బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, పిండుట, పితుకుట. నామవాచకం, s, పాలు, క్షీరము.

Milk. Milky juice or sap. చనుబాలు or చన్నుపాలు (woman's milk, human milk.) చెరుకుపాలు (the juice of the sugar cane). టెంకాయపాలు లేదా కొబ్బరిపాలు (the white juice expressed from the cocoanut kernel by pounding) మర్రిపాలు (the milky juice of the banyan tree). పాల పదాన్ని స్వచ్ఛతకు చిహ్నంగా వివిధ సందర్భాలలో ఉపయోగిస్తారు. పాలవంటివారు men like milk, i.e., candid, simple, pure, unspotted, blameless, honourable. పాలవంటి మనసు a pure mind, a simple heart. పాలుకారే ముఖము a milk-distilling face, i.e., a face radiant with loveliness. పాల్గారు చెక్కుటద్దములు radiantly polished cheeks, beaming with beauty. పాలకడలి, పాల్కడలి, పాలకుప్ప, పాలమున్నీరు, పాలవాగు or పాలవెల్లి The Ocean of milk. పాల సముద్రము లేదా క్షీరాబ్ధి. పాలమున్నీటి కూతురు అనగా లక్ష్మీదేవి. పాలమున్నీటి అల్లుడు అనగా విష్ణువు. పాలకాయ n. A sort of biscuit, భక్ష్య విశేషము, పాలకుండ n. The milk pot, a certain fee claimed by various hangers on on every crop of grain. పాలవన్నె adj. Milky white, whitish, pale. పాటలవర్ణము. పాలావు n. A milch cow. పాలు చాలాయిచ్చే ఆవు. పాలిండ్లు (from పాలు milk and ఇల్లు a home.) n. A woman's breasts వక్షోజాలు. పాలేరు (పాలు+ఏరు.) n. The river or sea of milk. పాల కడలి. వివిధ రకాల పాలిచ్చే మొక్కలను పాల పదాన్ని చేర్చి పిలుస్తారు. ఉదా: మేకపాలతీగ, కుక్కపాలతీగ. పాల అనే విశేషణం చేరిస్తే వివిధ అర్ధాలనిస్తాయి. ఉదా: తెలుపు White. పాలవెండి pure silver. పాలగచ్చు, పాలగార or పాలసున్నము అనగా n. Fine lime plaster. సన్న సున్నపుపూత. పాలమన్ను n. White earth, pipe clay సుద్ద. పాలమాని చెక్క n. The 'white wood' produced by the పాలటేకు. పాలకూర n. A certain pot herb. Oxystelma csculentum. కుక్కపాలకూర a forest plant, Trianthema crystallina,. పాలబుగ్గలు అనగా Infant's cheeks, బిడ్డల చెక్కిళ్లు. పాలగరువు or పాలగార n. A sort of earth, a whitish marl. పైని యిసుకగల రేగడనేల. పాలగొర్రు n. A rake used in husbandry. పాలగోకుడు n. The butter that sticks to the bottom of a milk pot. పాలచెట్టు n. A species of the Mimusops tree. పాలచేప n. A sort of Salmon. పాలచేరులు or పాలచేర్లు n. The nerves. బీజములకు పైననుండు నరాలు. పాలటేకు or పాలతేకు n. The white wooded teak tree. పాలడ (పాలు+అడుగు.) n. A shell used as a spoon or ladle in giving milk to a child. పాలతుత్తము or పాలతుత్తరము n. White vitriol. పాలపండ్లు n. Milk teeth. పాలపపడు n. An infant at the breast. పాలవెడిస or పాలవలిస n. The Grey headed Myna, Sturned malabarica. పాలబొంత n. A fish called the white mullet, Chonos salmoneus. పాలసుగంధి n. A plant called Country Sarasaparilla. పాలసున్నము n. Fine lime plaster, సున్నము. పాలసొర or పాలచొర n. A fish, Carcharias laticaudus and also Carcharias cllioti or Carcharias macloti. సొర్రకోవ The white shark. సముద్రమందు మనుష్యులను భక్షించే పెద్ద చేప. పాలాకు n. A certain herb. చిటిపాలాకు is one sort. పాలానుగు n. The white gourd, ఆనుగుతీగె, దుగ్ధతుంబి. ఇవి కాకుండా పాలు లేదా పాళ్లు అనగా A share or portion. భాగము, వంతు అని అర్ధం కూడా ఉన్నది. ఇదే కాక Possession, charge, వశము అనడానికి పాలి, పాల or పాలిటి అని ఉపయోగిస్తారు ఉదా: నా వయసు నీపాలుచేసినాను I yielded up my youth to thee. అతని పాలికి వచ్చినది యిది this is what fell to his share. నీపాలి దైవము or నీపాలిటి దైవము your good angel, your tutelary God. వాడు నాపాలిటికి యముడు he has been a curse to me. వేములుపండి కాకులపాలైనవి ఒక సామెత. పరులపాలైన given up to others or sacrificed. దొంగలపాలైన abandoned to thieves. రచ్చలపాలుకావడము to become a prey to ridicule, to become a laughing stock. అప్పుల పాలయినాడు he has fallen into debt. పాలాడు అనగా To divide into shares. To cut, to sever, to separate, ఖండించు. పాలారుచు or పాలార్చు (పాలు+అరుచు.) v. a. To disregard, to neglect, ఉపేక్షించు. భాగ. పాలుచేయు క్రియా పదంగా To hand over, give over to, deliver, sacrifice. నన్ను అప్పులపాలు చేసినాడు he plunged me in debt. పాలుపడు or పాల్పడు v. n. To undertake, to enter upon, to share, to engage in. పూనుకొను, పైనవేసికొను. To be subject to, స్వాధీనమగు. పాలుపుచ్చు or పాలుపెట్టు v. a. To deduct or subtract: to divide or separate, విభాగించు. To decide or settle, నిర్ణయించు. వేదనపాలుకాలేను I cannot endure being a prey to grief. పాలుగలవాడు a co-heir, a cousin, దాయాదివాడు. పాలుపోవు అనగా To be divided or shared. విభక్తమగు. To be decided, నిర్ణీతమగు. ఒకరిని పాలుబోక ఆ పనిని అట్టె పడవేసిపెట్టినారు no one undertook the work, so it was left undone. అది యెటు వ్రాయడానకు పాలుపోక విడిచినాను unable to decide how to write the passage. I omitted it. పాలుభోగగ్రామము అనగా A village wherein each field is held as one man's separate property.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=milk&oldid=938065" నుండి వెలికితీశారు