బ్రౌన్ పదకోశంసవరించు

బ్రౌన్ పదకోశాన్ని తెలుగు వీక్షనరీలోకి ఎక్కించటానికి ఒక బాటు ప్రోగ్రామును తయారుచేసాను. అయితే విక్షనరీలో ఆ బాటును నడపటానికి నా బాటుకు బాటుహోదా తీసుకోవాలి. అందుకోసం ఇక్కడ మీ అంగీకారం తెలుపగలరు. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 18:11, 11 జూలై 2007 (UTC)

బాటు చేస్తున్నా మార్పులపై అభిప్రాయంసవరించు

మీరు ఇప్పటికే బాటు చేస్తున్న మార్పుల చూసి ఉంటారు. ఈ మార్పులపై మీకేమయినా సందేహాలు, లేదా సలహాలు ఉంటే నాకు తెలుపగలరు. బాటును ప్రస్తుతం పరీక్షించటం కోసం చాలా మెళ్ళిగా నడుపుతున్నాను. ఈ రోజు బాటుని నడిపిన తరువాత చేసిన దిద్దుబాట్లుపై ఎవరికీ అభ్యంతరాలు లేకపోతే గనక మిగతా 31000 పదాలకు ఈ విధంగానే పేజీలు సృష్టింపబడతాయి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 10:14, 13 జూలై 2007 (UTC)

వీక్షనరీ పదాలుసవరించు

  1. వీక్షనరీలో మనం అన్ని భాషల పదాలకు తెలుగులో అర్ధాలు వివరించాలి. మీరు ఆంగ్ల వీక్షనరీని గానీ, ఫ్రెంచి వీక్షనరీని గానీ అమ్మ అనే పేజీని చేస్తే అర్ధమవుతుంది. అంటే ఆంగ్ల వికీలో అమ్మ అనే పదాన్ని ఆంగ్లంలో వివరిస్తారు, ఫ్రెంచి వికీలో అదే పదానికి అర్ధం ఫ్రెంచి భాషలో వివరిస్తారు. కాబట్టి ఆంగ్ల పదాలు మాత్రమే కాదు, భవిష్యత్తులో వందల భాషల పదాలు తెలుగు వికీపీడియాలోకి చెరవచ్చు :). మరిన్ని వివరాలకు వీక్షనరీలో ఉన్న నా సభ్యపేజీని చూడండి. కాకపోతే ఇక్కడ నేను బాటుతో చేయించవలసిన పని ఇంకోటి ఉంది. ఈ పదాలన్నిటినీ ఆంగ్లపదాలు అనే వర్గంలోకి చేర్చటం.
  2. పదప్రయోగాలను బులెట్లతో వేరు చేయడం అనే ఆలోచన బాగుంది. అలా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ డిక్షనరీలో పదప్రయోగాలను ఎలా వేరు చేస్తున్నారు అనే దానిని పరిశీలించటమే అన్నిటికన్నా పెద్ద పని నాకు. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 12:16, 13 జూలై 2007 (UTC)

అభినందనలుసవరించు

రాజశేఖర్ గారూ విక్షనరీలో మీకృషి అభినందనీయం.విక్షనరీ అభివృద్దికి మీ కృషి చాలా తోడ్పడుతుందని నా అభిప్రాయము.ఏదైనా సహాయము కావాలంటే తప్పకుండా అడగండి.విక్షనరీ అభివృద్దికి మీ సహాయసహకారాలను కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. T.sujatha 09:26, 18 జూలై 2007 (UTC)

విక్షనరీలో మీరు చేస్తున్న కృషి చాలా బాగుంది. --వైఙాసత్య 06:26, 19 జూలై 2007 (UTC)

తెలుగు వికి లింకు ఏర్పాటు చెయ్యంది వీల్లూన చోట్{{తెవికి}} అని ఉపయౌగిం़~़़़మాటలబాబు़

కొత్త పదాల చట్రంసవరించు

రాజశేఖర్ గారు, మీరు కొత్త పదాలు చేరుస్తున్నారు. అయితే వున్న చట్రంలో ఏ ఒకటో రెండో చోట్ల మాత్రమే పదానికి సంబంధించిన వివరం వుంటున్నది. మీరు చేర్చినప్పుడు వివరాలు లేని శీర్షికలను తొలగించటంకాని, నిష్ఫలితం చేయటం (కామెంట్ మధ్యలో చేర్చటం గాని చేయటం బాగుంటుంది. --అర్జున (చర్చ) 12:23, 7 మే 2012 (UTC)

