సుకన్య
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
- వైవస్వత మనువు కొడుకు అయిన శర్యాతి కూతురు. చ్యవనమహర్షి భార్య. ప్రమతి తల్లి. ఒకప్పుడు ఈమె శర్యాతితో కూడ తపోవనమున ఉండువేళ అచట ఒక పుట్టలో నుండి వెలుగుచున్న రెండు జ్యోతులను పొడ గని ముల్లు కొని వాని పొడిచెను. అంత ఆమెకు నోట రక్తము స్రవించుటయెకాక మలమూత్ర బంధమును అయ్యెను. దాని చూచి శర్యాతి అతిభీతుడు అయి కూతును తోడ్కోని వల్మీకము కడకు వచ్చి అందులో తపము చేయుచున్న చ్యవనుని కని తన నేర్పున అతని ప్రసన్నునిగా చేసికొని అతని చిత్తానుసారముగ తన పుత్రికను ఇచ్చి ఆమునీశ్వరుని వీడ్కొని పురమునకు ఏతెంచెను. అనంతరము ఆచ్యవనుడు అశ్వినీదేవతల ప్రసాదము వలన యౌవనమును, సౌందర్యమును పొంది శర్యాతి యాగము చేయు తఱిని సోమపానములేని ఆ దేవతలకు తన తపోబలమున సోమపానము కల్పించి ఇచ్చెను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు