విభిన్న అర్ధాలు కలిగిన పదాలుసవరించు

గంగ (నామవాచకం)సవరించు

వ్యాకరణ విశేషాలుసవరించు

 
గంగ
 
కాశీలో గంగ
భాషాభాగం
వ్యుత్పత్తి

మూలపదము.

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

  1. సాధారణ ప్రయోగంలో నీరు.
  2. భారతదేశం లోని ఒక ముఖ్యమైన నది. ఇది ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.
  3. శివుని రెండవ భార్య పేరు.
  4. భారతదేశంలో ఒక మహిళల పేరు.
  5. ఒకానొక నది. హిమవంతమునందు పుట్టినందున దీనిని హిమవంతుని కూఁతురు అందురు. ఇది దేవలోకమునందుండి భగీరథుని ప్రయత్నమున భూలోకమునకు వచ్చెను. భగీరథుడు, తన ముత్తాతలు అగు సగరపుత్రులు కపిల మహామునియొక్క కోపాగ్నిచేత నీఱుకాఁగా, వారికి సద్గతి కలిగింప తలచి గంగను కూర్చి తపస్సు చేసి భూలోకమునకు దిగివచ్చునట్లు ప్రార్థించెను. అప్పుడు ఆమహానది తాను భూలోకమునకు వచ్చునెడ తన ప్రవాహవేగమును ధరింపగలవారిని ఒకరిని ఏర్పఱచు కొనిన పక్షమున, తాను వచ్చునట్లు ఒప్పుకొనెను. అంతట భగీరథుడు రుద్రునిగూర్చి తపము ఆచరించి అతని అనుగ్రహము పడసి, గంగాప్రవాహమును వహింప ప్రార్థించెను. అపుడు గంగ మిక్కిలి అట్టహాసముతో భూమికి దిగి రాసాగెను. అది రుద్రుడు చూచి గంగను తన ప్రక్కకు ఆకర్షించి జటాజూటమునందు నిలిపి పిదప కొంతకాలమునకు భగీరథుని ప్రార్థనచే తన శిరస్సునుండి ఏడుబిందువులను భూమిమీద వదలెను. అది కారణముగ రుద్రుడు మందాకినీమౌళి అనబడును. ఆబిందువులు పడిన చోటు బిందుసరస్సు అనియు ఆబిందుసరస్సునుండి వెడలి గంగ ప్రవహించును అనియు చెప్పుదురు. అట్లు వెడలి ఆగంగ జహ్నుమహాముని యజ్ఞశాలయందు ప్రవేశింపగా అతడు కోపించి దానిని పానముచేసి, పిమ్మట భగీరథుడు ప్రార్థింపఁగా ప్రసన్నుడై తన చెవినుండి వెడల విడిచెను. ఇందువలన గంగకు జాహ్నవి అను పేరు కలిగెను. మఱియు ఈనది భగీరథుని వెంట పాతాళమునకు పోయెను కనుక దీనిని త్రిజగత్కల్యాణి, త్రిపథగ అని అందురు.

త్రివిక్రమావతారమున విష్ణువు భూమియందు ఒక పాదము ఉంచి రెండవపాదముచే మీఁది లోకమును కప్పునప్పుడు బ్రహ్మాండము పగిలి ఆకాశగంగ ఆయన పాదముగుండ క్రిందికి ప్రవహించినందున దీనికి విష్ణుపది అను పేరు కలిగెను. ఊర్ధ్వలోకములయందు వ్యాపింప చేసిన త్రివిక్రమదేవుని పాదమును బ్రహ్మ తన కమండల జలముచే కడుగఁగా ఆజలముప్రవహించి ఈనది ఏర్పడెను అనియు అది కారణముగ దీనికి విష్ణుపది అను పేరు కలిగెను అనియు కొందఱు చెప్పుదురు./అంకమ్మ నది

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

యోగి వేమన
గంగపాఱుచుండ గదలని గతితోడ'
ముఱికివాగు పాఱు మ్రోతతోడ
అధికుడొర్చునట్టు లధముడోర్వగలేడు
విశ్వదాభిరామ వినురవేమ
  • గంగాసరయూనదీసంగమ ప్రాంతదేశము

అనువాదాలుసవరించు

గంగ (విశేషణం)సవరించు

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి

మూలపదము.

అర్థ వివరణసవరించు

  1. పూజ్యము (ఉదా: గంగగోవు: పూజ్యనీయమైన గోవు)

పదాలుసవరించు

నానార్థాలు
  1. పెద్ద(ఉదా;గంగరావి)
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

  • గంగాసరయూనదీసంగమ ప్రాంతదేశము

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=గంగ&oldid=953495" నుండి వెలికితీశారు