విక్షనరీ:పురోగతి సమీక్ష
విక్షనరీ (ఆంగ్లం: Wiktionary) [1], వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టు. ఈ పదం 'వికి' మరియు డిక్షనరి పదాలను కలుపగా ఏర్పడినది. ఇది తెలుగు పదాలకు వివిధమైన వ్యాకరణ విశేషాలతోబాటు, అర్థ వివరణ, నానార్థాలు, పద ప్రయోగము, సంబంధిత పదాలు, వ్యతిరేకార్థాలు వంటి వివరణలతో నిక్షిప్తం చేసే మాధ్యమము (నిఘంటువు). అయితే పుస్తక రూపంలో వుండే నిఘంటువులు మహా అయితే మూడు భాషలలో వుంటాయి. అవే త్రిభాషా నిఘంటువులు. కాని విక్షనరీ బహుభాషా నిఘంటువు. ప్రపంచంలోని అన్ని భాషలతో తయారవుతున్న ఒక బృహత్తర నిఘంటువు.
విక్షనరీలో ఏమున్నది
<small>మార్చు</small>తెలుగు విక్షరీలో తెలుగు-తెలుగు, ఇంగ్లీషు-తెలుగుతో పాటు ఇతర భాషా పదాలు, వాటి సమానార్థాలు వుంటాయి. ఇతర విక్షనరీలోని సమాన అర్థం గల పదాలకు లింకులుండటం వలన, మీకు ప్రపంచంలోని వికీ భాషలన్నిటిలో సమాన అర్థంగల పదాలను తెలుసుకునే వీలు కలుగు తుంది. ఇందులో పదాలకు సంబంధించిన బొమ్మలు కూడ వుండటముతో తెలుగు భాష తెలియని ఇతర భాషల వారు బొమ్మను చూచి దాన్ని గుర్తించే అవకాశము ఎక్కువ. ఉదాహరణకు [ఏనుగు] అనే పదమున్న పుటలో ఏనుగు బొమ్మ వుంటే ఆ పుటలో వున్న పదం సులభంగా ఇతర భాషల వారికి అవగాహన అవుతుంది. అంతే కాక మరొక కొత్త పద్దతికూడ అవలంబిస్తున్నారు. ఆ యా పదాలను పలికే విధానము శబ్ధ రూపంలో ఆడియో కూడ పొందు పరుస్తున్నారు. తెలుగు రాని ఇతర భాషల వారికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. దీనిపై నొక్కి ఆ తెలుగు పదాన్ని తెలుగులో ఎలా పలుకుతారో వినవచ్చు. ఈ విధంగా తయారవుతున్నది నిఘంటువు. అందువలన దీనిని బహుభాష నిఘంటువుగా పేర్కొనవచ్చు. తెలుగు విక్షనరీ లో వ్రాయు వారు ఒక పదాన్ని తీసుకొని దానికి సంబంధించిన అన్ని వివరాలు వ్రాయనవసరము లేదు. తెలిసినవి మాత్రము వ్రాసి..... మిగతావాటిని వదిలి పెట్టవచ్చు. వాటిని, తెలిసిన వారు పూర్తి చేస్తారు. ఉదాహరణకు [ప్రధమస్థానము] అనే తెలుగు పదాన్ని తీసుకుందాము. దీని భాషా భాగము (అనగా ఇది నామవాచకమా?, క్రియ...? మొదలైనవి) తెలిస్తే వ్రాయవచ్చు. అర్థ వివరణలో [మొదటి స్థానము] అని వ్రాయ వచ్చు. అలాగే మిగతా విభాలలోని వివరాలు తెలిస్తే వ్రాయవచ్చు. లేనిచో వదిలి పెడితే ఆ వివరాలు తెలిసిన వారు పూరిస్తారు. ఆ విధంగా ఈ విక్షనరీ అందరి కృషితో తయారవుతుంది. తెలుగు వికీపీడియాలో లాగా, ఇందులో కూడా ఎవరైనా తెలుగు పదాలకు పేజీలను సృష్టించవచ్చు లేక మార్పులు చేయవచ్చు. ఈదొక అందరూ పాల్గొన గలిగిన బృహత్తర కార్యక్రమము.
