అనుబంధం:లలితా సహస్ర నామములు/101-200
ఈ పేజీ ఏ ఇతర పేజీ లింక్ లేదు. ఈ పేజీకి ఒక లింక్ జోడించడం ద్వారా విక్షనరీ సహాయం చేయండి. |
లలితా సహస్రనామ స్తోత్రములోని రెండవ నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.
శ్లోకం 38
<small>మార్చు</small>- మూలాధారైక నిలయా - మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది.
- బ్రహ్మగ్రంథి విభేదినీ - బ్రహ్మగ్రంథిని విడగొట్టునది.
- మణిపూరాంతరుదిరా - మణిపూర చక్రము యొక్క లోపలి నుండి ఉదయించునది లేదా ప్రకటమగునది.
- విష్ణుగ్రంథి విభేదినీ - విష్ణుగ్రంథిని విడగొట్టునది.
శ్లోకం 39
<small>మార్చు</small>- ఆజ్ఞాచక్రాంతళస్థా - ఆజ్ఞాచక్రము యొక్క మధ్యలో ఉండునది.
- రుద్రగ్రంథి విభేదినీ - రుద్రగ్రంథిని విడగొట్టునది.
- సహస్త్రారాంభుజారూఢా - వెయ్యి దళములు గల పద్మమును అధిష్టించి యున్నది.
- సుధాసారాభివర్షిణీ - అమృతము యొక్క ధారాపాత వర్షమును కురిపించునది.
శ్లోకం 40
<small>మార్చు</small>- తటిల్లతా సమరుచిః - మెఱపుతీగతో సమానమగు కాంతి గలది.
- షట్చక్రోపరి సంస్థితా - ఆరు విధములైన మూలాధారాది చక్రముల యొక్క పైభాగమందు చక్కగా నున్నది.
- మహాసక్తిః - బ్రహ్మమునందు ఆసక్తి గలది.
- కుండలినీ - పాము వంటి ఆకారము గలది.
- బిసతంతు తనీయసీ - తామరకాడలోని ప్రోగువలె సన్నని స్వరూపము గలది.
శ్లోకం 41
<small>మార్చు</small>- భవానీ - భవుని భార్య.
- భావనాగమ్యా - భావన చేత పొంద శక్యము గానిది.
- భవారణ్య కుఠారికా - సంసారమనెడు అడవికి గండ్రగొడ్డలి వంటిది.
- భద్రప్రియా - శుభములు, శ్రేష్ఠములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది.
- భద్రమూర్తిః - శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలది.
- భక్త సౌభాగ్యదాయినీ - భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది.
శ్లోకం 42
<small>మార్చు</small>- భక్తప్రియా - భక్తుల యెడ ప్రేమ, వాత్సల్యము గలది.
- భక్తిగమ్యా - భక్తికి గమ్యమైనటువంటిది.
- భక్తివశ్యా - భక్తికి స్వాధీనురాలు.
- భయాపహా - భయములను పోగొట్టునది.
- శాంభవీ - శంభుని భార్య.
- శారదారాధ్యా - సరస్వతిచే ఆరాధింపబడునది.
- శర్వాణీ - శర్వుని భార్య.
- శర్మదాయినీ - శాంతిని, సుఖమును ఇచ్చునది.
శ్లోకం 43
<small>మార్చు</small>- శాంకరీ - శంకరుని భార్య.
- శ్రీకరీ - ఐశ్వర్యమును ఇచ్చునది.
- సాధ్వీ - సాధు ప్రవర్తన గల పతివ్రత.
- శరచ్చంద్ర నిభాననా - శరత్కాలము లోని చంద్రునితో సమానమైన వదనము గలది.
- శాతోదరీ - కృశించిన లేదా సన్నని పొట్ట గలిగినది.
- శాంతిమతీ - శాంతి గలది.
- నిరాధారా - ఆధారము లేనిది.
- నిరంజనా - మాయా సంబంధమైన అజ్ఞానపు పొరలేని దృష్టి గలది.
శ్లోకం 44
<small>మార్చు</small>- నిర్లేపా - కర్మ బంధములు అంటనిది.
- నిర్మలా - ఏ విధమైన మలినము లేనిది.
- నిత్యా - నిత్య సత్య స్వరూపిణి.
- నిరాకారా - ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది.
- నిరాకులా - భావ వికారములు లేనిది.
- నిర్గుణా - గుణములు అంటనిది.
- నిష్కలా - విభాగములు లేనిది.
- శాంతా - ఏ విధమైన ఒడిదుడుకులు, తొట్రుపాటు లేనిది.
- నిష్కామా - కామము, అనగా ఏ కోరికలు లేనిది.
- నిరుపప్లవా - హద్దులు ఉల్లంఘించుట లేనిది.
