పురోహితుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
- ముందు ఉంచఁబడినవాఁడు, నియుక్తుఁడు
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పురః అంటే ముందు (చూ: పురోగతి పురోగామి). హిత శబ్దానికి నియోగించబడనవాడు, హితుడైనవాడు అన్న అర్థాలున్నాయి. పురోహితుడు అంటే ముందు ఉంచఁబడినవాఁడు, నియుక్తుఁడు, ఒకపని అప్పగింపఁబడినవాఁడు అని చెప్పవచ్చు. మూలార్థం యజ్ఞశాలలో ముందుండి యాగకర్మలను నిర్వర్తించువాడు. అర్థవిస్తృతిలో శుభాశుభవైదిక కర్మములను చేయింౘుౘు మేలుకీడులను తెలుపుౘుండెడి యాచార్యుఁడు అని వాడుతారు.
హిందూ ధర్మము ప్రకారం మనిషి పుట్టిన దగ్గరనుండి మరణించే వరకు జీవితము లో జరిగే చిన్నచిన్న మార్పులు శాస్త్రీయము గా చేసే సంప్రదాయము ఉంది. అవి వేదాలలో చెప్పబడినట్లు ఆచరించడానికి వేదము తెలిసిన బ్రాహ్మణులను పిలిచి జరిపించడం అవసరం. దానిని జరిపేవారిని పురోహితుడు అని జరిపించడానిని పౌరోహిత్యము అని అంటారు.
పురోహితుడు అంటే పురానికి హితము చేకూర్చేవాడు అర్ధం అన్న అర్థము సరికాదు. పురం అన్న నపుంసక శబ్దానికి హితుడు జతచేస్తే ఆ సమాసము పురహితుడు అవుతుంది.
- ముందు ఉంచఁబడినవాఁడు, నియుక్తుఁడు, ఒకపని అప్పగింపఁబడినవాఁడు
- శుభాశుభవైదిక కర్మములను చేయించుచు మేలుకీడులను తెలుపు యాచార్యుఁడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పండితుడు
- పండితులు
- వేద పండితుడు
- పౌరోహిత్యము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పురోహితుడు లేనిదే పెళ్లి జరగదు.