బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, to preserve from danger or destruction రక్షించుట,కాపాడుట, తప్పించుట.

 • the doctor lost two patients but he saved four ఆ వైద్యుడు వైద్యము చేసిన వాండ్లలో ఇద్దరు చచ్చినారు, నలుగురుబ్రతికినారు.
 • he was in great trouble but God saved him వాడు నిండాసంకటపడుతూ ఉండగా దేవుడు రక్షించినాడు.
 • he saved his character మానము దక్కించుకొన్నాడు.
 • he saveed his life but lost his estate ఆస్తి ని పోగొట్టుకొన్నాడు మెట్టు కు ప్రాణము దక్కినది.
 • he would not do it to save his life వాడు చచ్చినా చేయడు.
 • he saved their lives or he saved them alive వాండ్లను బ్రతికించినాడు.
 • the baggage was lost but the guns were saved మూట లు పోయినవిగాని పిరంగులు తప్పినవి.
 • four died and three ware saved నలుగురు చచ్చినారు, ముగ్గురు తప్పినారు.
 • he punished all the other boys but I saved my brother కడమ పిల్లకాయలందరికిన్నీ దెబ్బ లు తగిలినవి అయితే నా తమ్ముణ్ని నేను తప్పించినాను.
 • to preserve finally from eternal death కడతేర్చు ట.
 • God save the king దేవుడు రాజును చిరంజీవి చేసుగాక.
 • D+ రాజును దేవుడు రక్షించుగాక, రాజు కు శుభముశుభము.
 • they imagine that if they die here they will be saved ఇక్కడ చస్తే మోక్షమట.
 • not to spend or lose వ్రయము కాకుండా నిలుపుకొనుట, మిగిలించుకొనుట, దక్కించుకొనుట.
 • he lost much money but he saved a little వాడు పొగోట్టుకోన్నది నిండా నిలిచినది కొంచెము.
 • you ought to save time నీవు కాలమును వృధాగా పొగొట్టరాదు.
 • if I can save time I will do this to-day నాకు సావకాశము చిక్కితే ఈ వేళ చేస్తాను.
 • he saved himself by running away పారిపోయి ప్రాణము తప్పించుకున్నారు.
 • to save appearances he consented వొప్పుకొని మానము దక్కించుకొన్నాడు.
 • what is the use of asking him? you will not save yourself any trouble by asking him వాణ్ని అడగడము యేమి ప్రయోజనము, వాణ్ని అడగడమువల్ల నీకు నీవే తొందర తీసుకోక విధి లేదు.
 • this will save you the trouble ఇందువల్ల నీకు ఆ తొందర లేకపోను.
 • he got there in time to save his passage వాడ మించిపోకమునుపే సమయానికి పోయిచేరినాడు.

విభక్తి ప్రత్యయం, తప్ప, వినాయించి.

 • they study save on Sundays ఆదివారము తప్ప కడమదినములలో చదువుతారు.
 • he sold all save this ఇది తప్ప కడమ అంతా అమ్మినాడు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=save&oldid=943380" నుండి వెలికితీశారు