cover
(Cover నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, మూత, ముసుకు, కప్పు, గవిసెన వాసెన, చాటు, దాగే స్థలము చిన్న అడివి.
- of a jar దిబ్బడము, మూత.
- of a letter లిఫాఫా, చంద్రిక.
- his letter gave cover to one from my sister నా చెల్లెలు వ్రాసిన జాబు అతని జాబులో మల్ఫాపు చేసి వుండినది.
- for a guest సామాను, అనగా యింగ్లిషు వారిలో భోజనము వడ్డించే ముందు మేజామీదచిప్పలు, ముళ్లు, కత్తులు మొదలైన వాటిని సిద్ధముగా వుంచి కప్పి వుంచే వుపకరణములు.
- there was a table laid with 20 covers యిరువై మందికి వట్టి మేజా పరచివుండినది, అనగా అన్నిన్ని సిద్ధముగా పెట్టియున్నది యింకా వడ్డించలేదని భావము.
- in a forest డొంక.
- the fox was found in a cover ఆ నక్క వొక డొంక లో దొరికినది.
క్రియ, విశేషణం, మూసుట కప్పుట, కమ్ముట, దాచుట, పొదుగుట.
- he covered the book with paper ఆ పుస్తకానికి మురికి తగలకుండా పైన కాకితము వేసినాడు.
- he covered the box with leather ఆ పెట్టెకు పైన తోలు వేసినాడు.
- they covered their bodies with paint ఒంటికి వర్ణము పూసుకొన్నారు.
- the flies covered the food అన్నము మీదయీగలు ముసురుకొన్నవి.
- they covered him with dirt వాడి ఒళ్లు అంతా మురికిచేసినారు.
- they covered him with curses వాన్ని తిట్టి శపించినారు.
- they covered him with blessings వాణ్ని పదివేల విధములుగా ఆశీర్వదించినారు.
- forests cover the country ఆ దేశమును అడివి మూసుకొన్నది.
- to cover a house in యింటికి పై కప్పువేసుట.
- he covered the wall in గోడకు మదురు పోసినాడు.
- he covered the wall inగోడకు మదురు పోసినాడు.
- he covered the walls of his house with pictures వాడియింటి గోడలకంతా పటములు తగిలించినాడు.
- to cover over ముసుకు వేసుకొనుట.
- tocover up కప్పుట, పూడ్చుట.
- the money will cover the expense ఆ ఖర్చులకు యీ రూకలుచాలును.
- he covered himself with glory కీర్తిభరితుడైనాడు.
- he covered himself with shame నిందలపాలైనాడు.
- charity shall cover the multitude of sins ధర్మము చేతఅన్ని పాపములు కప్పిపోను, మరిగిపోను.
- to cover ( in copulation ) యెద్దు గుర్రము,మరిగిపోను to cover ( in copulation ) యెద్దు గుర్రము, మొదలైనవి పలము చేసుట, యిదిసంభోగమును గురించిన మాట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).