఉత్సాహముగా, చేస్తున్న పనిలో పాలు పంచుకునేందుకు నాలాంటి వారికి మరింత ఉపయోగము. సహృదయముతో స్వీకరించగలరు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:21, 9 నవంబరు 2010 (UTC)

అభ్యంతరకరము విషయములు <small>మార్చు</small>

  • సుజాత గారికి,
  • నేను చేస్తున్న పనిలో అభ్యంతరకరముగా ఏమైనా విషయములు వుంటే వెంటనే మీరు తెలియ జేస్తే అంతటితో ఆపగలను.
  • జె.వి.ఆర్.కె.ప్రసాద్ 16:01, 11 నవంబరు 2010 (UTC)

మీరు మేధావురాలు <small>మార్చు</small>

  • మీరు తప్పకుండా పదాలతోటి పలకరించాలి. నాకు ఎటువంటి భేషష్జాలు లేవు. మీరు మీ ధోరణిలోనే చెప్పండి. ఈ విషయములో మిమ్మల్ని ముందుగానే అభ్యర్ధించాను. మీరు పదాలను వ్రాయండి. అన్ని శాస్త్రాలు పదాలు కూడా తప్పకుండా చేర్చాలి. నన్ను ఎవరు పలకరించినా తప్పకుండా జవాబు ఇస్తాను. ప్రస్తుతము మీరే చురుకుగా పాల్గొంటున్నారు. మీరు తప్పకుండా మేధావురాలు అని నేను భావిస్తాను. చాలా చాలా కష్ట పడుతున్నారు అన్ని విషయములలో అని చెప్పవచ్చును. ఇలాగే మీరు ముందు ముందుకు ఇంకా ఇంకా సాగాలి.
  • జె.వి.ఆర్.కె.ప్రసాద్ 16:55, 11 నవంబరు 2010 (UTC)

చిత్రాలు అనుమతి <small>మార్చు</small>

  • సుజాత గారు,
  • మీ సూచనలు అందుకున్నాను. విషయములు గ్రహించినాను.
  • నా మిగతా చిత్రాలు ప్రస్తుతము అక్కడ లేవు. చూసి అవి కూడా అనుమితి ఇస్తాను.
  • ప్రస్తుతము మూసలు కోసము ప్రయత్నము చేస్తున్నాను.
  • నాకు కొత్త, అందుకని అనుమతి పెట్టలేదు.
  • నేను చేస్తున్న పని గురించి తప్పకుండా విమర్శించి, మెచ్చుకోండి.
  • మీ సందేశము ఇవ్వగలరు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:09, 14 నవంబరు 2010 (UTC)

చిత్రానికి మూస <small>మార్చు</small>

  • సుజాత గారు,
  • ప్రస్తుతము వున్న వాటికి ఇప్పటికే అనుమతి మూసను వుంచాను.
  • మీరు చూస్తారని ఆశిస్తాను.
  • "డిజిటలు గడియారము" అనే చిత్రానికి మూస కలిప్ చేసాను. అలా వుంటే సరి పోతుందంటారా ?
  • తెలియ జేయగలరు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:40, 14 నవంబరు 2010 (UTC)

సూచన చెప్పాలని పించింది <small>మార్చు</small>

  • సుజాత గారికి,
  • మీకు ఒక సలహా/సూచన చెప్పాలని ఇప్పుడు అనిపించింది.
  • చిత్రములు అన్నింటికన్నా పైభాగములో వుంచితే ఎలా వుంటుందంటారు ?
  • ఒక పదానికి మూసలో మొదలు పెట్టి పుటని తయారు చేస్తునప్పుడు, తిరిగి అదే పదన్ని మీరు పొందు పరచటములోని ఆంతర్యము తెలియజేయ గలరు.
  • సాక్షా అంటే కనిపించటము అనేలా అర్ధము వస్తుంది. అందుకని మీరు సాక్ష్యాధారము అని మార్చగలరు.
  • కొత్త వర్గాల మూసలు పెట్టాను, మీ అభిప్రాయము చెప్పగలరు.
  • మీ కృషికి మనస్ఫూర్తి అభినందనలు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:55, 15 నవంబరు 2010 (UTC)