సంవత్సరాల వారీగా పురోగతి
<small>మార్చు</small>ఈ క్రింద విభాగంలో 2005 నుండి 2015 వరకు తెలుగు విక్షనరీలో జరిగిన అభివృద్ధి సంవత్సరాల వారీగా వివిధ వాడుకరుల కీలక భాగస్వామ్యంతో ఎలా జరిగిందో వివరించాము:
2005- 2006
<small>మార్చు</small>తెలుగు విక్షనరీ జులై 2005 లో ప్రారంభమైనది. చదువరి గారు, వైజాసత్య గారు, మాకినేని ప్రదీపు గారు విక్షనరీని ప్రారంభించి కొంత కృషి చేసారు. వారంతా విక్షనరీలో చేర్చ వలసిన పదాలకు కావలసిన మూసలను తయారు చేయడంలో ప్రయత్నాలుచేసి వారిలో వారు చర్చలు చేసి ప్రధమంగా మూసలకు ఒక రూపం తీసుకు వచ్చారు. ఆ విధంగా వీరు తెలుగు విక్షనరీ కీ గట్టి పునాదులు వేశారు.
ఆగష్టు-అక్టోబర్ 2007 మధ్యకాలంలో లో మాకినేని ప్రదీప్ కృషితో బ్రౌణ్య నిఘంటువుని (సుమారు 32,000 పదాలు) చేర్చుకొంది. ప్రస్తుతం వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గంలో 27, 581 ఆంగ్ల పదాలున్నాయి. ఆ విధంగా వీరు గట్టి పునాదులతోబాటు....
2008, 2009, 2010
<small>మార్చు</small>ఈ మూడు సంవత్సరాలలో వికీపీడియాలో వ్రాసేవారె ఎక్కువగా వుండేవారు.... విక్షరీలో తమె పేరు నామోదు చేసుకున్న వారుగాని... అందులో వ్రాసిన వారు గాని తక్కువ. (ఈ విషయం గణాంకాల చార్టు ను చూక్షి నిర్థారించ వలసి వున్నది) 2010 వ సంవత్సరం వరకు ప్రదీఫ్ .... చదువరి . ..... .... వంటి వారు నిర్మించిన బలమైన పునాదులతో తెలుగు విక్షనరీ ఇంచు మించు నిద్రావస్థలోనే వున్నది.
2010, 2011, 2012
<small>మార్చు</small>సెప్టెంబర్ 17, 2010 తేదీన విక్షనరీ 34,751 పదాల పేజీలకు విస్తరించింది. ఈ రెండు సంవత్సరాలలో ప్రధానంగా కృషి చేసిన వారు టి.సుజాత, డా. రాజశేఖర్, జె.వి.ఆర్.కె. ప్రసాద్, పాలగిరి మొదలగు వారు. వీరి కృషి ఫలితంగా విక్షరీలో గణాంకాల సంఖ్య 25,000 పైగా నామోదయింది.
మే 2012 తేదీన విక్షనరీలొని పదాలు 25,000 పైగా తగ్గినట్టుగా గణాంకాలు చూపుతున్నాయి. దీని కోసం అర్జునరావు గారు బగ్జిల్లాలో రిపోర్ట్ చేశారు. నేను వాషింగ్టన్ వికీమానియాకి వెళ్ళినప్పుడు కూడా సీనియర్ నిర్వాహకులతో చర్చించాను. కానీ ఫలితం లేదు.
అర్జునరావు గారు శ్రమించి విక్షనరీ గణాంకాలలోని భేదానికి కారణాలను కనుగొన్నారు. ఆయన చెప్పినదాని ప్రకారం " వ్యాసాలు గణాంకాలలో లెక్కకు రావాలంటే కనీసం ఒకటయిన అంతర లింకు ఇతర వ్యాస పేజీలకు కలిగి వుండాలి. (ఉదా: సరియైన అంతర్వికీ లింకు లేని పదం ) కనుక అలాలేని పదపేజీలను వీలైనంత వరకు సవరించితే పద వ్యాసాల సంఖ్య మొత్తము వ్యాసాల సంఖ్యకు చేరుకోగలదు. " మేము కూడా పరీక్షచేసి అది నిజమేనని నిర్ధారించుకున్నాము. ఈ సమస్య ఎక్కువగా బ్రౌన్ నిఘంటువు నుండి తయారుచేసిన 25,000 పైచిలుకు ఆంగ్ల పదాల వ్యాసాలలో కనిపించింది. ఆయా పేజీలన్నీ అక్షరక్రమంలో ఒక్కొక్కటి తెరచి అందులోని తెలుగు పదాలకు బ్లూ లింకులిచ్చాము. ఈ బృహత్కార్యాన్ని భాస్కరనాయుడు ఎక్కువగా నేను కొంత శ్రమించి ఒక 6 నెలల సమయంలో పూర్తిచేశాము. అప్పటికి వ్యాసాల సంఖ్య 80,000 దాటింది.
