అంకకాడు
(అంక కాదు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అంకకాడు నామవాచకము.
- దేశ్యము
- వ్యుత్పత్తి
వ్యు. అంకము + కా + ఁడు -ము లోపము. (త.ప్ర.) చిహ్నము లేక గుర్తు కలవాడు.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- చలము పట్టువాడు,
- కలహప్రియుడు
- కళంకము గలవాడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"గీ. ఎలసి యేప్రొద్దుఁ గనువొంద నీకమరుఁడు, కలహమున కంకకాఁడయి కాలుద్రవ్వ." ఆము. ౫, ఆ. (అంక శబ్దమునకు వృత్తియందు చలమర్థమని యెఱుఁగవలెను. ఇది యొకానొక కవిచే శ్లేషయందు గుఱుతుగలవాఁడను నర్థమునఁ బ్రయోగింపఁబడియున్నది. "చ. హిమకరుఁ డంకకాఁడు మధువెప్పుడు జాతి విరోధి." కవిక. ౩, ఆ.) "అంకకాఁడును బోలె హరిభక్తులలర, నఱిముఱి మొగవాడ దెఱచి వీక్షింప." [బసవ-4ఆ.]
- 1. యుద్ధశీలుఁడు, యోధుడు, కలహశీలుడు.
"ద్వి. గరిడికెక్కిన యంకకాఁడును బోలె, నెడవిడిపడ్డ మత్తేభంబువోలె, వడిమృగంబులగన్న వ్యాధుండు వోలె, పరగంగ బంతంబు బంటునువోలె." పండి.వాద. ౧౭౯పు.; బస. ౪,ఆ. ౧౧౩పు.; బస. ౨,ఆ. ౪౫పు.;