పుటల గురించి చర్చ <small>మార్చు</small>

  • సుజాత గారికి,
  • చిన్న పేజీలు అనే వర్గం గురించి చర్చ ఎక్కడ చేయాలో లింకు ఇవ్వగలరు. ఇంగ్లీషు పదాలు ఎరుపు రంగులో వున్నాయి. దాని వల్ల పాఠకులు దానిలో ఎమీ వుండదని ఆ పదాన్ని క్లిక్ చేసే అవకాశము వుండదు. నీలం రంగులోకి ఆ పదాలని మార్చి వర్గాలు కేటాయించాలి. మీకు తెలిసిన అనుభవము వున్న వారిని సంప్రదించి తెలియజేయ గలరు. వర్గాల గురించి, పుటల గురించి, విడివిడిగా చర్చలు ఏవిధముగా చేయాలో నాకు తెలియడము లేదు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 02:26, 18 నవంబరు 2010 (UTC)

  • చిన్న పేజీలకు ప్రత్యేక పుట ఉండదు. ఎరుపు రంగు లింకులకు పేజీలు ఉండవు కనుక వాటిని అలా వదిలి వేసినా పరవా లేదు.వాటిని అలా వది వేస్తే చాలు. వాట్ గురించిన చర్చ అవసరం లేదు. సృష్టించిన పేజీలకు మాత్రమే చర్చలు ఉంటాయి. --T.sujatha 03:27, 18 నవంబరు 2010 (UTC)

Thanks from Turkey <small>మార్చు</small>

Thanks, for your message. But, I don't know Telugu. I know Turkish. --Kmoksy 19:49, 25 నవంబరు 2010 (UTC)Reply

Telugu version user language templates <small>మార్చు</small>

How do I let others in this version know about what language I can speak very well in? Every time I type on my Latin keyboard, Telugu characters appear on the text. - Lo Ximiendo 21:30, 25 నవంబరు 2010 (UTC)Reply

Vague advice <small>మార్చు</small>

Which mark in the edit box are you talking about? I don't know what it is or even which one it is. - Lo Ximiendo 02:12, 27 నవంబరు 2010 (UTC)Reply

Where is the command bar? - Lo Ximiendo 03:43, 27 నవంబరు 2010 (UTC)Reply

ఎవరో చెడగొడుతూ వున్నారు <small>మార్చు</small>

సుజాతగారికి,

  • కొన్ని బొమ్మలని నేను కుడి మార్చాను. తిరిగి ఎడమకు మార్చటము జరుగుతోంది. అది ఎవరు చేస్తున్నారో తెలియడము లేదు. మీ సలహా చెప్పగలరు.

ఉదా: 59.92.83.198: వీరు ఎవరో తెలియదు. ఇలా నంబరుతో వచ్చేవారు వున్నారు. [*http://te.wiktionary.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:Contributions/59.92.83.198]

  • ఈ విధముగా విషయాలను మార్చి వేస్తూ వుంటే అవి బాగు చేసుకోవటము సరి పోతుంది. నేను ఇక్కడకు కొంతకాలము రాకుండా మానుకుంటే మంచిదేమో అని అనిపిస్తోంది. వచ్చినా సేకరించిన విషయములను రోజుకు కొద్ది కొద్దిగా చేర్చాలి. నేను మొదటి నెల కంటే చాలా తగ్గించుకున్నాను. నేను ఎవరికీ సమస్యను కాను.
  • చేస్తున్న పనులను కొందరు కావాలని ఎవరో చెడగొడితే, చెడగొడుతూ... వుంటే వాటికి నివారణ చర్యలు ఏ విధముగా తీసుకోవాలో నాకు తెలియదు. మీకు ఏమైనా తెలుసునా ?

