బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, an articulate sound శబ్దము, మాట.

 • he had not a wordto say వాడు నోరెత్తక వుండినాడు.
 • he has translated it word for word శబ్దతః భాషాంతరము చేసినాడు.
 • he read the paper word by word వొకొకమాటగా విడవిడ చదివినాడు.
 • in one word or in a word మెట్టుకు, వెయిమాటలేల.
 • in one he will not give the money వెయిమాట లెందుకు వాడు రూకలు యివ్వడు.
 • at a word తక్షణము లటక్కున.
 • as soon as he gave the word they set out సెలవు యివ్వగానే బయిలుదేరిరి.
 • they told him in so many words that he should have the house యిల్లు యిస్తామని పరిష్కారముగా చెప్పినారు.
 • in other words అనగా.
 • his father, his brother, and his cousin ; in other words all his relations వాడి తండ్రి, వాడి అన్న, వాడి దాయాదివాడు, అనగా వాడి వాండ్లందరున్ను.
 • talk, message వదంతి, సమాచారము, వర్తమానము.
 • a short talk ఒక మాట.
 • a word with you విన్నావా, వొకమాట విను.
 • he got the money out of them by fair words బుజ్జగించి వాండ్ల వద్ద రూకలు తీశినాడు.
 • he had some words with them about this ఇందున గురించి వాడికి వాండ్లకు ఘర్షణ జరిగినది.
 • he sent me word to come రమ్మని చెప్పి పంపినాడు.
 • promise వాగ్దత్తము.
 • he kept his word వాడు ఆడినమాట తప్పలేదు, చెప్పిన ప్రకారము జరిపించినాడు.
 • he broke his word మాట తప్పినాడు.
 • he is a man of his word అతడు ప్రమాణికుడు, పెద్దమినిషి అన్న మాటను తప్పేవాడుకాడు.
 • his promises are mere words వాడి వాగ్దత్తములు వట్టివే.
 • they took him at his word వాడు చెప్పినమాటనే పట్టుకొన్నారు.
 • he gave it by word of mouth యిస్తానని నోటమాత్రముఅన్నాడు.
 • good word or recommendation సిఫారసు.
 • they gained his good word by this ఇందువల్ల ఆయనకు విశ్వాసము వచ్చినది.
 • hard words తిట్లు.
 • a play upon words మాటల చమత్కరము, వ్యంగ్యము, శ్లేష.
 • when he gave the word they all lay down వాడు పండుకొండనగానే అందరు పండుకొన్నారు.
 • upon my word సత్యముగా, ప్రమాణముగా, ఆహా, ఓహో ఓయబ్బా, upon your word ? సత్యముగా, (బహుశః ఇది యెగతాళిమాట.
 • ) he left word that I must come నేను రావలసినదని చెప్పి పోయినాడు.
 • a bye word సామితె.
 • this is a bye word among them ఇది వాండ్లలో వుండే వొకమాట, వొకరహస్యము.
 • he became a bye word among them వాండ్లు నలుగురు వాణ్ని ఛీ అంటారు, వాణ్ని చూచి అందరు నవ్వుతారు.
 • in thought word and deed కరణత్రయమందున్ను.
 • The word, or The word of God దైవవాక్యము, అనగా బైబిలు.
 • they consider the Koran to be the word of God వాండ్లు ఖురాను ను దైవవాక్య మనుకొంటారు, దేవుడు చెప్పినదని అంటారు.
 • In the holy scriptures it sometimes is equivalent to శక్తి, (as see Psalm CVII. 20.) But in Ps. LXVIII. 11.
 • ప్రభుణాజ్ఞాపితం వాక్యం. A+.

క్రియ, విశేషణం, to express మాటలను ప్రయోగించుట, పదములను పెట్టుట.

 • he worded the letter severely ఆ జాబులో క్రూరమైన మాటలు ప్రయోగించినాడు.
 • he has worded it differently but the sense is the same మాటలు మాత్రం వేర పెట్టి వున్నవిగాని తాత్పర్యము అదే.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=word&oldid=949944" నుండి వెలికితీశారు