శ్రీ అన్నపూర్ణా దేవి

శ్రీ అన్నపూర్ణ దేవి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • స్త్రీ లింగం
  • నామ వాచకము.
వ్యుత్పత్తి
  • పరబ్రహ్మతత్త్వమునుండియే ఆకాశము ఉద్భవించింది. ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి, భూమినుండి ఔషధులు (మొక్కలు) ఓషధులనుండి అన్నము, అన్నమునుండి ప్రాణి పుడుతున్నాయి. కనుక పురుషాది ప్రాణికోటి అన్నరసమయము. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడు. అనగా పరబ్రహ్మతత్త్వము. ఈ విధముగా జీవబ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయి. అన్నపూర్ణాదేవి.
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • అన్నపూర్ణ అనగా పార్వతి కి మరోపేరు. అన్నపూర్ణ అంటే ఈశ్వరస్వరూపం.
  • ఈశ్వరుని సతి.
  • దీనులకు అన్నము ఉదకము దానము చేయుటం ధర్మము. అన్న, ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన అని పేర్కొన్నది మహాభారతము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ‘‘బిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’ అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేయాలి.
  • ‘‘పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’’ కనుపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీకూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది. అయినా, ప్రపంచమంతా నీ నుండే వచ్చినా, ఇంకా ఆ శక్తి ‘పూర్ణమే’. ఆ పూర్ణశక్తియే '"అన్నపూర్ణ దేవి"'.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>