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 03:00, 3 డిసెంబరు 2010 (UTC)

నేటి పదం మరియు మూల స్వరూపం పై స్పందన <small>మార్చు</small>

Wiktionary:నేటి_పదం, Wiktionary:మూలస్వరూపం పై త్వరలో స్పందించండి. --అర్జున (చర్చ) 00:10, 12 మే 2012 (UTC)Reply

ఇప్పుడే ఆ పని ఆరంభిస్తున్నను.़़़़़--t.sujatha
పని మొదలు పెట్టినందులకు సంతోషం. మూస:SWOTD మూస వాడి మీరు చేర్చిన పదాలు మార్చండి.--అర్జున (చర్చ) 09:31, 12 మే 2012 (UTC)Reply
మూస చర్చ:SWOTD#మూస వాడుక సలహాలుచూడండి.--అర్జున (చర్చ) 10:30, 12 మే 2012 (UTC)Reply

నేటి పదం <small>మార్చు</small>

సుజాత గారూ, నేటి పదంలో నెలకు సంబంధించిన మూసలో కొత్త తేదీకి సంబంధించిన పదాలు చేర్చడానికి వీలుపడడం లేదు. దయచేసి చూడండి. కొన్ని తొలగించవలసిన పదాలు ఉన్నాయి. అవి నాయుడు గారు చేసిన కొన్ని చిన్న పొరపాట్ల మూలంగా సృష్టించబడ్డాయి. వాటికి చూసి తొలగించండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 08:53, 8 అక్టోబరు 2012 (UTC)Reply

హాట్ కేట్ స్థాపన <small>మార్చు</small>

సుజాత గారు, వికీపీడియాలో హాట్ కేట్ స్థాపించిన కొంతకాలం తర్వాత నేను ఈ మధ్యనే ఉపయోగించడం మొదలుపెట్టాను. నిర్వాహకులకు చాలా ఉపయోగకరంగా ఉన్నది. ముఖ్యంగా వర్గాలను చేర్చడానికి లేదా తొలగించడానికి ఎక్కువ సమయం అవసరం లేకుండా సులువుగా చేయగలుగుతున్నాము. ప్రస్తుతం విక్షనరీలో 70,000 వ్యాసాలు వున్నాయి. వీటిని వర్గీకరించడం ఒక పెద్ద పని. దానిని సులభంగా చేయడానికి ఇక్కడ కూడా హాట్ కేట్ స్థాపించడానికి అర్జునరావు గారిని సంప్రదించాను. వారు ఇది నిర్వాహకులు మాత్రమే చేయగలరని తెలియజేశారు. మీరొక్కరే ఆ పని చేయగలరు. కాబట్టి అర్జునరావు గారితో సంప్రదించి, ఎలా స్థాపించాలో తెలుసుకొని ఆ పని పూర్తిచేస్తారని కోరుతున్నాను. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 07:11, 25 ఫిబ్రవరి 2013 (UTC)Reply

సుజాత గారు, విక్షనరీని 70 వేల పదాలకు చేర్చి చాలా ఘనమైన కృషి సలిపిన మీకు జోహార్లు. వర్గీకరణ సులువుగా చేయటానికి ఈ హాట్‌కేటును స్థాపించాను. మీ అభిరుచుల్లో ఉపకరణాలకెళ్ళి ఈ సాధనాన్ని సచేతనం చేసుకోవచ్చు --వైఙాసత్య (చర్చ) 04:41, 10 మార్చి 2013 (UTC)Reply

విన్నపము <small>మార్చు</small>

సుజాత గారూ! నమస్కారం! నేను విక్షనరీనందు మాజీ నిర్వాహకునిగా ఉన్నాను. కానీ ఇంకనూ నిర్వాహకునిగా పని చేయాలను కుంటున్నాను. ఈ సందర్భములో దానికి సంబంధించిన విధి విధానముల "పని" అయ్యేందుకు కావలసిన మీ సహయ సహకారముల కోసము విన్నవించు కుంటున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:45, 5 ఏప్రిల్ 2013 (UTC)