తెలుగు పదాలుసవరించు

రాజశేఖర్ గారు, మీతోపాటుగా, అర్జున, భాస్కరుడు, సుజాత గార్లు ఇంకా మరికొంత మంది మాత్రమే విక్షనరీకి వస్తున్నారు. మనము కొన్ని సలహాలు, సూచనలు ఒకరికొకరము పంచుకొని ముందుకు వెడదాము. అందరము ఇక్కడ ఒకటే. ఈ కాస్తమంది కూడా రాకపోతే తెలుగు విక్షనరీ మాత్రము ముందుకు వెళ్ళేందుకు కష్టమవుతుంది. కొంతమంది ఎక్కువ పుటలు చేయాలి అంటారు. మరికొంత మంది విషయము సంపూర్ణముగా ఉండాలంటారు. ఎవరు ఎంత చేయగలమో అంతే చేస్తాము. విక్షనరీ పద్దతులు కొన్ని ఉన్నాయి, అవి మనము ఎలాగూ చెడగొట్టము. ఇప్పుడు ముఖ్యముగా ఏమిటంటే, (1) అన్ని పుటలు తెలుగు పదాలు' వర్గం లోనివి కాబట్టి, ముందు [[::వర్గం:తెలుగు పదాలు]] అనే వర్గం అలాగే ఉంచుదాము. తదుపరి వివిధ వర్గీకరణలు ఇద్దాము. (2) ఇంగ్లీషు పదము చేర్చేటప్పుడు :en:word|word అని, పదానికి రెండు వైపులా ఈ బ్రాకెట్లు [[]] ఉంటే, అంటే : తరువాత బ్రాకెట్ మొదలు తదుపరి wordలో d తరువాత బ్రాకెట్ మూసి ఉండాలి. అది ఇంగ్లీషు విక్షనరీకి లింకు అవుతుంది. (3) బయటి లింకులు అనే వాటికి మాత్రము కాస్త వికీ లింకులు దొరుకుతేనే ఉంచుదాము. (4) ఒక పుటకు అనేక వర్గాలు ఉంటాయి, వస్తాయి కనుక ఎన్ని వర్గాలు పుటలో ఉన్న ఇబ్బంది మనకు లేదు. (5) బుల్లెట్లు (*) నేనే వాడటము మొదలు పెట్టాను, కాస్త అందంగా విషయము ఉంటుందని మాత్రము. చర్చలు చేయండి తప్పకుండా. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 05:35, 9 మే 2012 (UTC) (6) బహువచనములు: మనము వర్గాలలోని జాబితా మరియు వర్గములను బహువచనము లోనే చేస్తాము. ఉదా: పుష్పాలు‎. ఈ పుష్పాలు‎ జాబితాను ఒకసారి చూడండి. అలాగే వర్గం:పుష్పాలు‎ అంతే. వర్గం:జాబితాలు.అనే వర్గంలో అన్ని వర్గాలకు సంబందించిన జాబితాలు ఉంటాయి. అందుకనే మనవాళ్ళు బహువచనములు అనే పుటలు వద్దని, అని ఉంటారు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:14, 9 మే 2012 (UTC)

పదాలన్నీ ఒక ప్రధాన వర్గములోనికి తీసుకుని, అనగా :వర్గం:తెలుగు పదాలు అనే వర్గము లోనికి చేర్చి, తదుపరి ప్రతి ఒక పదము ఎన్ని వర్గాలులో వస్తుంది అని అనుకుంటే అన్ని వర్గాలుగా చేర్చితే సరిపోతుంది. మీరు తెలుగు పదాలు అనే వర్గము ఉంచండి. తదుపరి మరో వర్గం కూడా చేర్చండి. ఉదా: కీచకుడు అనే పదము, వర్గం:తెలుగు పదాలు, వర్గం:మహాభారతము.లోనికి చేరుతుంది. దానితో అన్ని పదాలు చివరికి ప్రధాన వర్గము అయిన :వర్గం:తెలుగు పదాలు లోనికి చేరతాలు. ఈ విధానము కాస్త ఆలోచించి చూడండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:29, 3 జూలై 2012 (UTC)

పతకాలుసవరించు

 
విక్షనరీలో మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం సమర్పిస్తున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్

రాజశేఖర్ గారు, మీకు అభినందనలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:01, 1 జూన్ 2012 (UTC)