విక్షనరీలో వ్రాస్తున్న వారు తెలుగు భాషా పండితులో.... భాషా శాస్త్ర వేత్తలో కాదు. సాధారణమైన విద్యావంతులు మాత్రమే. కాని ఔత్సాహికులు. వారే ఉత్సాహంగా పలు భాషలవారు ఆంగ్ల విక్ష్నరీలో చేస్తున్న ప్రయత్నాలు పరిశీలించి, తెలుగులో ఉన్న నిఘంటువులు సంప్రదించి, మరీ అవసరమైతే తెలిసిన భాషావేత్తలతో మాట్లాడి ఇంతటి బృహత్ ప్రయత్నం స్వచ్ఛందంగా చేస్తున్నారు. దీనంతటికీ వెనుకవున్నది వారి ఉత్సాహం. ఈ గుణము చాలు వారిని ముందుకు నడిపించడానికి.
ఏప్రిల్ నెలలో 1వ తేదీన విక్షనరీ పేజీల సంఖ్య ఒక లక్ష గా నమోదు చేసుకొన్నది. ఇందులో 971 బొమ్మలు కూడా ఉన్నాయి. మొత్తం 2,916 మంది వాడుకరులు విక్షనరీలో నమోదు చేసుకోగా, ప్రస్తుతం 18 మంది మాత్రమే క్రియాశీలకంగా ఉన్నారు. విక్షనరీలో 5 గురు నిర్వాహకుల హోదాలో పనిచేస్తున్నారు. విక్షనరీ పురోగతిలో 9 బాట్లు కూడా నడుపుతున్నారు.
ఈ విషయములో తెలుగు విక్షనరీ భారత దేశ భాషలన్నిటిలో సంఖ్యా పరంగా (ఒక లక్షకు మించిన పదాలతో) నాల్గవ స్థానంలో వున్నది. ప్రపంచ భాషలన్నిటిలో 36వ స్థానంలో ఉన్నది. అదే విధంగా విక్షనరీలో వున్న పదాలకు బొమ్మలను (ఫోటోలను) చేర్చే విషయంలో...... ప్రపంచ భాషలన్నిటి కన్నా తెలుగే ప్రధమ స్థానంలో (971 బొమ్మలతో) వున్నది. ఈ విషయం మాత్రము మన తెలుగు సహ వికీపీడియనులు గర్వించ దగ్గ విషయమే. [2]
మొదటి దశ
<small>మార్చు</small>2005 నుండి 2008 వరకు తెలుగు విక్షనరీకి మొదటి దశగా భావించవచ్చు. మొదటగా విక్షనరీ 2005 లో ప్రారంబ మైంది. 2006 లో చదువరి గారు, వైజాసత్య గారు,మాకినేని ప్రదీపు గారు విక్షనరీని ప్రారంభించి కొంత కృషి చేసారు. వారంతా విక్షనరీలో చేర్చ వలసిన పదాలకు కావలసిన మూసలను తయారు చేయడంలో ప్రయత్నాలుచేసి వారిలో వారు చర్చలు చేసి ప్రధమంగా మూసకు ఒక రూపం తీసుకు వచ్చారు. ప్రతి పదానికి కావలసిన ఖాళీ పుటను సృష్టించారు. ఆ విధంగా వీరు తెలుగు విక్షనరీ కీ గట్టి పునాదులు వేశారు. ఈ పునాదులపై ఎంతటి గొప్ప భవనాన్నైనా నిర్మించ వచ్చు. ప్రస్తుతం మనము వ్రాస్తున్న తెలుగు పదాలు వీరు మొదటగా తయారుచేసి మూసలు అనే పుటలలోనే. కనుక ఈ ప్రారంబకుల పాత్ర మహత్తరమైనది.