ప్రసాదుగారూ ! నిర్వాహక హోదా కొరకు అభ్యర్ధన చేయండి. నేను మద్దతు తెలుపుతాను. అలాగే మిగిలిన సభ్యులు తమ మద్దతు తెలియజేస్తారు. --T.sujatha 05:02, 7 ఏప్రిల్ 2013 (UTC)

కొన్ని సందేహాలు <small>మార్చు</small>

తెలుగు విక్షనరీ లో అనేక పదములు ఉన్నవి. అవి కొన్ని నిఘంటువులలోని పదాలు అయితే కొన్ని ఉచ్ఛారణ దోషాలతో కూడిన సగటు తెలుగు వాడు పలికే పదాలు. తెలుగు భాషాభిమానులమైన మనం చేర్చిన పదములో ఏవైనా దోషాలు ఉంటే వాటిని సరిచేయవచ్చా? కొన్ని పదములు నిఘంటువులో వెదికినా దొరకవు అటువంటి పదాలను ఆలాగే ఉంచితే తెలియనివారు అవే అసలు పదాలు అనుకొనే ప్రమాదం లేదంటారా? ఉదాహరణకు "ప్రధానం", "ప్రదానం" "చత్రము" , "ఛత్రము" , మొదలైనవి. అవి ఒక ఒత్తు తేడాలో అర్థం మారిపోయిన పదాలు కొన్ని అర్థం లేని పదాలు మనం ఎటువంటి పదాలను విక్షనరీ లో చేర్చాలి? జన సామాన్యంలో కొందరు ఉచ్చరించలేని పదాలను కూడా మనం చేర్చాలా? నేను "చత్రము" చర్చాపేజీలో ఆ పదం నిఘంటువులో లేదని తెలియజేశాను. అటువంటి పదం తొలగించనవసరం లేదా? విక్షనరీ ని అభివృద్ధి చేయు నిమిత్తం మా వంటి వారికి సరైన మార్గనిర్దేశం చేయగలరు. ఒక పదం తప్పు అని తెలిసినా చర్చించిన తర్వాత నిర్వాహకులు సరిచేయవచ్చు కదా. చతుర్భుజి అనే పదానికి ఉన్న చిత్రం గూర్చి తెలియ జేశాను. పటం లో కొన్ని తప్పులు ఉన్నప్పుడు సభ్యుల అభిప్రాయాలను గౌరవించవలసిన అవసరం లేదంటారా!-- కె.వెంకటరమణ చర్చ 09:32, 9 ఏప్రిల్ 2013 (UTC)Reply

పదాలలో దోషాలు ఉన్నాయని అనుకున్నరంటే నిస్సంశయంగా మీరు మార్చ వచ్చు. వికీపీడియా మూల సిద్ధాంతం అదే కదా ! ఛత్రం సరిఅయినది కనుక దారి మార్పు చేయవచ్చు. నిఘంటువులో లేని పదాలైనా ఒకప్పుడు వాడుకలో ఉన్న పదాలను విక్షనరీలో చేర్చ వచ్చు. అలాగే ఒక వస్తువును ఒక్కో ప్రదేశంలో ఒక్కోలా ఉచ్చరిస్తాము. మాండలికాలు అంటే అవే కనుక వాటిని నానార్ధాల విభాగంలో చేర్చవచ్చు. అలాగే మాండలికాలన్నింటికి ప్రత్యేక పేజీలు సృష్టించ వచ్చు. విక్షనరీ ముఖ్య ఉద్ధేశ్యాలలో ఒకటి. రమణ గారూ మీరు ఎప్పుడు కోరినా నాకు తెలిసినంతలో సందేహాలు సంతోషంగా నివృత్తి చేస్తాను. --T.sujatha 16:08, 14 ఏప్రిల్ 2013 (UTC)

స్వాగతం <small>మార్చు</small>

సుజాత గారు,

స్వాగతం మూస చేర్చుటకై మీర్చిన సలహకు ధన్యవాదం.పాలగిరి (చర్చ) 01:47, 27 ఏప్రిల్ 2013 (UTC)Reply