నేటిపదంసవరించు

రాజశేఖర్ గారూ ! నేటి పదం నిర్వహిస్తున్నదుకు ధన్యవాదాలు. అర్జునగారు నన్ను నిర్వహించమని అడిగారు. కానీ నేను సరిగా చేయలేక పోతున్నాను. మీరు బాధ్యత వహించినందుకు ఆనందంగా ఉంది.--T.sujatha 15:41, 2 సెప్టెంబరు 2012 (UTC)

నేటి పదం నిర్వహణకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 05:19, 17 నవంబరు 2012 (UTC)

పాలగిరిసవరించు

రాజశేఖరుగారు, మీ స్పందనకు,సలహాకు ధన్యవాదాలు.ఒక సందేహము.నానార్థం:పదం యొక్క మొదటి భావానికి భిన్నమైన అర్థము.సమానార్థకం: పదం మొదటి అర్థంతో సమానమైన భావమునది. కొన్ని పదాల కూర్పులో,నానార్ధల వద్ద సమానార్ధకలున్నాయి.ఉదా:గాలి పదంకు నానార్థలుగా మారుతం,పవనం వ్రాసారు.అవి సమానార్థకాలు.అట్టివాటిని మార్చవచ్చునా?.తెలుపగలరు.పాలగిరి (చర్చ) 12:54, 13 సెప్టెంబరు 2012 (UTC)

తేడా నాకు కూడా అంత స్పష్టంగా తెలియదు. తెలుసుకొని చెబుతాను. వీలయినంత వరకు ఉన్న సమాచారాన్ని మార్చవద్దు. లేని సమాచారాన్ని చేర్చండి. విక్షనరీలో శాస్త్రీయ పదాల కొరత ఉన్నది. వాటి మీద దృష్టిపెట్టండి.Rajasekhar1961 (చర్చ) 13:51, 13 సెప్టెంబరు 2012 (UTC)

నేటి పదముసవరించు

రాజశేఖర్ గారూ ! ఇది సాంకేతికం కనుక అర్జున రావుగారితో సంప్రదించండి. ఆయన దీనిని సరి చేసే మార్గం చెప్పగలరు.--T.sujatha 09:03, 8 అక్టోబరు 2012 (UTC)

కొత్త చింత పదముసవరించు

రాజశేఖర్ గారూ ! మనము అనుకున్నట్లుగా, చింత పదము పుటను మొత్తము మార్చాను, ఒకసారి చూడగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 18:37, 4 నవంబరు 2012 (UTC)

మూసలుసవరించు

రాజశేఖరుగార్కి,అవునండి కొన్నిమూసల తొలగింపు తప్పుగా జరిగింది.సారీ.పాలగిరి (చర్చ) 11:15, 29 జనవరి 2013 (UTC)

స్వాగతంసవరించు

విజాసత్యగారు, మీరు విక్షనరీలో తిరిగి ప్రవేశించడం మా భాగ్యం. ఇందులో ప్రస్తుతం సుమారు 70,000 పైగా వ్యాసాలు చేరాయి. వర్గీకరణ ఒక పెద్ద సమస్యగా కనిపిస్తుంది. దీనికోసం హాట్ కాట్ ను ఇక్కడ స్థాపించాల్సిన అవసరం కనిపిస్తుంది. దీనిని నిర్వాహకులు మాత్రమే చేయగలరని అర్జునరావు గారు చెప్పారు. మీరు నాకీ సహాయం చేసి; దాన్ని ఇక్కడ స్థాపించగలరా.Rajasekhar1961 (చర్చ) 04:30, 10 మార్చి 2013 (UTC)

హాట్‌కేట్ స్థాపించాను. మీ అభిరుచుల్లోకెళ్లి ఉపకరణాలు టాబ్లో హాట్‌కేట్‌ను సచేతనం చేసుకొని వాడండి --వైఙాసత్య (చర్చ) 04:33, 10 మార్చి 2013 (UTC)

విన్నపముసవరించు

రాజశేఖర్ గారూ! నమస్కారం! నేను విక్షనరీనందు మాజీ నిర్వాహకునిగా ఉన్నాను. కానీ ఇంకనూ నిర్వాహకునిగా పని చేయాలను కుంటున్నాను. ఈ సందర్భములో దానికి సంబంధించిన విధి విధానముల "పని" అయ్యేందుకు కావలసిన మీ సహయ సహకారముల కోసము విన్నవించు కుంటున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:44, 5 ఏప్రిల్ 2013 (UTC)