2007 సంవత్సరం , ఆగష్టు-అక్టోబర్ మధ్యకాలంలో లో మాకినేని ప్రదీప్ కృషితో బ్రౌణ్య నిఘంటువుని (సుమారు 32,000 పదాలు) చేర్చుకొంది. ప్రస్తుతం వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గంలో 27, 581 ఆంగ్ల పదాలున్నాయి. ఆ విధంగా వీరు గట్టి పునాదులతోబాటు.... విక్షరీలోఎలా వ్రాయాలో కూడ నేర్పారు. 2008,2009, ఈ రెండు సంవత్సరాలలో వికీపీడియాలో వ్రాసేవారె ఎక్కువగా వుండేవారు.... విక్షరీలో తమె పేరు నామోదు చేసుకున్న వారుగాని... అందులో వ్రాసిన వారు గాని తక్కువ. (ఈ విషయం గణాంకాల చార్టు ను చూక్షి నిర్థారించ వలసి వున్నది) 2010 వ సంవత్సరం వరకు ప్రదీఫ్ ..... ..... .... బలమైన పునాదులు నిర్మించినా తెలుగు విక్షనరీ ఈ రెండు సంవత్సరాలు ఇంచు మించు నిద్రావస్తలోనే వున్నది
ప్రస్తుతమున్న విక్షనరీలోని మొదటి పుట మొదట ఇలా వుండేది కాదు. దీని తయారీకి కొంతమంది కృషి చేసి ప్రస్తుతమున్న విధముగా తయూరయినది. ఇదంత అనుభవ పూర్వకముగా తప్పొప్పులను గ్రహించి సరిచేసినది. కనుక ఇది వాడుకరులకెంతో సులభ గ్రాహ్యంగా వున్నది.
రెండో దశ
<small>మార్చు</small>2011 -2012 ను రెండో దశగా పేర్కొనవచ్చు. సెప్టెంబర్ 17, 2010 తేదీన విక్షనరీ 34,751 పదాల పేజీలకు విస్తరించింది. ఈ రెండు సంవత్సరాలలో ప్రధానంగా కృషి చేసిన వారు టి.సుజాత, డా. రాజశేఖర్, జె.వి.ఆర్.కె. ప్రసాద్, పాలగిరి మొదలగు వారు. వీరి కృషి ఫలితంగా విక్షరీలో గణాంకాల సంఖ్య 25,000 పైగా నామోదయింది. సెప్టెంబర్ 17, 2010 తేదీన విక్షనరీ 34,751 పదాల పేజీలకు విస్తరించింది. ఈ సమయములోనే అత్యంత ఉత్సాహంతో విక్షరీలో వ్రాస్తున్న జె.వి.అర్.కె ప్రసాదు గారు ఆరోగ్య కారణాల వల్ల విక్షరీకీ, వికీపీడియాకి సుమారు ఒక సంవత్సరం పాటు దూరంగా వుండి పోయారు. ఆ నాడు విక్షరీలో వేగం పుంజుకోవడానికి కారణమూ వారె. అదే వేగంతో వారు విక్షరీలో కృషి చేసివుండి వుంటే..... మనం ఈనాడు సాధించి నట్లు చెప్పబడుతున్న అభివృద్ధి ఒక ఏడాది క్రితమే వచ్చి వుండేది.
ఈ సంవత్సరంలో (2012) తెలుగు విక్షనరీలో కొత్తగా సభ్యత్వం తీసుకున్న వారు ఎల్లంకి భాస్కరనాయుడు. అతను తెలుగు విక్షనరీలో అప్పటివరకు జరిగిన అభివృద్ధి..... అనగా పదాల సృష్టి గాని, నామోదైన వాడుకరులు గాని, ఎక్కువగా లేదని, వున్న ఇద్దరి ముగ్గురు చురుకైన వాడుకరులతోనే నెట్టుకొస్తున్నారని, దీనిని వేగ వంతం చేయడానికి ఏం చేస్తే విక్ష్నరీ బలం పుంజుకుంటుందని నాతో చర్చ లేవదీశాడు. అతని ఉత్సాహాన్ని గ్రహించి , ఆగష్టు 9, 2012 లో నావద్ద వుండిన ఒక ప్రముఖ తెలుగు - ఇంగ్లీషు వేయి పుటల నిఘంటువును తీసుకొని అతనికిచ్చి అందులోనున్న ప్రతి పదానికి ఒక్కొక్క పేజీని విక్షనరీలో తయారుచేయాలని చెప్పి, ఎలా వ్రాయాలో కూడ కొంత అవగాహన కలిగించాను. అతను సంతోషంగా దానిని స్వీకరించి వెంటనే పని మొదలు పెట్టాడు. అంత పెద్ద పనిని భాస్కరనాయుడు గారు ఒక 6 నెలల కాలంలో నిర్విఘ్నంగా పూర్తిచేశారు. దాంతో విక్షనరీ వేగం పుంజుకుంది.
