అత్తరు
అత్తరు .అత్తర్ పరిమళం మనస్సుకు ఎంతో హాయినిస్తుంది. మల్లెపూలు, గులాబీ రేకులు, గంధపు చెక్కలు, మొగలి పువ్వుల ఆవిరే అసలైన అత్తర్.ఎంత కాలం ఎక్కువగా భద్రపరిస్తే అంతసువాసనను వెదజల్లుతుంది. పలు మార్లు దుస్తులను ఉతికినా సువాసన అట్లాగే వుంటే అదే అసలు సిసలైన అత్తర్. అత్తర్ తయారీలో పువ్వులు వినియోగిస్తే ఫర్‌ప్యూమ్‌లో ఆల్కహాల్‌ను వినియోగిస్తారు.ఇష్టం లేని అత్తరు వాసన పీల్చితే శ్వాసకు ఇబ్బంది.వేసవి కాలంలో ఖస్, ఇత్రేగిల్ అత్తర్‌లు చల్లదనాన్ని ఇస్తాయి.చలి, వర్షాకాలాలలో షమామతుల్ అంర్, హీన, జాఫ్రాన్, దహనల్‌ఊద్ వంటివి వెచ్చదనాన్ని ఇస్తాయి. వేసవి కాలంలో దహనల్ ఊద్ వాడతే ముక్కు నుండి రక్తం కారడం ఖాయం.జన్నతుల్ ఫర్దోస్, మజ్మ, షాజాన్, మన్నా, నాయబ్, హోప్, బకూర్, మొకల్లత్, ఖస్, ఇత్రేగిల్, షమామతుల్ అంబర్, హీన, జాఫ్రాన్, దహనుల్‌ఊద్, మల్లే, మొగలి పువ్వుల అత్తర్ వంటి అనేక రకాలున్నాయి.
ఒక తులం మామూలు అత్తర్ రూ. 200 వరకు ఉండగా దహనల్ ఊద్ తులానికి రూ. 2వేల నుండి 6 వేల ధర ఉంది.
అత్తరు గురించి తెలుగు ఒక పాట
<small>మార్చు</small>లేలో దిల్బహార్ అత్తర్ దునియా మస్తానా అత్తర్ !
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యం.
- అత్తరు నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>నూనె రూపంలో ఉన్న పువ్వుల లేక సుగంధద్రవ్యముల సారము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
అత్తరువు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక సామెతలో పద ప్రయోగము: అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు