బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, గుండె, గుండెకాయ, గుండెలు.

  • the heart of a tree చేవ.
  • the heart of theplantain tree అరిటిబొందె.
  • in the heart of the forest నట్టడవి లో, వనమధ్యమందు.
  • this gave him heart యిందువల్ల వాడికి ధైర్యము వచ్చినది.
  • he lost all heart at seeing this దీన్ని చూడగానే వాడికి ధైర్యము తప్పినది.
  • he plucked up heart ధైర్యము తెచ్చుకొన్నాడు.
  • he took heart at this యిందుచేత వాడికి ధైర్యము వచ్చినది.
  • he has noheart for this work యీ పని యందు వాడికి యిచ్ఛలేదు.
  • I will set your heart at restనీకు నెమ్మది చేస్తాను.
  • you may set your heart at rest మనస్సు ను నెమ్మదిపరుచుకో.
  • athearing this my heart was in my mouth యిది వినగానే నా ప్రాణము తల్లడించినది.
  • Iam sick at heart of this యిది నాకు తల చీదర గా వున్నది.
  • how could you find it in your heart to do this ? దీన్ని చేయడానకు నీకు మనసు యెట్లా వచ్చినది.
  • he got his lesson by heart అది వాడికి హృద్గతముగా వచ్చును.
  • you should not take it to heart నీవు దాన్ని మనస్సులో పెట్టవద్దు, అందుకు చింత పడవద్దు.
  • he kissed her to his hearts content దాన్ని తనివిదీర ముద్దు పెట్టుకొన్నాడు.
  • he laid these words to heart యీ మాటలను మనస్సు యందు వుంచినాడు.
  • with all my heart సంతోషము గా, ఆహా సుఖము గా.
  • will you come ? yes with all my heart వస్తాను.
  • he did it with heart and soul అత్యానందము తో చేసినాడు.
  • or the seat of intelect హృదయము, మనసు, చిత్తము.
  • the core of the heart హృత్కమలము.
  • the horse is quite out of heart (Faery Queen 3.5.4.) గుర్రమునకు ధైర్యము చెడినది.
  • he showed a kind heart దయారసము ను చూపినాడు.
  • King William the fourth had an excellent heart అతను మహాదయారసము గల వాడై వుండెను, అతను దయాళువు.
  • bad heart దుర్బుద్ధి.
  • good heart సద్బుద్ధి.
  • one who has a bad heart దుర్బుద్ధి గలవాడు.
  • he who has a hard heart కఠిన హృదయుడు.
  • he lost his heart to her దాన్ని మోహించినాడు.
  • he set his heart upon this దీని యందే వాడి మనసు వుండినది.
  • she died of a broken heart అది వ్యసనముతో కుంగి చచ్చినది.
  • he is breaking his heart about the death of his son కొడుకు చచ్చిపోయిన దానితో కుంగి పోయినాడు.
  • be of good heart ధైర్యముగా వుండు, ధైర్యము విడవక.
  • he drew a sigh from the bottom of his heart ఉసూరుమని పెద్దవూపిరి విడిచినాడు.
  • slowness of heart బుద్ధి జాడ్యము, బుద్ధిమాంద్యము, జడత్వము.
  • In Rom.X.10.అంతఃకరణం A+ C+ హృదయము.H+.P+.
  • the bullock heart custard apple రామఫలము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=heart&oldid=933766" నుండి వెలికితీశారు