మూడోదశ
<small>మార్చు</small>2013 వ సంవత్సరంలో అర్జునరావు గారు శ్రమించి విక్షనరీ గణాంకాలలోని భేదానికి కారణాలను కనుగొన్నారు. ఆయన చెప్పినదాని ప్రకారం " వ్యాసాలు గణాంకాలలో లెక్కకు రావాలంటే కనీసం ఒకటయిన అంతర లింకు ఇతర వ్యాస పేజీలకు కలిగి వుండాలి. (ఉదా: సరియైన అంతర్వికీ లింకు లేని పదం ) కనుక అలాలేని పదపేజీలను వీలైనంత వరకు సవరించితే పద వ్యాసాల సంఖ్య మొత్తము వ్యాసాల సంఖ్యకు చేరుకోగలదు. " మేము కూడా పరీక్షచేసి అది నిజమేనని నిర్ధారించుకున్నాము. ఈ సమస్య ఎక్కువగా బ్రౌన్ నిఘంటువు నుండి తయారుచేసిన 25,000 పైచిలుకు ఆంగ్ల పదాల వ్యాసాలలో కనిపించింది. ఆయా పేజీలన్నీ అక్షరక్రమంలో ఒక్కొక్కటి తెరచి అందులోని తెలుగు పదాలకు బ్లూ లింకులిచ్చాము. ఈ బృహత్కార్యాన్ని భాస్కరనాయుడు ఎక్కువగా నేను కొంత శ్రమించి ఒక 6 నెలల సమయంలో పూర్తిచేశాము. అప్పటికి వ్యాసాల సంఖ్య 80,000 దాటింది. ఇది జరుగు తుండగానే ..... పనిలో మార్పు కొరకు భాస్కరనాయుడు గారు అనేక ఇతర తెలుగు నిఘంటువలను సమకూర్చుకొని అందులోని పదాలను ఎంచుకొని, వాటి అర్థాలను, వ్యాకరణ అంశాలను, పద ప్రయోగములు మొదలగు వాటిని విక్షరీలో ఎక్కించారు. అంతే కాక, ప్రతి దినము వచ్చే వార్థా పత్రికలలో కనబడిన కొత్త పదాలను అప్పటికప్పుడు వ్రాసుకొని వాటికి సంబంధించిన ఇతర అంశాలను సమకూర్చి విక్షరీలో ఎక్కించాము. అయినప్పటికి తెలుగు విక్షరీలో 2013 నాటికి క్రియాశీలంగా వున్న వారి సంఖ్య ఇంచుమించు 15 మంది మాత్రమే. అందులో అతి చురుకు గా పని చేసేవారు ఐదు మంది లోపే. మెదటినుండి ఈ ఐదుగురే అతి చురుకుగా వ్రాస్తున్నారు. కొత్తగా చేరి చురుకుగా వ్రాసేవారె కరువయ్యారు. ఈ విషయాన్ని గ్రహించి భాస్కరనాయుడు..... విజయవాడలో జరిగిన దశమ వార్షిక ఉత్సవాలలో.... పాల్గొన్న గుళ్ళపల్లి నాగేశ్వర రావు ని ఉత్సాహపరచి విక్షరీలో వ్రాయుటకు ప్రోత్సహించారు. ఆ విధంగా గుళ్ళపల్లి నాగేశ్వర రావు 2014 వ సంవత్సరంలో విక్షనరీలో ప్రవేశించారు. ఈనాడు విక్షనరీలో వ్రాసే వాడుకరులలో అతి చురుకైన వాడుకరులలో ఒకరై..... విక్షరీలో అత్యధిక మార్పులు చేర్పులు చేసిన వ్యక్తులలో రెండవ స్థానంలో నిలచారు. మొదటి స్థానంలో భాస్కరనాయుడు 1,01,080 దిద్దుబాట్లతో మొదటి స్థానంలో వుడగా... గుళ్ళపల్లి నాగేశ్వర రావు 5435 దిద్దుబాట్లతో రెండవ స్థానంలో వున్నారు. [[1]] ఎల్లంకి భాస్కరనాయుడు తాను విక్షనరీలో పేరు నామోదు చేసుకున్న ఇంచు మించు మూడు సంవత్సరాలలోనే ఇంతటి ప్రగతి సాధించడము గొప్ప విషయమే. వీరిని విక్షనరీలో నిర్వాహకునిగా కూడ నియమించారు. విరామము లేకుండా రోజుకి కొన్ని గంటలు విక్షనరీలో వ్రాయడానికే కేటాయించిన భాస్కరనాయుడు కృషితో ఈ నాటు విక్షరీలో లక్ష పదాల మైలు రాయిని దాటింది.
