tooth
(Tooth నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, పల్లు, రదనము, దంతము plu. Teeth పండ్లు.
- eye teeth కోరలు.
- the double teeth or jaw teeth దవడపండ్లు, పక్కపండ్లు.
- the first teeth or milkteeth పాలపండ్లు.
- to speak between the tenth నోరు బాగా తెరవకుండా పండ్ల సందున కసిబిసుమని మాట్లాడుట.
- he is one who would steal the very teethout of your head యెటువంటి వాణ్నిన్ని నిమిషములో తన వలలో వేసుకొనేవాడు.
- cant you keep your tongue between your teeth ? నోరు మూసుకొని వూరికెవుండలేవా.
- the teeth of a saw ఝపము యొక్క పండ్లు.
- teeth of a key బీగముచెవి యొక్క కక్కులు.
- teeth of a wheel in a watch &c.
- గడియారము మొదలైనవాటిలో వుండే చక్రముల మీది నొక్కులు, కక్కులు, పండ్లు.
- he did his teeth వాడుగోముఖ వ్యాఘ్రము గా వున్నాడు.
- at last he showed his tooth తుదకు తన నిజస్వరూపమును బైట పెట్టినాడు.
- they flung this story in his teeth యీ సంగతివాని ముఖము ముందర తాకనాడినారు.
- I had the rain in my teeth the whole wayదోవకడాకు నాకు యెదురు వానే కొట్టినది.
- they cast this business in this teethయీ పనిని గురించి వాణ్ని దెప్పినారు యెత్తి పొడిచినారు.
- in the teeth of విరుద్ధముగా, అడ్డముగా, యెదురుగా.
- in the teeth of the wind గాలికి యెదురుగా.
- in the teeth of the law శాస్త్ర విరుద్ధముగా.
- he gave them the lie in their teeth మీరు చెప్పినది అబద్ధమని వాండ్ల ముఖము ముందర అన్నాడు.
- he paid it in spite of his teeth యెంత మనసు లేకపోయిన తుద కు చెల్లించినాడు.
- he sold the house in spiteof his teeth వానికి యెంత మనసు లేకపోయినా తుదకు ఆ యిల్లు అమ్మినాడు.
- theyfell upon him tooth and nail సర్వప్రయత్నముతో వాడి మీద పడ్డారు.
- he tried tooth andnail to find out the secret ఆ మర్మము ను కనుక్కోవలెనని తన హరణభరణ శక్తిచూచినాడు.
- he was armed to the teeth సర్వాయుధ సన్నధ్ధుడైనాడు.
- she had asweet tooth for this ఆపె మనసు దానిమీద పారినది, ఆపెకు దాని మీద మనసుపోయినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).