అంకిలి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అంకిలి నామవాచకము. దే.వి.
- దేశ్యము
- వ్యుత్పత్తి
- బహువచనం
- అంకిళ్లు.
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- విఘ్నము
- కలత
- ఆపద/ అక్కిలి, అదవద, అఱిముఱి, ఆరివేరము, ఆర్వేరము, ఉత్తలము, కరకరి, కలఁకువ, కలగుండు, కలఁత, కలపనఁబిండి, కలవరము, కలాపన, కలాపము, కలుచ, కళవళము, కొందలము, గగ్గోలు, .................సీమపలుకువహి-అచ్చతెనుగుమాటలపేరుకూర్పు (ఆదిభట్ల నారాయణదాసు)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అంకిలి చెప్పలేదు..... చతురంగ భలంబుల తోడ.... భాగవతంలో ఒక పద్య భాగం.
- ఆపద. "క. ఇంకని జలములుగలిగిన, యింకొక్క యగాధసరసి నిడినంజాలున్, సంకోచింపక మము నీ, యంకిలిఁబాపుటకు నీవ యర్హుఁడవనినన్." పంచ. నా. ౧, ఆ.
- "శోకోపశమనంబులైన వచనంబులు చెప్పి యంకిలిదేర్చి." భార. శాంతి. i.288.
- కలత; ="క. అని యూఱడిలఁగఁ బలికిన, వినియంకిలి దేఱు చిత్తవృత్తిగలుగు నం, గన యేడ్పుడిగెన్." భార. ఉద్యో. ౩, ఆ.
- ఆపద. -"క. ఇంకనిజలములుగలిగిన, యింకొక్క యగాధసరసి నిడినంజాలున్, సంకోచింపక మము నీ, యంకిలిఁ బాపుటకు నీవ యర్హుఁడ వనినన్." పంచ.నా. ౧,ఆ. ౨౩౦;#
- అరమరిక, భేదము. -"ఉ. అంకిలి లేక యప్పు డరుణాధరపల్లవనిర్గతంబులై, పంకరుహాయతాక్షి నునుఁబల్కులు తేనియ లొల్కుచున్ శ్రవో, లంకృతులై నృపాలుమది లగ్నములయ్యె వినోదలీలకై, మంకెన పూవు బాణమున మన్మథుఁడేసిన తూపులో యనన్." నై.౪,ఆ. ౧౩.