తెలుగు విక్షనరీ ప్రత్యేకతలు
<small>మార్చు</small>వికీపీడియా లో వ్రాయడం కన్నా విక్షరీలో వ్రాయడములో కొంత సులభమైనా కొంత జాగ్రాత్త వహించాల్సి వుంటుండి. ఇది నిఘంటువు గనుక భాషాదోషాలు వుండకూడదు. ఈ విషయంలో కొంత జాగ్రత్త తప్పని సరి.. కనుక ఏదేని సందేహం వచ్చినప్పుడు సంబంధిత గ్రంధాలలో గాని, లేదా భాషా పండితులతో సంప్రదించి వారి సలహా మేరకు వ్రాయవలసి వుంటుంది. ఎందుకంటే ఇందులో వ్రాసే వారు భాషా పండితులు కాదు గనుక.
విక్షనరీలో వ్రాస్తున్న వారు తెలుగు భాషా పండితులో.... భాషా శాస్త్ర వేత్తలో కాదు. సాధరణమైన విద్యావంతులు మాత్రమే. కాని ఔత్సాహికులు. ఈ గుణము చాలు వారిని ముందుకు నడిపించడానికి. కొన్నిపదాలకు అర్థాలు గాని, ఇతర వ్యాకరణ అంశాలు తెలియక పోతే భాషా పండితులతో చర్చించి వారి సలహా మేరకు వాటి అర్థాలను ఇతర అంశాలను విక్షరీలో ఎక్కించాము. అలాంటి భాషా పండితులలో చెప్పుకోదగ్గ వారు శ్రీ కె.నారాయణ పిళ్ళె గారు. వీరు తమిళ నాడులోని హోసూరు నివాసి. మాకు తెలుగు వ్యాకరణ విషయాలలో వచ్చిన సందేహాలను ఫోన్ ద్వారా ఏ సమయంలోనైనా సరే అడిగిన వెంటనే విసుగు చెందకుండా మా సందేహాలను తీర్చి సలహాలిచ్చేవారు. వారి సమాదానాల కనుగుణంగా విక్షనరీలో ఆ యా అంశాలను వ్రాసేవారము. తిరుపతి లో జరిగిన తెలుగు వికీపీడియా వార్షికోత్సవానికి వారిని ప్రత్యేక ఆహ్వానితునిగా ఆవ్యానించగా వారు విచ్చేసి సభా ముఖంగా ఈ విషయాన్ని తెలియ జేశారు. ఆ సమావేశంలో వారు మాట్లాడుతూ............ తెలుగు భాషా సంబంధమైన విషయాలలో విక్ష్నరీలో కృషిచేస్తున్న రాజశేఖర్ వంటివారు అడిగిన ప్రశ్నలు..... సందేహాలు..... పెద్ద పెద్ద భాషా పండితుల చర్చలలో మాత్రమే ఉటంకించ బడేవని, అటు వంటి ప్రశ్నలు, సందేహాలు..... భాషా పండితులు కాని వీరికి రావడమే చాల గొప్ప విషయమని, వీరు చేస్తున్న కృషి చాల గొప్పదని.... అన్నారు.
ఆంగ్ల విక్షనరీ నుండి కొన్ని ప్రామాణికమైన వాటిని ముద్రిత నిఘంటువులలో లేని విశేషాల్ని తెలుగు విక్షనరీలో ప్రారంభించాము:
- తెలుగువారి వ్యక్తిగత మరియు ఇంటి పేర్లు: అలాసడైర్ అనే వాడుకరి స్పూర్తితో స్టీఫెన్ బ్రౌన్ అనే వాడుకరి ప్రోత్సాహంతో తెలుగువారిలో స్త్రీపురుషుల వ్యక్తిగత పేర్లు మరియు ఇంటిపేర్లకు ఒక అనుబంధంగా తెలుగు విక్షనరీలో ప్రారంభించాము. దీనిని అనుబంధం:పేర్లు వద్ద సభ్యులు తిలకించవచ్చును. తెలుగు భాషా పరిశోధనలో పేర్లు గురించిన ఒక విభాగమైన ఒనొమాటోపియా (Onomatopoeia) లో కృషిచేస్తున్న వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
