సూక్తవాకన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

సూక్తవాకమును బఠించునట్లు. అని భావము. "సూక్తవాకేన ప్రస్తరం ప్రహరతి" అనగా- సూక్తవాకమును బఠించుచు ప్రస్తరప్రహరణమును చేయువలయును అని శ్రుతి విధించుచున్నది. ప్రస్తరప్రహరణమన దర్భలలో హోమము చేయుట. ఇందు విధివాక్యమున "సూక్తవాకేన-" అని యుండుటచే ప్రస్తరప్రహరణావసరమున సూక్తము నెంతవఱకు అనగా పూర్తిసూక్తమునా లేక దానిలో కొంతభాగమునా చదువవలసినది అని సంశయము. వేదమం దెచటను ఈ విషయమై నిర్ధారణలేదు. అట్లు వేదమెపుడును నిర్ధారణ చేయదుకూడను. అంతియగాక- ప్రస్తరప్రహరణ మనేక దేవతలనుగూర్చి యాచరింపఁబడును. ఆయాసూక్తములలో నాయాదేవతలను గుఱించి హోమాదిక మొనర్చునపు డేయే సూక్తము నెంతదనుక బఠింపవలసినదియు వేదమున వచింపబడియుండలేదు. అట్టియెడ హోమము నెట్లు చేయవలెనను మీమాంసరాగా- యజమాని ఏ దేవతను గుఱించి తాను హోమము చేయుచున్నాఁడో ఆదేవతకు సంబంధించిన సూక్తభాగమును గ్రహించి కర్మానుకూలముగఁ దనకవసర మగునంతదనుక ఆసూక్తమును జదువుచు హోమము చేయవలెను. అది యజమాని యధీనము- అని పెద్దలచే నిర్ణయింపబడియున్నది. అట్లే- యొకవిషయమునఁ దనకు సంబంధించి తనకవసర మవునంతదనుక గ్రహించి మిగిలినదానిని వదలివేయుటలో నీన్యాయము ప్రవర్తించును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>