head
(Head నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, అధిపతి గా వుండి నడిపించుట.
- he headed the troops and took them into the town ఆ సేనకు నాయకుడై పట్టణము లోకి తీసుకొనిపోయినాడు.
- he headed the spear with brass ఆ యీటెకు యిత్తళి అలుగు వేసినాడు.
- he headed the cane with gold ఆ బెత్తానికి బంగారుపొన్ను వేసినాడు.
- he headed the coloumn with these words ఆకత్తెంతలమీద యీ మాటలు వ్రాసినాడు.
- the crown of the head నడినెత్తి, మాడుపట్టు.
- the back of the head పెడతల.
- this coin bears the head of the Queen యీ నాణ్యము లో రాణి ముఖమును వేసివున్నది.
- he hid his head తలమరుగైనాడు,ముఖము తప్పించుకొనివుండినాడు, దాగివుండినాడు.
- how did this come into your head ? యిది నీకు యెట్లా తోచినది.
- he took it into his head that she was gone అది పోయినదనుకొన్నాడు.
- he did it of his own head తన స్వబుద్ధిగా చేసినాడు, తనకు తానే చేసినాడు.
- he gave all the abuse that came into his head నోటికి వచ్చినట్టెల్లా తిట్టినాడు.
- the head of a bed మంచము యొక్క తలతట్టు.
- a head of corn కంకి, యెన్ను.
- the head of a spear బల్లెపు అలుగు.
- at the head of a ship వాడ ముందరి తట్టు.
- womans head or head dress (Johnson, Sense, Rambler No. 191.Idler No.
- 46) స్త్రీల శిరోభూషణము.
- these are the heads of the people ప్రజలలో వీండ్లు ముఖ్యులు.
- these men are the heads of the caste వీరే కుల పెద్దలు.
- he came at the head of 5000 men అయిదు వేల మందిని తీసుకొనివచ్చినాడు.
- the head clerk పెద్ద లేఖరి, పెద్ద గుమాస్తా.
- the head man of the village వూరి పెద్ద, గ్రామయజమానుడు.
- he sat at the head of the table ముఖ్యమైన స్థానమందు కూర్చున్నాడు.
- he is now at the head of the office అతను ఆ కచ్చేరి కి అధికారి గా వున్నాడు.
- thousand head of cattle వెయ్యి పశువులు, యిటువంటి స్థలములో Head అని ఏకవచనము గా వ్రాస్తారు.
- he paid them two rupees a head తలా రెండు రూపాయలు యిచ్చినాడు.
- upon this head యిందున గురించి.
- they made head against the King రాజు ను యెదిరించినారు.
- he brought in that story head and shoulders ఆ కథ ను అసంగతముగా వుదహరించినాడు.
- we could not made head against this wind యీ గాలిని నెట్టుకొని పోలేకపోతిమి.
- he is a rogue from head to foot వాడికి నిలువెల్లా విషము.
- he divided the sermon into four heads ఆ గ్రంథము ను నాలుగు భాగములుగా చేసినాడు.
- all these articles were put under different heads in the account యీ సరుకు లు లెక్కలో వేరే వేరేపద్దులకింద కట్టబడ్డవి.
- this is the head of the river యిది నది యొక్క వుత్పత్తిస్థానము, యిది నదీ మూలము.
- the boil came to a head ఆ కురుపు పండబారినది.
- the small pox came to a head అమ్మవారు నేతులు కూర్చినది.
- this brought matters to a head యిందుతో అది ఫలోన్ముఖమైనది, యిందులో అది పరిపక్వమైనది.
- the disease got to a head ఆ రోగము ముమ్మరించినది, ప్రబలమైనది.
- the liquor flew to his head అతనికిమయకమెక్కినది.
- he gave his horse the head and it ran away కళ్లెము సళ్లవిడిచినందున గుర్రము పారిపోయినది.
- two headed రెండు తలలు గల.
- long headed అ దూరాలోచనగల.
- hot headed man ముంగోపి.
- he plunged in the river over head and ears ఏట్లో శుద్ధముగా ముణిగిపోయినాడు.
- they laid their heads together వాండ్లు ఆలోచించుకొన్నారు.
- It went out of his head మరిచిపోయినాడు.
- his folly be upon his own head వాడి తప్పు వాణ్ని కొట్టుకొనిపోనీ.
- at last the cholelra showed its headతుద కు వాంతిభ్రాంతి కనిపించినది.
- his ship was two miles a head of mine నా వాడకు అతని వాడ కోశెడు దూరము ముందుపోయి వుండినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).