- విభక్తులు సాధారణంగా నిఘంటువులలో కనిపించవు. కానీ ఒక భాషను నేర్చుకోవాలంటే ఇవి తెలియడం చాలా అవసరం. స్టీఫెన్ బ్రౌన్ ప్రోత్సాహంతో కొన్ని నామవాచకాలు ఎనిమిది విభక్తులలో ఏకవచన మరియు బహువచన ప్రయోగంలో ఎలా మారుతుంటాయి అని తెలుసుకోవచ్చును. ఉదా: రాముడు, కృష్ణుడు
- క్రియలు వాటి యొక్క క్రియా రూపాలు నిఘంటువులలో కనిపించవు. ఇలా క్రియలు ప్రథమ పురుష, ఉత్తమ పురుష మరియు మధ్యమ పురుషలలో ఏకవచన మరియు బహువచనాలలో, భూత, భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎలా మార్పుచెందునో తెలుసుకోవచ్చును. ఉదా: చేయు
- అంతర్జాతీయ ఉచ్చారణ సంఘం (International Phonetic Association) ఒక భాషకు చెందిన అక్షరాలను మరియు పదాలను ఎలా పలకాలో నిర్ణయిస్తుంది. దీనికోసం ఆయా అక్షరాలు వ్రాసే విధానం వేరుగా ఉంటుంది. ఆ పద్ధతిలో వ్యాసినట్లయితే తెలుగుభాష రానివారు కూడా ఆ పదాన్ని ఎలా పలకాలో తెలుసుకొనవచ్చును. అంతే కాకుండా బొంబాయిలో నివసిస్తున్న మురళి మరియు శ్రీఫణి దంపతుల సహకారంతో ఒక వెయ్యి పదాలకు ఆడియో ఫైల్స్ తయారుచేసి, వాటిని వికీ కామన్స్ లోని అప్లోడ్ చేసి ఆయా పదాలలో చేర్చాము. ఈ మూల పదాలను ఎవరైనా మీటనొక్కి వినవచ్చును. ఉదా: ఊయల
- తెలుగు భాషలోని పదాల వ్యుత్పత్తి (Etymology) ఒక ప్రత్యేకమైన పరిశొధనాంశము. తెలుగు భాషా పదాలు ఎక్కువగా సంస్కృతం నుండి ఉద్భవించినా; ప్రస్తుత కాలంలొ చాలా ఆంగ్ల పదాలు తెలుగులో స్థిరపడుతున్నాయి. ఈ దిశగా కొంత ప్రవేశాన్ని కూడా తెలుగు విక్షనరీలో కలిగించాము. ఉదా: అగ్ని, క్షేత్రము. ఈ విధంగా ఒక భాషకు చెందిన పదాలను వాటి మూల భాషా పదాల వరకే కాకుండా వాటి మూల శబ్దాల (Roots) వరకు తీసుకొనిపోవచ్చును.
- బహువచన శబ్దాలను వాటి ఏకవచన శబ్దాలకు దారిమార్పు పేజీలుగా మార్చకుండా ఆయా శబ్దాలను ఫలానా పదం యొక్క బహువచన రూపం అని వ్రాయడం ద్వారా బహువచన పదాలన్నింటిని ఒకే దగ్గర చేర్చుకొనే అవకాశం కలుగుతుంది. అలాగే తెలుగులో బహువచనాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఉదా: ముఖము కు బహువచనం ముఖములు, ముఖాలు మొదలైనవి.
- బొమ్మలు సామాన్యంగా ఇతర నిఘంటువులలో కనిపించవు. కారణాలు అనేకం. ఇవి పిల్లల పుస్తకాలలో ఎక్కువగా కనిపిస్తాయి. నిఘంటువులోని పదానికి బొమ్మ గనుక ఉంటే సుళువుగా అర్థం అవుతుంది. ఇది బహుభాషా నిఘంటువు గనుక, తెలుగేతరులు చూసినప్పుడు ఆ యా పదాలు సులభముగా అర్థం కావడానికి ఈ బొమ్మలు ఉపకరిస్తాయి. పదానికి సంబంధించిన వివరాలు ఎక్కువగా వ్రాయాల్సిన అవసరం తగ్గుతుంది. ఇప్పటికే సుమారు ఒక వెయ్యి బొమ్మలున్నా కూడా, ఆ దిశగా ఎవరైనా కృషిచేసి తెలుగు విక్షనరీని ఇంకా మెరుగుపరచవచ్చును.
ఇతర భాషల విక్షనరీలలో తెలుగు విక్షనరీ స్థానము.
