వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ప్రియవ్రతునికిని సుకన్యకును పుట్టిన పదుగురు కొడుకులలో పెద్దవాడు; ఇతని భార్య పూర్వచిత్త. ఇతనికి తన తండ్రి జంబూద్వీపమును ఇచ్చెను. దానిని ఇతడు తన కొడుకులగు నాభి, కింపురుషుడు, హరి, ఇలావృతుడు, రమ్యుడు, హిరణ్వంతుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అను తొమ్మండ్రకు పంచి ఇచ్చెను. అదెట్లనిన నాభికి హిమవంతమునకు దక్షిణదేశము అగు భరత ఖండము, కింపురుషునికి దానికి ఉత్తరమున హేమకూట పర్వతమునకు దక్షిణమున ఉండు ఖండము, హరికి హేమకూట పర్వతమునకు ఉత్తరమున నిషధపర్వతమునకు దక్షిణమున ఉండు నైషధము, ఇలావృతునికి నిషధపర్వతమునకు ఉత్తరమున మేరువును మధ్యప్రదేశముగాఁగల ఇలావృతము అను ఖండము, రమ్యునికి ఇలావృతమునకును నీలాచలమునకును నడుమ ఉండు ఖండము, హిరణ్వంతునికి దానికి ఉత్తరమున శ్వేత పర్వతమునకు ఈవల ఉండు శ్వేతఖండము, కురువునకు శ్వేతపర్వతమునకు ఉత్తరమున శృంగవంతముచే చుట్టఁబడిన ఖండము, భద్రాశ్వునికి మేరువునకు తూర్పున ఉండు ఖండము, కేతుమాలునికి మేరువునకు పశ్చిమమున ఉండు ఖండమును ఇచ్చెను. ఇవియె నవఖండములు. ఇవి నవవర్షములు అనియు అనఁబడును.

వ్యుత్పత్తి
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>