అధికారి హోదా <small>మార్చు</small>

ఒక్క వికీపీడియాలో నిర్వాహకత్వమే నిర్వహించలేకపోతున్నాను. నేను విక్షనరీలో, వికీసోర్స్ తదితర ప్రాజెక్టులలోనూ కేవలం వాటిలో ఎవరో ఒకరు మనవాళ్ళు నిర్వాహకులు ఉండాలనే ఉద్దేశంతోనే నిర్వహాకత్వం తీసుకున్నాను. ఇంతమంది పనిచేస్తున్న విక్షనరీలో పనిచేస్తున్న వాళ్లే అధికారిగా ఉంటే బాగుంటుంది. ఏం జరుగుతుందో కూడా సరిగా తెలియని నాలాంటి వాళ్లు అధికారిగా ఉండి పెద్ద లాభం లేదు. అవును రాజశేఖర్ గారు విక్షనరీలో నిర్వాహకులు/అధికారులు అయినా బాగుంటుంది. ఒకసారి ప్రాజెక్టులో ఒక అధికారి ఉంటే, ఆ అధికారి ఎంతమందైనా అధికారులను నిర్వాహకులను చేయవచ్చు. మొదట మీరు అధికారి అవుతారో, రాజశేఖర్ గారు అవుతారో మీలో మీరు తేల్చుకోండి. --వైజాసత్య (చర్చ) 03:58, 29 ఏప్రిల్ 2013 (UTC)Reply

విన్నపం <small>మార్చు</small>

సుజాత మేడం గారికి ఒక విన్నపం.

వ్యుత్పత్తి..... అయోమయ స్థితి 6 వ్యుత్పత్తి..... సందేహము [మార్చు]

ఆర్యా..... పైకనబరచిన విషమమై ఒక వాడుకరి వ్రాస్తూ వ్యుత్పత్తి అనగా పుట్టుక/మూలమని కనుక ఆయాపదాల వ్యుత్పత్తులకు సదరు పదము తత్సమమా/ సంస్కృతమా, దేశ్యమా/ మొదగలు నవి వ్రాయాలని భావించి అలావ్రాస్తున్నాని అన్నారు. ఈ విషయంలో కొందరు వ్యుత్పత్తి ఆయా పదాల అర్థవివరణ వ్రాస్తున్నారని కూడ అన్నారు. ఈ అయోమన స్థితిని పోగొట్టడానికి ఏది సరైన పద్దతో తెలుపమని కోరియున్నారు. ఇది చాల సమంజసమైన సందేహమే. తప్పక తీర్చుకోవలసినదే.

 
true extract of SSC telugu text book


వ్యుత్పత్తి.. పరిశీలన. తెలుగు పాఠ్యపుస్తకములో ఇక.... నేను పదాలకు వ్యుత్పత్తులను ఈ క్రింది విధంగా వ్రాయుచున్నాను: (పదము) శ్వేతాద్రి = తెల్లని పర్వతము (వ్యుత్పత్తి) .. హిమాలయ పర్వతము (అర్థ వివరణ) (పదము) వృక్షచరము = చెట్లలో సంచరించునది (వ్యుత్పత్తి)..... కోతి, (అర్థవివరణ) (పదము) శ్వేతధాతువు = తెల్లని ఖనిసము (వ్యుత్పత్తి) ..... సున్నపురాయి (అర్థవివరణ) పైవిధంగా నేను వ్రాయడానికి ఆదారము: కొన్ని పదాలనిచ్చి వాటికి వ్యుత్పత్తి చెప్పమని కొందరు విద్యార్తులకు, తెలుగు పండితులను కూడ అడగడం జరిగింది. వారందరు పైన నేను వ్రాసిన విదంగానే సెలవిచ్చారు. ఏఒక్కరు కూడ మూలమైన సంస్కృతమా/దేశ్యమా... .... అలాంటివి వ్రాయమని చెప్పలేదు. వారు చెప్పిన మాటలు ప్రమాణముకాదని భావించి, పదవతరగతి తెలుగు పాఠ్యపుస్తకాన్ని తీసుకొని పరిశీలించాను. ఆ పుస్తకంలో తామసి. అనే 8 వ పాఠంలో (పుట.... 50) చివర అభ్యాస వేధికలో ఇతర భాషా సంబందమైన విషయాలతో బాటు వ్యుత్పత్తి కి సంబందించిన వివరాలు కూడ వున్నాయి. వాటిని యదాతదంగా ఇక్కడ పొండు పరుస్తున్నాను.

