అంజనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అంజనము నామవాచకము/ సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
ఇది ఒక మూల పదము./ వ్యు. అంజ్ + ల్యుట్. (కృ.ప్ర.)
- బహువచనం
అంజనములు, అంజనాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- అంజనము అంటే కొన్ని పధార్ధాలను మిశ్రమం చేసి తయారు చేసేది. అంజనాన్ని ఔషధానికి, మరియు అలంకరణకు ఉపయోగిస్తారు. అంజనము చర్మము పైన మాత్రమే వ్రాసేది. శరీరము లోపలి బాధలకు పైన వ్రాసేది.
- తప్పిపోయిన వ్యక్తుల లేక జంతువుల, దొంగిలించబడ్డ లేక దాయబడ్డ వస్తువుల, ఉనికిని తెలుసుకొనడానికి అరచేతిలోగాని గోరు మీదగాని కాటుక రాసి చేసే తాంత్రిక ప్రక్రియ.
- కాటుక అని సామాన్యార్థం. దూరంగా ఉన్న వస్తువులనో, వ్యక్తులనో ఉన్నచోటనే ఉండి చూడటానికి అవకాశం కలిగించే ఒక మంత్ర/ తంత్ర విద్య. మంత్ర తంత్రాలు తెలిసిన వాళ్ళు వేసే ఈ అంజనం నాలుగు విధాలు. మొదటిది- భూతాంజనం, రెండవది - ధనాంజనం, మూడవది - దేవతాంజనం, నాలుగవది - చోరాంజనం. భూతాంజనం అంటే ఎవరినైనా ఏదో ఒక భూతం ఆవేశించి నదని భావించినప్పుడు అది ఏభూతమో తెలుసుకోవడానికి వేసే అంజనం. ఇలాగే మిగతా అంజనాల ప్రయోజనాలను సైతం అర్థం చేసుకొనవచ్చు.[ పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) ]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పడమటి దిక్కును కాపాడు ఏనుగు. పశ్చిమదిగ్గజము.
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small> |