మాటు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణము(తడవ)
  • నామవాచకము(అతుకు)
  • క్రియ(పొంచు)/విశేష్యము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • మాట్లు.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. వేటగాడు దాగి యుండు చోటు.
  2. తెర లేదా పరదా అని కూడ అర్థమున్నది.
  3. అడ్డి/అతుకు
  4. రహస్యస్థానము
1. మరుగు.2. వేటకాని దాగుడు పల్లము.3. టంకపు పొడి.4. తడవ. .. ......తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
1. వేటలందు పులి మొదలగునవి వాడుకగా వచ్చిపోవు ప్రదేశములలో సాధారణముగా జలాశయముల దగ్గర, వేటగాడు పొంచి వేచియుండుటకు అమర్చిన మరుగు ప్రదేశము...............మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970
కుంట కన్న చిన్న జలాశయం, చెక్ డ్యాం .........తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్) 2010
నానార్థాలు
  • అర్ధము
  1. మారు
  2. విడుత
  3. సారి
  4. తూరి
  5. పర్యాయము
  6. తడవ
  • అర్ధము
  1. పొంచు
సంబంధిత పదాలు

మాటువేశాడు

పర్యాయపదాలు
అపటి, అపవారకము, అవస్తారము, కండవడము, కాండపటము, గండవడము, గడము, జవనిక,తిరస్కరణి, తెరచీర, పరదా, ప్రతిసీర, మఱుగుచీర, మాటు, యవని, యవనిక, సరాతి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. వాడు దేనికొరకో మాటు వేశాడు.
  2. రేమ కలవారు తమ దుఃఖమును ఒక్కమాటుగా వెళ్లబోసుకొను
  3. మఱుగుపఱచు. "సీ. గొనబు గెంజిగురాకులని మాటి చెల్లరే తళుకుఁ గ్రొవ్వాడి కత్తులు ఘటించి." చంద్ర.
  4. మాటుతట్టు పులి రాలేదు.
  5. బిందెకు మాటువేసినాడు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మాటు&oldid=857578" నుండి వెలికితీశారు