అంటు
విభిన్న అర్ధాలు కలిగిన తెలుగు పదాలు
<small>మార్చు</small>అంటు (క్రియ)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము./దే.స.క్రి.
- దేశ్యం.
- సకర్మకక్రియ/అకర్మకక్రియ/నామవాచకం/విశేషణం/అవ్యయం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- (సకర్మకక్రియ)1.తాకు, ముట్టుకొను. 2.తగులుకొను, విడువకుండు. 3.(యుద్ధమున)కవియు, తాకు. 4.సంభోగించు. 5.ఆశ్రయించు. 6.అవలంబించు. 7.పట్టుకొను. 8.కూడు, కలియు. 9.పొందు, చెందు. 10.(నూనె మొదలగునవి)రాచు.
- (అకర్మకక్రియ)1.అబ్బు. 2.అత్తు, కూడు, కలియు. 3.తగులుకొను. 4.నాటుకొను. 5.అంటుకొనియుండు, నిలుచు. 6.కలుగు, పుట్టు.
- (నామవాచకము)1.అనుట. 2.స్పర్శ, తాకు. 3.(విటీవిటుల)లైంగిక సంబంధము. 4.అతుకు. 5.తాకరానివానిని తాకుటవలన కలిగెడి అశుచి, మైల. 6.ఆహారము వండిన లేక వండిన ఆహారము ఉంచిన పాత్ర.(బ.వ)అంట్లు. 7.ఆర్తవము, ముట్టు.
- (విశేషణము)1.అశుచియైన. 2. స్పర్శవలన సంక్రమించు.
- (అవ్యయము)1.అనుట (దాతవంట, దాతవఁట).
- అంటు అంటే మొక్కలను కత్తిరించి ఒకదానితో ఒకటి చేర్చి లేక కొంత భాగాన్ని నేలలో పూడ్చి ఉత్పత్తి చేయడము.(నామవాచకము)
- అంటు అంటే నూనెతో తలపై మర్ధన చేయడము.(క్రియ)
- "అంటు వ్యాధి.
- ఉదా: దాని రంగు దీనికి అంటుకున్నది. / వానిని అంటు కోవద్దు.
#తాకు, స్పృశించు, ముట్టుకొను.;
- రతియందుఁ గలయు, తగులుకొను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
అంటుముట్టు/ నిప్పు అంటించు / అంటుకొను/ అంటుకట్టు/ కొమ్మంటు /
- సంబంధిత పదాలు
- తలంటు(క్రియ)
- మందార అంటు(నామవాచకము)
- అంటుకొను.
- అంటించు.
- అంటకట్టు.
- అంటువ్యాధి
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "ఉ. అంటకుమీ లతాంగి నను నంటిననేమి మనోహరాంగ నే, నంటు పడంగలే దనుచు నంటెద గాని యటంటగాదు న, న్నంటగ జెల్లునే జనకు నంటిన పిమ్మట నంటివైన నీ, యంటున నంటుగామి నెటులంటును గెంటక మేన బ్రాణముల్." సారం.౨,ఆ. ౯౪. (రెండర్థములకు నిదే యుదాహరణము.)