vi(a). ఈ క్రింది మాటల వ్యుత్పత్తిని పరిశీలించండి
3.ధరణి...... విశ్వాన్ని ధరిస్తుంది గాబట్టి ఇది ధరణి (భూమి) ;4.తామసి..... అమితమైన తమస్సు కలిగినది కాబట్టి తామసి (కారుచీకట్లు కలిగిన రాత్రి) ;5.సౌథము...... సుధ అంటే... సున్నం. సున్నం కలిగినది కాబట్టి సౌధం. (భవనము)

పైన కనబరచిన వాటిలో దేనిలోనైన మూలపదాలైన సంస్కృతము అనీ గానీ.. లేదా మరేదైనా వ్రాయబడలేదు. కనుక అర్థ వివరణ లాంటిదే వ్రాయాలని భావించి అలా వ్రాశాను. వ్యుత్పత్తులు అన్ని పదాలకు వుండవు. కానీ మూల పదాలుగా వ్రాయాలంటే ప్రతి పదానికి ఒక మూలపదముంటుంది. ఇది పెద్ద విభాగమే. కనుక తొందరగా అయోమయ నివృత్తి చేసుకుంటే మంచిది. ఒక్క మనవి: విక్షనరీ ప్రతి తల పుటలోను భాషాభాగము, ఆర్థ వివరణ, మొదలగు వాటితో బాటు చివరగా మూలాలు/ వనరులు అని కూడ వున్నది. అక్కడ ఎవ్వరూ ఏమీ వ్రాయడంలేదు. అక్కడ ఏమి వ్రాయాలి అనే సందేహాన్నికూడ నివృత్తి చేసుకుంటే మంచిదేమో....? ఈ విషమై నాదొక చిన్న సూచన:... విక్షనరీ తరుపున పైన కనబరచిన రెండు సందేహాలతో బాటు మరేదైన అనుమానాలుంటే లిఖిత పూర్వకంగా తెలుగు విశ్వవిద్యాలయానికి తెలియజేసి వారి అమూల్యమైన సలహాలు పొందగలిగితే ..... అంతకన్నా ప్రామాణికత ఏముంటుంది?

వాడుకరి భాస్కరనాయుడు. ఎల్లంకి (చర్చ) 13:46, 17 మే 2013 (UTC)Reply

భాస్కరనాయుడుగారూ ! మీ వివరణ బాగుంది. మీరు చెప్పినట్లు ఏదైనా విశ్వవిద్యాలయాలకు గాని తెలుగు పండితులను గాని అడిగి తెలుసుకుని దానిని ప్రామాణికంగా తీసుకుంటే బాగుంటుంది. మీకు వీలైతే ఆ విధమైన కృషిచేయండి. తరువత వాటిని మార్గదర్శకాలలో చేర్చవచ్చు. ఇప్పటి వరకూ ఉన్న మార్గదర్శకాలు విక్షనరీ ప్రారంభించిన సామయంలో సభ్యులు ఒకరికి ఒకరు చర్చించుకున్నవి. ఆ చర్చలన్నీ సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తూ విక్షనరీని అభివృద్ధి చేసిన రోజులవి. మనం ఇప్పుడు నూతన చర్చల ద్వారా మార్గదర్శకాలను అభివృద్ధిచేసి వాటిని అనుసరిస్తూ విక్షనరీలో పని చేయవచ్చు.