నిర్వాహక హోదాసవరించు

రాజశేఖర్ గారూ ! మీరు విక్షనరీలో నిర్వాహక హోదా తీసుకోవడం అత్యవసరం. అలాచేస్తే మీరు మరింత మెరుగైన సేవలు అందించగలరు. ప్రస్థుతం విక్షనరీలో క్రియాశీలక సభ్యుల సంఖ్య అభివృద్ధి చెందారు. ఇది హర్షనీయమైన పరిణామం . అయినప్పటికీ నిర్వాహకుల కొరత అన్నది గుర్తించతగిన లోపం అది భర్తీ చేయడానికి మీ అభ్యర్ధన సహకరిస్తుంది. కనుక ఆలోచించండి.--T.sujatha (చర్చ) 05:29, 25 ఏప్రిల్ 2013 (UTC)

రాజశేఖర్ గారూ ! నిర్వాహక హోదాకు ఇక్కడ అంగీకారం తెలపండి.

విక్షనరీ:నిర్వాహక హోదా/రాజశేఖర్

నేటి పదంసవరించు

మొదటి పేజీ ఆకర్షణీయంగా ఉండుటకు కొన్ని మార్పులు చేశాను. కానీ "నేటి పదం" నిర్వహణ జరుగుటలేదు. ఏప్రిల్ 13 లో చాలా "నేటి పదం" పేజీలు తయారు చేశాను. దీని నిర్వహణ పై తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తాను. విక్షనరీ లో ఎటువంటి సహాయం అవసరమో తెలియజేస్తె ఆ పని చేయటానికి ప్రయత్నిస్తాను.-- కె.వెంకటరమణ చర్చ 06:30, 28 ఏప్రిల్ 2013 (UTC)

సుజాతగారు విక్షనరీలోని ఏకైక నిర్వాకులిగా నేటి పదం బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. తెవికీ మహోత్సవంలో పని ఒత్తిడి కారణంగా అది కుంటుపడింది. కానీ ఎవరైనా దీనిని కొనసాగించవచ్చును. మీరు విక్షనరీలో భౌతికశాస్త్ర పదాల్ని కూడా చేర్చవచ్చును. సుమారు 80,000 పదాలున్న విక్షనరీలో చేయాల్సింది చాలా ఉన్నది. పాలగిరి గారు బహుజనపల్లి వారి నిఘంటువు నుండి చాలా పదాల్ని విస్తరిస్తున్నారు. వ్యాసాలలో పద ప్రయోగాల్ని చేర్చే బాధ్యతను మీరు తీసుకొనవచ్చును. ఉదా: వేమన పద్యాలు, తెలుసు సినిమా పాటలు, గేయాలను తీసుకొని వాటికి సంబంధించిన పదాలలో మొత్తం పాటంతా కాకుండా ఆ పదాన్ని ప్రయోగించిన పల్లవి లేదా చరణాన్ని చేర్చవచ్చును.Rajasekhar1961 (చర్చ) 06:36, 28 ఏప్రిల్ 2013 (UTC)

గర్జించుసవరించు

రాజశేఖరుగారు,

సాధారణంగా గర్జించు అనేక్రియా పదం జంతువుల అరుపుకు సంబంధించినది.కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే (అత్యంత అరుదుగా)మనుష్యులకు అన్వయిస్తారు.పాలగిరి (చర్చ) 14:46, 1 మే 2013 (UTC)

నేను భాషాపరంగా మాత్రమే క్రియా ప్రత్యయాలను చేర్చాను. జంతువులకు సంబంధించింది గనకనే సింహం బొమ్మను కూడా చేర్చాను. మనుష్యులకు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో వాడతారు.Rajasekhar1961 (చర్చ) 14:50, 1 మే 2013 (UT

14/5/2013 న లాగిన్ కాకుండ నేను విక్షనరీలొ సుమారు ఇరవై పదాలు వ్రాశను పొరబాటున. వాటిని నాపేరున క్రమభద్దీకరించ గలరేమో చూడండి. దానివలన ఏదైన సమస్య వుండవచ్చుననే న సందేహం. వాటిని పూర్తిగా తొలగించినా పర్వాలేదు. తిరిగి వ్రాస్తాను. వాడుకరి: భాస్కరనాయుడు. ఎల్లంకి (చర్చ) 15:45, 16 మే 2013 (UTC)

నాకు తెలిసినంతవరకు అలాంటి వాటిని మీ జాబితాలోకి చేర్చడం వీలుకాదు. క్షమించండి.Rajasekhar1961 (చర్చ) 16:44, 16 మే 2013 (UTC)

