సురటి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- సురటి నామవాచకము./దే. వి. (సుర + అంటు)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
- వట్రువ విసనకఱ్ఱ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వట్రువ విసనకఱ్ఱ.
- "ద్వి. మరువంపుగొనల నమర్చిన యట్టి, సురఁటి వట్రువగాలి సుడియంగ ద్రిప్పు, తనమంత్రివరు మోము తప్పక చూచి." హరిశ్చ. ౧, భా.
- "క. అనవిని యాసతి యింతయు, వినిపించెద వినుడటంచు విభునకు లీలన్, దనచేతి సురటి విసరుచు, వినయ మధురఫణితినిట్లు వినిపించె దగన్." కళా. ౮, ఆ.
- "చ. అలరు సురంటిగూండ్ల మునుపంతట బెట్టిన బొండుమల్లెమొ, గ్గల గమి గాలిగ్రుడ్లు." చంద్రా. ౨, ఆ. (కొందఱు చామరము అని వ్రాసియున్నారు. అదికాదు.
- "సీ. సురటి చేకొని భద్రశుశ్రూష గావింప విరిచామరలు మిత్రవింద యిడగ." ప్రభా. ౨, ఆ.
కొందఱు కుంచె అని వ్రాసియున్నారు. అదికాదు.
- "సీ. కప్రంపుటరిగ యొక్కవిలాసిని వహింప జిగురాకుగొడు గొక్కమగువ పూనె, నకరుకుంచియ యొక్కయలివేణి ధరియంప నలరుపావడ యొక్కచెలువ వైవ, దమ్మిక్రొవ్విరిగిండిగొమ్మ యొక్కతె తాల్ప గలువకాళంజి యొకర్తు దేర, మొగలిఱేకడప మొక్కగురుస్తని భరిప గురువేరుసురఁటి యొక్కొరిత యూన." చంద్ర.)
(రూ. సురఁటీ. "పువ్వుసురఁటీని విసరుచు." శశాం. ౩, ఆ. "కపురంపు లేఁబొర సురంటీగాడ్పు దీమంబు." చంద్ర.)