view
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to survey ; to examine, to see చూచుట, పరీక్షచేసుట, విచారించుట he viewed the lands ఆ పొలమునంతా పార చూచినాడు, విమర్శించినాడు.
- heviewed this business in another light యిందున గురించి వాడికి వేరే భావమైనది.
నామవాచకం, s, sight, survey, prospect అవలోకనము, చూపు దర్శనము.
- there were four hills within view కనుపారేంత దూరములో నాలుగు కొండలు వుండినవి.
- నాలుగు కొండలు అగుపడ్డవి.
- from the top of the hill there is a fine view ఆ కొండ మీదినుంచి చూస్తే శానాదూరము తెలుస్తున్నది.
- at the first view మొదటి విమర్శలో, మొదట చూడగా.
- he placed the ball full in view ఆ చెండును బాగా తెలిశేటట్టుగా పెట్టినాడు.
- I do not know his views in this యిందున గురించి వాడి ఆలోచన యేమో నాకు తెలియలేదు.
- you must keep this in view దీన్ని ముఖ్యముగా నీ మనసులో పెట్టవలసినది.
- he sold me a view of Calcutta కలకత్తా పట్టణము యొక్క పటమును నాకు అమ్మినాడు.
- the lark arose till it went out of view ఆ భరద్వాజము యెగిరి యెగిరి కనుదృష్టిని మించిపోయినది.
- he set the box out of view ఆ పెట్టెను మరుగుగా పెట్టినాడు, కండ్లబడకుండా పెట్టినాడు.
- it went out of view అగుపడక పోయినది.
- it came into view అగుపడ్డది.
- opinion భావము ఆలోచన తాత్పర్యము.
- what is your view in speaking to him ? వాడితో మాట్లాడడానికి నీయత్నమేమి, నీ అభిప్రాయమేమి.
- this is my view of the case అందున గురించి నా తాత్పర్య మిది.
- a view of logic తర్కదర్శనము, అనగా తర్కసంగ్రహము.
- in that view of the subject ఆ పక్షమందు .
- whichever view you take of this యిందున గురించి మీకు యెట్లా భావమైనాసరే.
- the first view of a question in logic అనుమానము.
- on a full view of the question ఆ సంగతికి బాగా విచారించినందు మీదట.
- with a view to screen himself తన ప్రయత్నము కమ్ముదల చేసుకోదలచి.
- the point in view ఆలోచించినపని, యిప్పుడు వుండే యత్నము.
- in every point of view this is wrong యిది అన్ని విధాల తప్పు, యిది అన్యాయము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).