  • మూలాలు విభాగంలో పదము యొక్క మూలాలు గురించి వ్రాయవచ్చు. ఉదాహరణగా :- ఉర్లగడ్డ అంటే తమిళ పదము అని తెసుకోవచ్చు. ఎలా అంటే తమిళంలో ఉరుళై అంటే దొర్లుట అని అర్ధం. గుండ్రని ఆకారంలో ఉండి దొర్లేగడ్డ కనుక దీనిని ఉర్లగడ్డ అంటారు. కనుక దీనిని మూలాలులో తమిళ మూలం అని వ్రాయవచ్చు. అలాగే ఇతర భాషాపదాలు కూడా.
  • వనరులు విభాగంలో వేమనశతకం, అన్నమయ్య కీర్తనలు వంటి ప్రత్యేక పుస్తకాలు కావ్యాలు వంటి వాటి నుండి సేకరించిన పదాలను ఆ విభాగంలో వ్రాయవచ్చు. అవి కాక మనం మనదైనందిన జీవితంలో ఉపయోగించే పదాలైతే ఈ రెండు విభాగాలను వదిలి ఏయవచ్చు. ప్రస్థుత వార్తా పత్రికలలో వస్తున్న సరికొత్త పదాలకు కూడా పేజీలు తయారు చేసే సమయంలో ఆయా పత్రికల పేర్లు వ్రాయవచ్చు. ఇలా తెలుగు సాహిత్యం నుండి ఎక్కడైనా పదసేకరణ చేయవచ్చు. పల్లే సీమలలో వాడే పదాలు, వ్యవసాయం, వడ్రంగం వంటి అన్ని వృత్తులవారికి వారికే స్వంతమైన పదాలు ఉంటాయి. అలాంటి పదాలకు పేజీలు తయారు చేయవచ్చు. వాడుకలో ఉన్న తెలుగుపదాలను చేర్చడమే విక్షనరీ ప్రధాన లక్ష్యం.
  • అంతే కాదు విక్షనరీలో ఏ విభాగమైనా తెలియకుంటే వదిలి వేయవచ్చు. తెలిసిన విషయాలు వ్రాస్తే చాలన్నది వికీపీడియా లాగే విక్షనరీకి వర్తిస్తుంది.
  • అలాగే సభ్యులు కావాలంటే వారు అనుకున్న విధంగా మూసను తయారు చేసుకుని కూడా పదములను చేర్చవచ్చు. పదాలను వ్రాయడానికి ఇప్పటికే అనేక మూసలు ఉన్నాయి. ఈ విషయంలో సభ్యులకు నిర్భందం ఏమీ లేదు. --T.sujatha (చర్చ) 17:04, 17 మే 2013 (UTC)Reply

IIW- Integration of Indian Wiktionaries <small>మార్చు</small>

Hope you well. please furnish your view in విక్షనరీ:రచ్చబండ#IIW-_Integration_of_Indian_Wiktionaries --Info-farmer (చర్చ) 16:44, 9 మార్చి 2015 (UTC)Reply

Your administrator status on te.wiktionary <small>మార్చు</small>

Hello. A policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc.) was adopted by community consensus in 2013. According to this policy, the stewards are reviewing activity on wikis with no inactivity policy.

You meet the inactivity criteria (no edits and no log actions for 2 years) on the wiki listed above. Since that wiki does not have its own rights review process, the global one applies.

If you want to keep your rights, you should inform the community of the wiki about the fact that the stewards have sent you this information about your inactivity. If the community has a discussion about it and then wants you to keep your rights, please contact the stewards at m:Stewards' noticeboard, and link to the discussion of the local community, where they express their wish to continue to maintain the rights.

If you wish to resign your rights, you can reply here or request removal of your rights on Meta.

If there is no response at all after approximately one month, stewards will proceed to remove your administrator and/or bureaucrat rights. In ambiguous cases, stewards will evaluate the responses and will refer a decision back to the local community for their comment and review. If you have any questions, please contact the stewards. Rschen7754 06:52, 21 జూలై 2016 (UTC)Reply