వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

క్రియ/ దే. అ.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. వ్యాపించు.2. నిక్కు.3. చాగు.4. విజృంభించు.5. కవియు.6. చక్కబడు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

1. వ్యాపింౘు "సీ. సమధికదర్ప దుర్జయములై నిగిడెడు నింద్రియంబుల గుదియించి తెచ్చి." భార. ఆర. ౪, ఆ. 2. నిక్కు "వ. తోలూడ్చు మహానాగంబునుంబోలెఁ గరవాలంబు తాన యొఱవెలికి నిగుడుచున్నయది." భార. ఉద్యో. ౨, ఆ. 3 . చాఁగు "క. మొగిచిన చేతులుముందట, నిగడించి." భార. విరా. ౩, ఆ. 4. పఱఁగు "వ. విచ్చలవిడిఁ దనమయంబుగాగ గనంబున నిగుడు నచ్చక్రంబుం గనుంగొని." ఉ, హరి. ౩, ఆ. "సాత్యకి డిభకుపై సాయకదశకంబు నిగిడింప." ఉ, హరి. ౪, ఆ. 5. విజృంభింౘు "సీ. నెత్తుటఁ దోగియు నిగిడిపోరెడు వీరులలరిన నడ మోదుగుల విధంబు." భార. శల్య. ౧, ఆ. 6. వేగిరపడు "చ. గరుడుని డిగ్గి వీడ్కొలిపి కంసవిరోధి పురంబులోపలన్‌, దిరపడి దారకుం బనిచి తేరల వాటుగఁ దేరెనెక్కి సం, గర కుతుకంబుతో వెడలి గర్వితులెల్లను దల్లడిల్ల ని, ష్ఠురరవ పాంచజన్యుఁ డగుడున్‌ నిగిడెన్‌ గని పౌండ్రుడత్తఱిన్‌." (చూ. దీనివెనుక.) ఉ, హరి. ౩, ఆ. 7. కవియు.."క. భగదత్తుని నాకవ్వడి, వెగడొందఁగఁజేసి యతని వెలియేనుఁగుఁ గెం, పుగజేసిన నాతండును, నిగిడెన్‌ బాంచాల మేదినీపతిమీఁదన్‌." భార. భీష్మ. ౩, ఆ. 8. చక్కబడు .."క. బెడిదముగఁ గత్తి గొడ్డటఁ, బొడువఁ దెగినమ్రానఁ జిగురు పొడముఁ బలుకులన్‌, జెడ దునిసిన కార్యంబు ని, గుడనేరదు పిదపనెట్టుఁ గురువంశనిధీ." భార. ఉద్యో. ౨, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నిగుడు&oldid=956227" నుండి వెలికితీశారు