కొమ్ము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కొమ్ము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>1. ఉకారము యొక్క రూపాంతర నామము; 2. ఎద్దులోనగువాని కొమ్ము; 3. క్రొవ్వునుంచుకొనెడు పాత్రము; 4. పసుపులోనగువాని యెండిన నిడుపాటి గడ్డ; = పసుపుకొమ్ము 5. చిమ్మనగ్రోవి;
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కొమ్ములుతిరిగిన
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "చ. తొడవులు తీసి క్రొమ్మెఱుగుదువ్వలువల్ కడవేసి జిల్గుపా, వడలొగిగట్టి మేలినిడువాలికకొమ్ములు వట్టి యుద్దులే, ర్పడగ వగూడి యల్లవలరాయని క్రొవ్విరిఁబోఁడికేని ప్రా, వడని యొయారిదారికను పట్టఁ గొలంకున జేరిరెంతయున్." చంద్ర.
- . పల్లకిబొంగు;
"సీ. మొగలిఱేకల్లిక తొగకాఁడచట్టము కుఱుగన్పుచెఱకు క్రొమ్మెఱుఁగుఁగొమ్ము." (ఇక్కడ అందలము యొక్క వర్ణనము) చంద్రా. ౩, ఆ.
- (ఏనుఁగు యొక్క దంతము;"ఉ. కొన్నిటి హస్తముల్ చదియఁ గొన్నిటిఁగొమ్ములు దుమ్ము ధూళిగా." భార. భీష్మ. ౨, ఆ.
- పందికోఱ;"సీ. నీటిలోమునిఁగిన నేలచేడియఁ గొమ్ముకొన నుబ్బనెత్తిన ఘోణివీవ." పా. ౧, ఆ.
- . ఊఁదెడి యొకానొక వాద్యము;"వ. గుమ్మెటల చటులరవమ్మును గొమ్ముల నినదమ్మును జెలంగె." కాళ. ౩, ఆ.
- శాఖ;\ = "సీ. కలఁచు పున్నాగంబు లలరుఁగొమ్ముల మహోన్నతిగలయ నభీకమతులనైన." హన. ౨, ఆ.
- . శిఖరము;"క. గుబ్బలికొమ్మొక్కటిఁ గడు, నిబ్బరముగఁ బెఱికియాతనిన్ వైచిన వాఁడుబ్బుసెడక మలత్రిమ్మరి, బెబ్బులి పై మొనలవాలు పేర్మిన్ వైచెన్." అచ్చ. యు, కాం.
- . కొన; ="సీ. ధనువు క్రిందటి కొమ్ముధరణిపై మోపి మీఁదటికొమ్ము వామహస్తమునఁ బట్టి." భో. ౫, ఆ.
- . ఉత్సాహము; ="గీ. అంత గోపసింహుఁ డసురకొమ్ములు వట్టి, ధరణిద్రొబ్బిత్రొక్కి దైత్యభటుల, కొమ్మువీడ సురల కొమ్మువర్ధిల వాని, కొమ్ము వెఱికి మొత్తికూల్చె నధిప." భాగ. ౧౦, స్కం. పూ.
- . బలము; = "క. కొమ్మా దానవనాథుని, కొమ్మాహవమునకుఁ దొలఁగె గురువిజయము గై, కొమ్మా మెచ్చితినెచ్చెద, గొమ్మా భరణములు నీవు కోరినవెల్లన్." భాగ. ౧౦, స్కం. ఉ.
- . గవుండ్లవాఁడు బందము తగిలించెడు కత్తిపిడికలోని వంకరకొయ్య.
- . వారందరు కలసి వాని కొమ్ము కాస్తున్నారు
అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small> |