వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం./ దే. వి.
వ్యుత్పత్తి

నామవాచకము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
పాలు. న్యాయము/ క్షీరము.
నానార్థాలు

పాడి అంటే పాలిచ్చే జంతువులను పెంచడం.

  1. పాలు అని అర్థం
  2. పాడి అనగా న్యాయము అని కూడ అర్థమున్నది.
  • పాడి అనగా..... చనిపోయిన మానవ శరీరాన్ని... శవ దహనానికి తీసుకెళ్ళడానికుపయోగించే కర్రలతో చేసిన ఒక వేధిక.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. ఒక పద్యంలో పద ప్రయోగము: పదుగురాడు మాట పాడి యై ధర జెల్లు... ఒక్కడాడు మాట ఎక్కదెందు.

పాడిపంటలకు కొదవ లేదురా....

"ఎ, గీ. పాఁడిసేఁపెఁ బుష్పఫలభరితంబులై, తరువనంబులొప్పె." భార. ఆది. ౫, ఆ.
"ఎ, గీ. ప్రణవమను క్రేపుతోఁగూడి పాఁడిఁబిదుకు, నవనిసురులకు గాయత్రియనెడు సురభి." కాశీ. ౩, ఆ.
1. ధర్మము;......."గదాసంగరమునఁ బాడిఁదొఱంగి యిప్పాపకర్ముడు వైచెఁగాక." సం. "అధర్మేణ గదాయుద్ధే యదహం వినిపాతితః." భార. శల్య. ౨, ఆ.
2. వ్యవహారము;."ఎ, గీ. పాడికరిగి గురునితోడ శిష్యుఁడు తండ్రి, తోడఁ గొడుకు మగనితోడ నాలు, స్వామితోడఁ బంటు సభఁజెప్పఁ జనదైన, నందు నిహపరములనిందవచ్చు." సం. "గురోశ్శిష్యే పితుఃపుత్రే దంపత్యో స్స్వామిభృత్యయోః, విరోధేతు మిధస్తేషాం వ్యవహారో నసిద్ధ్యతి." విజ్ఞా. వ్య, కాం.
3. న్యాయము;......"క. నడవఁజాలనివారలఁ, దడయక మోపించితెచ్చి ధరణీశుఁడు దాఁ, దడవోర్వని కార్యములకు, నెడసేయక పాడి నిర్ణయింపఁగవలయున్‌." విజ్ఞా. వ్య, కాం.
4. స్వభావము......"చ. అతివ యపాయముం బొరయునప్పుడు కావక తక్కెనేని యా, పతి పతియే తలంప మగపాడియె లోకము పాడియే." భార. విరా.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పాడి&oldid=956916" నుండి వెలికితీశారు