శ్లోకం 45
<small>మార్చు</small>- నిత్యముక్తా - ఎప్పుడును సంగము లేనిది.
- నిర్వికారా - ఏ విధమైన వికారములు లేనిది.
- నిష్ప్రపంచా - ప్రపంచముతో ముడి లేనిది.
- నిరాశ్రయా - ఆశ్రయము లేనిది లేదా అవసరము లేనిది.
- నిత్యశుద్ధా - ఎల్లప్పుడు శుద్ధమైనది.
- నిత్యబుద్ధా - ఎల్లప్పుడు జ్ఞాన స్వరూపురాలు.
- నిరవద్యా - చెప్పరానిది అంటూ ఏమీ లేనిది లేదా నిందించుటకూ ఏదీ లేనిది.
- నిరంతరా - ఏ మాత్రము సందు లేకుండా అంతటా వ్యాపించింది.
శ్లోకం 46
<small>మార్చు</small>- నిష్కారణా - ఏ కారణము లేనిది.
- నిష్కళంకా - ఎటువంటి దోషము లేదా పాపము లేనిది.
- నిరుపాధిః - ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది.
- నిరీశ్వరా - ఇంకా తనను పైన ప్రభువు అనువారెవరూ లేనిది.
- నిరాగా - రాగము అనగా కోరికలు లేనిది.
- రాగమథనీ - రాగమును పోగొట్టి, వైరాగ్యమును కలుగుజేయునది.
- నిర్మదా - మదము లేనిది.
- మదనాశినీ - మదమును పోగొట్టునది.
శ్లోకం 47
<small>మార్చు</small>- నిశ్చింతా - ఏ చింతలూ లేనిది.
- నిరహంకారా - ఏ విధమైన అహంకారము లేనిది.
- నిర్మోహా - అవగాహనలో పొరపాటు లేనిది.
- మోహనాశినీ - మోహమును పోగొట్టునది.
- నిర్మమా - మమకారము లేనిది.
- మమతాహంత్రీ - మమకారమును పోగొట్టునది.
- నిష్పాపా - పాపము లేనిది.
- పాపనాశినీ - పాపములను పోగొట్టునది.
శ్లోకం 48
<small>మార్చు</small>- నిష్క్రోధా - క్రోధము లేనిది.
- క్రోధశమనీ - క్రోధమును పోగొట్టునది.
- నిర్లోభా - లోభము లేనిది.
- లోభనాశినీ - లోభమును పోగొట్టునది.
- నిస్సంశయా - సందేహములు, సంశయములు లేనిది.
- సంశయఘ్నీ - సంశయములను పోగొట్టునది.
- నిర్భవా - పుట్టుక లేనిది.
- భవనాశినీ - పుట్టుకకు సంబంధించిన సంసార బంధక్లేశములు లేకుండా చేయునది.
శ్లోకం 49
<small>మార్చు</small>- నిర్వికల్పా - వికల్పములు లేనిది.
- నిరాబాధా - బాధలు, వేధలు లేనిది.
- నిర్భేదా - భేదములు లేనిది.
- భేదనాశినీ - భేదములను పోగొట్టునది.
- నిర్నాశా - నాశము లేనిది.
- మృత్యుమథనీ - మృత్యు భావమును, మృత్యువును పోగొట్టునది.
- నిష్క్రియా - క్రియలు (చేయవలసిన, చేయకూడని) లేనిది.
- నిష్పరిగ్రహా - స్వీకరణ, పరిజనాదులు లేనిది.
శ్లోకము 50
<small>మార్చు</small>శ్లోకము 51
<small>మార్చు</small>- దుష్టదూరా - దుష్టత్వము అంటనిది. దుష్టులకు అంటనిది.
- దురాచార శమనీ - చెడు నడవడికను పోగొట్టునది.
- దోషవర్జితా - దోషములచే విడిచి పెట్టబడింది.
- సర్వజ్ఞా - అన్నిటినీ తెలిసింది.
- సాంద్రకరుణా - గొప్ప దయ గలది.
- సమానాధిక వర్జితా - ఎక్కువ తక్కువ భేదాలచే విడువబడినది అనగా ఎక్కువ వారు తక్కువ వారు లేనిది.
శ్లోకము 52
<small>మార్చు</small>- సర్వశక్తిమయీ - సర్వశక్తి స్వరూపిణి.
- సర్వమంగళా - సర్వమంగళ స్వరూపిణి.
- సద్గతి ప్రదా - మంచి మార్గమును ఇచ్చునది.
- సర్వేశ్వరీ - జగత్తు లేదా విశ్వమునంతకు ప్రధానాధికారిణి.
- సర్వమయీ - సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉంది.
- సర్వమంత్ర స్వరూపిణీ - అన్ని మంత్రములును తన స్వరూపముగా గలది.