go
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) (file)
క్రియ, నామవాచకం, పోవుట, వెళ్లుట, నడుచుట, సాగుట, జరుగుట.
- will you gowith us మాతో కూడా వస్తావా.
- the child cannot go yet ఆ బిడ్డ యింకా నడవనేరదు.
- the child goes on all fours ఆ బిడ్డ యింకానడవనేరదు.
- the child goes on all fours ఆ బిడ్డ దోగాడుతున్నది.
- it is ridiculous to dance when we should go మనము నడవవలసినప్పుడునాట్యమాడడము పిచ్చి.
- the report goes that he is dead చచ్చినాడని వదంతి గా వున్నది.
- they go under the name of merchants వర్తకులనబడుతారు.
- the clock goes well ఆ ఘడియారము బాగా పోతున్నది, తిరుగుతున్నది.
- the clock is not going ఆ ఘడియారము నిలిచిపోయినది, ఆ ఘడియారము పారడము లేదు.
- these rupees do not go now యీ రూపాయలు యిప్పుడుచెల్లవు.
- as far as my observation goes నాకు తెలిసే మట్టుకు.
- as far as Tamil goes he is a good scholar అరవము లో నంటే వాడు సమర్ధుడు.
- he went so far as to strike them వాండ్లను కొట్టేంతమట్టుకు అయినాడు.
- as times go he is a learned man యీ కాలానికి వాడు పండితుడు.
- he goes about the town పట్టణములో సంచరిస్తాడు, పట్టణము లోతిరుగుతాడు.
- the ship went about ఆ వాడ మళ్లుకొన్నది.
- he went abroadవాడుదేశాంతరమునకు పోయినాడు.
- they went across the river వాండ్లుయేటిని దాటినారు.
- a bridge that goes across the river యేటి మీద వుండే వంతెన.
- that went against his inclination or it goes against hisstomach యిది వానికి గిట్టదు, యిది వానికి కాదు.
- the decree went againsthim వాడికి విరోధము గా తీర్పు అయినది.
- In this doctrine go I entirelyalong with you యీ సిద్ధాంతమందు నిన్ను అనుసరిస్తాను.
- they went ashore వాండ్లుదగి గట్టుకుపోయినారు.
- the ship went ashore ఆ వాడ దరి తట్టినది.
- they went astray వాండ్లు తప్పుదోవ ను పోయినారు, మార్గము తప్పినారు.
- she went astray వ్యభిచరించినది.
- he went away లేచి పోయినాడు.
- he went back మళ్లుకొనిపోయినాడు, తిరుక్కొనిపోయినాడు.
- I went betweenthem in this affair యిందున గురించి వాండ్లకు మధ్యస్తము చేస్తివి.
- theywent beyond him అతన్ని మించిపోయినారు.
- he went beyondme in this business యీ పనిలో నన్ను మోసపుచ్చినాడు.
- you must go by the doctors advice వైద్యుడు చెప్పిన ప్రకారము నీవు నడుచుకోవలెను.
- the time went by rapidly కాలము త్వరగానడిచిపోయినది.
- the opportunity is gone by సమయము మించిపోయినది.
- the clock has gone down గడియారము నిలిచిపోయినది.
- this will not godown with him యిది వాడికి యెంతమాత్రము దిగదు, అనగా గిట్టదు.
- the sun went down సూర్యుడు అస్తమించెను.
- the swelling wentdown ఆ వుబ్బు అణిగినది, ఆ వాపు తీసినది.
- the ship wentdown వాడ ముణిగిపోయినది.
- things go ill with him వాడి కార్యములు ప్రతికూలముగా వున్నవి.
- he went in unto them వాండ్ల వద్దకు పోయిచేరినాడు.
- he went into the merits of the case ఆ వ్యాజ్యము యొక్కస్వారస్యమును విచారించినాడు.
- he did not go into particularsవాడు వివరముగా చెప్పలేదు.
- they went into mourning దుఃఖవస్త్రములను వేసుకొన్నారు.
- she went into a swoon అది మూర్ఛపోయినది.
- the cloth went into holes ఆ గుడ్డ బొందలు పడ్డది.
- the earth wentinto cracks ఆ నేల బీటికలు బాసినది.