==6 వ్యుత్పత్తి..... సందేహము== [మార్చు]

ఆర్యా.... రాజశేఖర్ గారూ............ వ్యుత్పత్తి... అయోమయ స్థితి పైకనబరచిన విషమమై ఒక వాడుకరి వ్రాస్తూ వ్యుత్పత్తి అనగా పుట్టుక/మూలమని కనుక ఆయాపదాల వ్యుత్పత్తులకు సదరు పదము తత్సమమా/ సంస్కృతమా, దేశ్యమా/ మొదగలు నవి వ్రాయాలని భావించి అలావ్రాస్తున్నాని అన్నారు. ఈ విషయంలో కొందరు వ్యుత్పత్తి ఆయా పదాల అర్థవివరణ వ్రాస్తున్నారని కూడ అన్నారు. ఈ అయోమయ పరిస్థితిని పోగొట్టడానికి.......... ఏది సరైన పద్దతో తెలుపమని కూడా కోరియున్నారు. ఇది చాల సమంజసమైన సందేహమే. తప్పక తీర్చుకోవలసినదే. [[దస్త్రం:vvytpati.JPG|thumb|right|true extract of SSC telugu text book]

ఇక.... నేను పదాలకు వ్యుత్పత్తులను ఈ క్రింది విధంగా వ్రాయుచున్నాను:

(పదము) శ్వేతాద్రి = తెల్లని పర్వతము (వ్యుత్పత్తి) .. హిమాలయ పర్వతము (అర్థ వివరణ)
(పదము) వృక్షచరము = చెట్లలో సంచరించునది (వ్యుత్పత్తి)..... కోతి, (అర్థవివరణ)
(పదము) శ్వేతధాతువు = తెల్లని ఖనిజము (వ్యుత్పత్తి) ..... సున్నపురాయి (అర్థవివరణ)

పైవిధంగా నేను వ్రాయడానికి ఆదారము: కొన్ని పదాలనిచ్చి వాటికి వ్యుత్పత్తి చెప్పమని కొందరు విద్యార్తులకు, తెలుగు పండితులను కూడ అడగడం జరిగింది. వారందరు పైన నేను వ్రాసిన విదంగానే సెలవిచ్చారు. ఏఒక్కరు కూడ మూలమైన సంస్కృతమా/దేశ్యమా... .... అలాంటివి వ్రాయమని చెప్పలేదు. వారు చెప్పిన మాటలు ప్రమాణముకాదని భావించి, పదవతరగతి తెలుగు పాఠ్యపుస్తకాన్ని తీసుకొని పరిశీలించాను. ఆ పుస్తకంలో తామసి. అనే 8 వ పాఠంలో (పుట.... 50) చివర అభ్యాస వేధికలో ఇతర భాషా సంబందమైన విషయాలతో బాటు వ్యుత్పత్తి కి సంబందించిన వివరాలు కూడ వున్నాయి. వాటిని యదాతదంగా ఇక్కడ పొందు పరుస్తున్నాను. గమనించండి. ప్రక్కననున్న ఫోటో కూడ చూడండి.

vi(a). ఈ క్రింది మాటల వ్యుత్పత్తిని పరిశీలించండి
3.ధరణి...... విశ్వాన్ని ధరిస్తుంది గాబట్టి ఇది ధరణి (భూమి)
4.తామసి..... అమితమైన తమస్సు కలిగినది కాబట్టి తామసి (కారుచీకట్లు కలిగిన రాత్రి)
5.సౌథము...... సుధ అంటే... సున్నం. సున్నం కలిగినది కాబట్టి సౌధం. (భవనము)

పైన కనబరచిన వాటిలో దేనిలోనైన మూలపదాలైన సంస్కృతము అనీ గానీ.. లేదా మరేదైనా వ్రాయబడలేదు. కనుక అర్థ వివరణ లాంటిదే వ్రాయాలని భావించి అలా వ్రాశాను. వ్యుత్పత్తులు అన్ని పదాలకు వుండవు. కానీ మూల పదాలుగా వ్రాయాలంటే ప్రతి పదానికి ఒక మూలపదముంటుంది. ఇది పెద్ద విభాగమే. కనుక తొందరగా అయోమయ నివృత్తి చేసుకుంటే మంచిది. ఒక్క మనవి: విక్షనరీ ప్రతి తల పుటలోను భాషాభాగము, ఆర్థ వివరణ, మొదలగు వాటితో బాటు చివరగా మూలాలు/ వనరులు అని కూడ వున్నది. అక్కడ ఎవ్వరూ ఏమీ వ్రాయడంలేదు. అక్కడ ఏమి వ్రాయాలి అనే సందేహాన్నికూడ నివృత్తి చేసుకుంటే మంచిదేమో....? ఈ విషమై నాదొక చిన్న సూచన:... విక్షనరీ తరుపున పైన కనబరచిన రెండు సందేహాలతో బాటు మరేదైన అనుమానాలుంటే లిఖిత పూర్వకంగా తెలుగు విశ్వవిద్యాలయానికి తెలియజేసి వారి అమూల్యమైన సలహాలు పొందగలిగితే ..... అంతకన్నా ప్రామాణికత ఏముంటుంది?

