చెంగలించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ప్రకాశించు/విజృంభించు/ప్రజ్వలించు....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
- దే.అ.క్రి. మొలచు, వికసించు, అతిశయించు, ఉత్సాహపడు, ఉల్లాసముగా దూడలు గంతులు వేయు.......క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- 1. అతిశయించు;"చ. కనుఁగొని యద్భుతంబును వికాసము భక్తియుఁ జెంగలింప." వి, పు. ౭, ఆ.
- 2. ప్రకాశించు;"వ. కుముదంబులు ముదంబందె, లాంగలి చెంగలించె." కాశీ. ౩, ఆ.
- 3. విజృంభించు;"ఎ, గీ. అంతఁదనియక మదిఁజాలనాగ్రహించి, మఱియుఁదక్కిన యోధుల మదమడంచి, పగటిసూర్యుని గతి బ్రతాపమున మించి, సింహనాదంబు గావించెఁ జెంగలించి." జై. ౭, ఆ.
- 4. హసించు."ఉ. విందులు విందులంచుదను వేడుక నెత్తుకొనంగఁ బిల్వనిం, పొందఁగ నేగి పైఁబడుచు నుబ్బునఁ గేరుచు జెంగలించుచున్, సందిలిపట్టి యాడుమన నాట్యములాడుచు ముద్దులన్ మహా, నందమొనర్చె బాలిక దినంబును జుట్టపుఁబూవుబోండ్లకున్." కళా. ౬, ఆ.