- will all this grain go into thisbasket ? యీ ధాన్యమంతా యీ గంపలో పట్టునా.
- he went into the wellబావిలో దిగినాడు.
- he went mad వాడికి పిచ్చిపట్టినది.
- the rain wentoff వాన నిలిచిపోయనది.
- the thieves went off దొంగలు పారిపోయినారు.
- the gun went off పిరంగి కాలినది, తుపాకి వేటు లేచినది.
- the work goeson well పని బాగా జరుగుతున్నది.
- go on ! do not stop నిలుప,పైన కాని, నిలుపసాగనీ.
- as he went on writing వాడు వ్రాస్తూ వ్రాస్తూవుండగా, he went on his knees i. e. he knelt మోకాళ్లమీద నిలిచినాడు.
- after going out of mourning కర్మాంతము అయిన తరువాత అనగాపుల్లపుడులను తీసివేసిన తర్వాత.
- the lamp went out దీపముఆరిపోయినది.
- mangoes go out in July ఆషాడమాసముతో మామిడిపండ్లకాలము సరి.
- the Captain went out with the Major వాండ్లువొకరినొకరు కాలుచుకో పోయినారు.
- I will go over the letter again ఆ జాబును మళ్లీ చదువుతాను.
- the ball went through his armఆ గుండు వాడి చేతిలో దూసిపోయినది.
- he went through many troublesవాడు నానా కడగండ్లు పడ్డాడు.
- he went through a great deal on the their account వాండ్లకై శానా ప్రయాసపడ్డాడు.
- he went to bed or went to sleep శయనించినాడు, నిద్రపోయినాడు.
- he went to bed upon the stone రాతిమీద పండుకొన్నాడు.
- he went to law with me నా మీద ఫిర్యాదు చేసినాడు.
- he went to the dogs చెడిపోయినాడు .
- it went to pieces బద్దలైపోయినది.
- he went to work and settled the whole at once ఆ పనిలో ప్రవేశించియావత్తును వొక దెబ్బన తీర్చినాడు.
- at last his father went to extremities with him తుదకు వాడి తండ్రి వాడిమీద క్రౌర్యము చేయవలసివచ్చినది.
- this goes to prove that he is the owner యిందుచేత అతడు సొంతగాడని నిరూపణమయ్యేటట్టు వున్నది.
- it is going to rain వానవచ్చేటట్టు వున్నది.
- go to let us make brick యిటిక రాళ్లు కోతాములెండి, పదండి.
- he went to the wall i.e. was ruined వాడు వోడిపోయినాడు.
- to go up the country or to go into the countryదేశముమీదికి పోవుట.
- he went up into the tree చెట్టెక్కినాడు.
- he went up stairs మిద్దెమీదికి యెక్కినాడు.
- she went upon the town or went upon the streets అది వూరిమీద పోయినది, చెడిపోయినది.
- when it goes well with him వాడికి మంచికాలము వచ్చినప్పుడు.
- while her mother went with her దాని తల్లి దాన్ని గర్భముగావుండినప్పుడు.
- the cow goes with young or with calf for ten months ఆవు పదినెలలు చూలుగా వుంటున్నది.
- he went away with this bookయీ పుస్తకమును అంటుకొనిపోయినాడు.
- he went without his dinnerవాడికి భోజనము దొరకకపోయినది.
- he went without the moneyవాడికి ఆ రూకలు రాలేదు.
- Is she to go without being marriedదానికి పెండ్లి లేకపొయ్యేదా.
- he ate it all and she was obliged to go without వాడు అంతా తిని పోయినాడు గనక అది వూరక వుండ వలసివచ్చినది.
- he went without drinking the whole day ఆ దినమంతాతాగక వుండినాడు.
- on the new and full moon the Hindus go without breakfast పౌని్మి.
- అమావాస్యలలో హిందువులకు చద్ది భోజనము లేదు.
- it went wrong తప్పినది.
- something has gine wrong with himవాడి విషయమందు యేమో వ్యత్యాసము జరిగినది.
- he gave them the go byవాండ్లను మించినాడు.
- a go cart బిడ్డలకు నడపనేర్పే బండిSee Gone.
క్రియ, నామవాచకం, (add,) The two verbs To come and To Go are frequently used instead of one another.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).