వాడుకరి భాస్కరనాయుడు. ఎల్లంకి (చర్చ) 13:44, 17 మే 2013 (UTC)

రాజశేఖర్ గారూ ! విక్షనరీలో నిర్వాహకులు అయ్యారని తెలుసనుకుంటాను. ఇకమీదట మీరు అనుకున్న సవరణలు మీరు స్వయంగా చేయవచ్చు. మీ నిర్వహణలో విక్షనరీ మరింత అభివృద్ధిబాటలో పయనిస్తుందని ఆశిస్తున్నాను. T.sujatha (చర్చ) 17:50, 3 జూన్ 2013 (UTC

వింత పదాలుసవరించు

కారము అనే పదమునకు అర్థము..... మిరప కాయలో వుండే రుచి. కాని ఆ పదానికి ముందు ఒక సంస్కృత ప్రత్యయం చేరితే వచ్చే పదాలు.... అనేకం: కొన్నింటిని ఈక్రింద ఇచ్చాను...... ప్రతి పదంలో ముందు ఒక పదంగాని ఒక ప్రత్యయం గాని చేరి ఒక అర్థ వంత మైన పదం వస్తుంది. అలా కలిపిన ప్రత్యయానికి విడిగా ఎలాంటి అర్థము రాదు. గమనించ గలరు. తెలుగులో అధికంగా ఉపయోగింప బడే పదం ఇదొక్కటే నని పిస్తుంది.

ఉప్పు కారము===== /ఉపకారము/ అపకారము/ వికారము/ హాహా కారము/ / అంధకారము/ ఝుంకారము/ ఘీంకారము/ పరోప కారము/ సహ కారము/ గొడ్డుకారము/ మమకారము/స్వీకారము/ గుణకారము/ అధికారము/ శ్రీకారము / ఆకారము/ అంగీకారము/ ఓం కారము/ హుంకారము/ చమత్కారము/ తుస్కారము/ చీత్కారము/ పురస్కారము/ సత్కారము/ ప్రాకారము/ పరిష్కారము/ సాక్షాత్కారము/ ఆవిష్కారము/ తిరస్కారము/ సాకారము/ దురహంకారము/ అహంకారము/ బలత్కారము/ ఉదా: చమ + కారము == చమత్కారము , ఇందులో చమ = (అర్థం)  ?, మమ+ కారము = మమకారము, మమ+  ? పైవాటిలో చాలవరకు సంస్కృత ప్రత్యయాలున్నాయి. ఎక్కువ వున్నవి. అలాంటివన్నీ హల్సందులు అనిపిస్తుంది. ఇవి గాగ తెలుగు అక్షరాలను ఇది ఫలాన అక్షరము అని చెప్పవలసి వస్తే దానికి కారము చేర్చి చెపుతుంటారు. ఉదా:.... గ్ కారము, చ కారము, మ కారము. ఇలా..... ప్రతి అక్షరానికి వుంటుంది. పొల్లు తో వున్న అక్షరాన్ని చెప్పాలంటే కారము వుండాల్కిందె.

పైన చెప్పిన పదాలలో ఆకారము అనే పదం వచ్చేసింది. గానా..... తత్సంబందిత పదాలు అనగా..... శంఖాకారము, గోళాకారము, మొదలైన పదాలను చేర్చ లేదు.

ఇన్ని పదాలు లేవు కాని ........ కొన్ని పదాలు తయారు కాగల మరో రెండు మూడు వుండ వచ్చు.....

హారము: ....... ఆహారము/ విహారము/ సంహారము/ బాగా హారము/ ప్రహారము/ ఉపహారము/ అపహారము/

మానము:....... అభిమానము/ అవమానము/ విమానము/ సన్మానము/ ద్రవ్యమానము/ అనుమానము/ సంఖ్యా మానము/ ప్రమానము/ కొలమానము/ అపమానము/ తులమానము/ గోప్యమానము/

.