<small>మార్చు</small>ఏప్రిల్ నెలలో 1వ తేదీన విక్షనరీ పేజీల సంఖ్య ఒక లక్ష గా నమోదు చేసుకొన్నది. ఇందులో 971 బొమ్మలు కూడా ఉన్నాయి. మొత్తం 2,916 మంది వాడుకరులు విక్షనరీలో నమోదు చేసుకోగా, ప్రస్తుతం 18 మంది మాత్రమే క్రియాశీలకంగా ఉన్నారు. విక్షనరీలో 5 గురు నిర్వాహకుల హోదాలో పనిచేస్తున్నారు. విక్షనరీ పురోగతిలో 9 బాట్లు కూడా నడుపుతున్నారు.
ఈ విషయములో తెలుగు విక్షనరీ భారత దేశ భాషలన్నిటిలో సంఖ్యా పరంగా (ఒక లక్షకు మించిన పదాలతో) నాల్గవ స్థానంలో వున్నది. ప్రపంచ భాషలన్నిటిలో 36వ స్థానంలో ఉన్నది. అదే విధంగా విక్షనరీలో వున్న పదాలకు బొమ్మలను (ఫోటోలను) చేర్చే విషయంలో...... ప్రపంచ భాషలన్నిటి కన్నా తెలుగే ప్రధమ స్థానంలో (971 బొమ్మలతో) వున్నది. ఈ విషయం మాత్రము మన తెలుగు సహ వికీపీడియనులు గర్వించ దగ్గ విషయమే. [3]
రాబోవు కాలంలో విక్షనరీ అభివృద్ధికి సూచనలు
<small>మార్చు</small>2015 ప్రారంబంలో తెలుగు విక్షనరీ భారతీయ భాషల ఇతర భాషల విక్షనరీల సరసన ఓక గౌరవప్రదమైన స్థానంలో నిలిచినది. ఇది మనందరికి గర్వ కారణము. ఈ స్థానాన్ని మరింత ముందుకు తీసుకొని పోవలసిన భాద్యత మనందరిపైన వున్నది. ఈ క్రమంలో ఇంతవరకు ఎక్కువగా విక్షనరీలో వుంటూ చురుకుగా లేని వారిని, కొత్తగా ఇందులో చేరే వారిని ప్రోత్సహ పరచ వలసి వున్నది. క్రొత్త వారికి ఇందులో వ్రాయడము కొంత సులువు. ఎందుకంటే, పెద్ద పెద్ద వాఖ్య నిర్మాణాలు, పేరాగ్రాఫుల విబజన వంటి సమస్యలు వుండవు. చిన్న చిన్న పదాలు, వాటి అర్థాలు, ఇతర భాషా పరమైన వివరాలు వ్రాస్తే సరిపోతుంది. కాకపోతే భాషాదోషాలు రాకుండా చూసుకుంటే చాలు. కనుక కొత్తవారిని ఈ దిశగా ప్రోత్సాహపరిస్తే.... ఈ విషయంలో ఎంతో అభివృద్ధి పొంద వచ్చు. అంతే గాక విక్షరీలో అతి చురుగ్గా పాల్గొంటున్న వారు ఇంచు మించు అయిదారు మంది మాత్రమే. మొదటి నుండివారే వ్రాస్తున్నారు. అతి చురుకైన వాడుకరులు విక్షనరీలో సుమారు 15 మంది వుంటే..... ఇప్పటివరకు విక్షరీలో మనం సాధించిన ప్రగతికి రెండింతలు 2015 సంవత్సరం అంతానికే సాధించ వచ్చును.
w:వికీసోర్స్ లో కాపీహక్కులు చెల్లిపోయిన తెలుగు నిఘంటువులలోని విషయాలను విక్షనరీలోకి ఒక నిర్ధిష్టమైన ప్రణాలిక ద్వారా చేర్చవచ్చును. అయితే మానవుల శ్రమను తగ్గించి ఒక ప్రత్యేకమైన ప్రొగ్రాంను ఉపయోగిస్తే పని సుళువుగా పూర్తిచేయవచ్చును. ఉదా: s:సంస్కృతన్యాయములు, s:పదబంధ పారిజాతము మొదలైనవి.
తెలుగు అకాడమీ వంటి ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో w:తెలుగు మాండలికాలు గురించిన వివిధ ప్రాంతాలలో తెలుగు భాషలో వున్న మాండలిక పదాలను విక్షనరీలో చేర్చి ప్రజలందరికీ అందించవచ్చును. అలాగే శాస్త్ర నిఘంటువులను గురించి కూడా పండితుల సహాయంతో తయారుచేసిన నిఘంటువులను కూడా విక్షనరీలో చేర్చి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కోట్లమంది తెలుగువారికి అందజేయవచ్చును.