ఇలాంటి వదాలు ఇంకా ఏమైనా వున్నాయా..... పరిశీలిద్దాము. వీటిని మర్చి పోతామేమోనని ఇక్కడ వ్రాసాను. వీటిని విక్షనరీ లోగాని, వికీపీడియాలో గాని ఎలా వుపయోగించ వచ్చునో ఆలోచించండి. వాడుకరి భాస్కరనాయుడు.ఎల్లంకి (చర్చ) 04:43, 3 జూలై 2013 (UTC)

మంచి సమస్య ఇచ్చారు. ఆలోచిస్తున్నాను. కొంత సమయం కావాలి.Rajasekhar1961 (చర్చ) 09:31, 3 జూలై 2013 (UTC)

సందులు గురించిసవరించు

  1. కెంజిగురు (కెంపు+చిరుగు)
  2. కెంజాయ (కెంపు+చాయ)]
  3. కెందమ్మి (కెంపు +తమ్మి)
  4. కెందొంగ (కెంపు + తొగ)
  5. క్రీగడుపు (క్రిందు + కడుపు)
  6. క్రీదొడ (క్రిందు + తొడ)
  7. సమాసమున క్రొత్త శబ్దలుప్త శేషము, ఉదా: క్రొగ్గండి... (క్రొత్త + గండి), క్రొత్త + కారు =క్రొక్కారు./ క్రొత్త + చిగురు = క్రొంజిగురు/ క్రొందావి = క్రొత్త + తావి/ క్రొంబట్టు = క్రొత్త + పట్టు/
  8. క్రొమ్ముడి = క్రొత్త + ముడి)

పై పద బంధాలకు సందులు కనుగొనగలరు.

విభిన్న అర్థాలున్న తెలుగు పదాలుసవరించు

22 విభిన్నార్థాలుగల తెలుగు పదాలు

వీటినే నానార్థాలు అని అంటారు. ఉదాహరణకు:

అంకము = ఒడి, చోటు, గుఱుతు, యుద్ధము, నాటకము లో ఒక భాగము. అంగజుడు = కొడుకు, మన్మథుడు/ అంబ = తల్లి, పార్వతి/ అంబరము = ఆకాశము, వస్త్రము, వ్వసనము/ అద్రి = కొండ, చెట్టు, సూర్యుదు/ అలరు = సంతోచించు, వికసించు/ ఇనుడు = సూర్యుడు, రాజు, మగడు/ ఈశ్వరుడు = శివుడు, రాజు, భర్త/ ఉద్వోగము = పని, ప్రయత్నము/ ఓజస్సు = తేజము, బలము, ఉత్సాహము/ కంజము = తామర, అమృతము, వెంట్రుక/ కరము = చేయి, కిరణము, తొండము/ కాండము = బాణము, జలము, కాడ, ఈనె/ కాయము = శరీరము, సమూహము, స్వభావము/ కుంజము = ఏనుగు , పొదరిల్లు/ కుక్కుటము = కోడి, కుక్క, ముణుగురు, కపటము/ కృష్ణ = నలుపు, ద్రౌపది, కాకి, కోకిల, ఒక నది (కృష్ణా నది) కోశము = కత్తిఒఱ, గ్రుడ్డు, పుస్తకము, బొక్కసము, మొగ్గ/ క్షేత్రము = పక్షి, బాణము, గ్రహము/ చంచల = మెఱపు, లక్ష్మి, గాలి/ చాయ = నీడ, కాంతి, పోలిక, సూర్యుని భార్య/ చదనము = ఆకు, ఈక, ఱెక్క, కప్ప/ చరణము = తినుట, తిరుగుట, పాదము, పాటలోని ఒక పాదము,/ చికురము, వెంట్రుక, కొండ/ జన్యువు = జంతువు, అగ్రి, బ్రహ్మ/ జయంతుడు = ఇంద్రుని కొడుకు, భీముడు, శివుడు/ జిష్టువు = ఇంద్రుడు, అర్జునుడు, జయించు కోరిక గలవాడు/

ఈ విధంగా అనేక పదాలను వ్రాయవచ్చు. వీటిని ఒక వ్వాసముగా వ్రాయ వచ్చునా లేదా..... ఏ పదానికి ఆ పదాని విక్షనరీలోని పుటలలో వ్రాయవచ్చునా? .... తెలుపగలరు. అలా విక్షనరీలో వ్రాయాలంటే..... ఇప్పటికే ఇలాంటి పదాలు అందులో వున్నాయి.... కాకపోతే నానార్థాలు అనే విభాగములో మిగిలిన పదాలను వ్రాయ వచ్చు.

విక్షనరీలో అంతర్లింకులుసవరించు

రాజశేఖర్ గారూ.......

ఈరోజు విక్షనరీ లో చేర్చిన మార్పులు చేపులు గమనించండి. రచ్చ బండలో అర్జున రావు గారు చెప్పినట్లు చేశాను. దానివల్ల గణాంకాలు బాగానే పెరిగాయి. ఇది సక్రమమేనా ఒక సారి గమనించి చెప్పండి. ఎల్లంకి (చర్చ) 14:52, 3 నవంబరు 2013 (UTC)

నేను గమనిస్తున్నాను. చాలా వరకు బ్రౌన్ నిఘంటువు లోని పదాలకు తెలుగు పదాల అంతర్వికీ లింకులు లేవు. అందువల్లనేమో అవి వ్యాసాల సంఖ్య లెక్కలోని తీసుకోవడం లేదు. మీరీపనిని పూర్తిచేయండి. మనం లక్ష వ్యాసాలకు చేరుతాము. లోపాన్ని గుర్తించిన అర్జునగారికి ధన్యవాదాలు. భాస్కరనాయుడు గారు ఈ అంతర్వికీ లింకులు అన్ని ఆంగ్ల పదాలను చూచి చేర్చండి. మీపని అంతరాయం లేకుండా కొనసాగాలని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 15:26, 3 నవంబరు 2013 (UTC)

ఉప్పు కప్పురంబు గురించిసవరించు

అయ్యా!! Rajasekhar1961 నమస్కారము, నేను గూగుల్ లో దేనికోసమో వెదుకుతుంటే మీ వాడుకరి పేజి తారస పడినది, అందులో మీరు ఇచ్చిన ఒక ఉదాహరణ నాకు తప్పుగా తోచింది దాన్ని మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఇచ్చినది "ఉదా: ఉప్పు కప్పురంబు. దీనిలో ఉత్తర పదమైన కప్పురంబు అనే పదానికి ఎలాంటి అర్థం వుండదు... కాని ఆ రెండు పదాలు కలిస్తేనే సరైన అర్థం వస్తుంది." నా అభిప్రాయములో "కప్పురంబు" అంటే కర్పూరము (లేక హారతి కర్పూరము) అని ఆర్థము, ఈ పదముల వాడుక మనకు వేమన శతకంలో ఈ క్రింది పద్యములో కనిపిస్తుంది.

ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచులు జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ, వినుర వేమా

దీని ఆర్థం: ఉప్పు కర్పూరం చూడటానికి ఒకేలా కనిపిస్తాయి, కాని వాటి రుచులు వేరు, అలాగే మనుషులంతా ఒకే విధంగా కనిపించిన అందులో మంచి వారు వేరు.
"కొండూరు రవి భూషణ్ శర్మ (చర్చ) 19:22, 26 ఫిబ్రవరి 2017 (UTC)"
ఈ ఉదాహరణలో ఉప్పు పేజీలో దీనిని చేర్చాము. ఉప్పు అనగా లవణం కదా. దోషం ఏమిటో నాకు సరిగా బోధపడలేదు. దయచేసి మరొకసారి వివరించండి.--Rajasekhar1961 (చర్చ) 05:44, 27 ఫిబ్రవరి 2017 (UTC)

ఆధునిక వ్యవహార నిఘంటువుసవరించు

వాడుకరి:Rajasekhar1961 గారూ ప్రస్తుత కాలంలో పత్రికలలో, ఆధునిక వ్యవహారంలో వాడే పారిభాషిక పదాలన్నిటి అనువాదాల నిఘంటువును యూనీకోడ్లోకి మార్చి , వర్గీకరింపబడి ఉంది. ఇప్పుడు దానిని ఆఫ్ లైన్లో కూడా గోల్డెన్ డిక్ట్లో వాడే విధంగా మార్చి అందుబాటులో ఉంచాను. ఇది బహుశా విక్షనరీలో చేరిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటది. కనుక ఈ విషయమై సహాయపడగలరు. ఈ నిఘంటు ప్రాజెక్టు ఇక్కడ కొనసాగుతుంది.. : [1]