విక్షనరీ చర్చ:ప్రతిపాదిత మూస

తాజా వ్యాఖ్య: యాసలు టాపిక్‌లో 18 సంవత్సరాల క్రితం. రాసినది: Veeven

యాసలు <small>మార్చు</small>

ఒక ముఖ్యమైన భాగమిది - మన యాసలు. వివిధ యాసల్లో పదానికి ఏయే పేర్లున్నాయో రాసేందుకు ఒక విభాగం ఉండాలి. అదే చేర్చాను. ఈ విభాగం విక్షనరీకి ఒక ప్రత్యేకతను, శోభనూ ఇస్తుంది. పదాన్ని వివిధ యాసల్లో ఏమంటారో రాయడమే కాకుండా, పద ప్రయోగం కూడా ఆయా యాసల్లో ఎలా ఉంటుందో రాస్తే బాగుంటుంది. __చదువరి 01:55, 29 మార్చి 2006 (UTC)Reply

యాస పదాలు చేర్చడము బాగానే ఉంది. మరి ఆ యాస పదాలకు పేజీల గురించి ఏమి చేద్దాము? రాయలసీమ వాళ్లు మెత్తనే అసలైన పదమని, ఇంకొకరు టిక్కా అసలైన పదమని గొడవ చేస్తే ఏమి చేద్దాము? యాస పదాలకు కూడా పేజీలు సృష్టిస్తే ఒక గొడవ వదులుతుందంటారా?
యాస పదాలను ప్రాంతలని బట్టి కాక పదాలని బట్టి వర్గీకరించాలని నా ఆలొచన. ఎందుకంటే అలా ప్రాంతాల వారీ విభజించుకుపోతే కొన్ని కొన్ని పదాలకు తాలూకాల స్థాయికి చేరవలసి వస్తుంది.
దిండు ఉదాహరణకి
  • మెత్త (తెలంగాణా, రాయలసీమలో కొన్ని ప్రాంతాలు)
  • దిండు (గుంటూరు, ప్రకాశం జిల్లాలు)
  • గద్దె (తెలంగాణా)
దీని వలన లాభాలు..మనము మూసలో అన్ని ప్రాంతాలు చేర్చనక్కరలేదు. ఇది ఒక ఆలోచన మాత్రమే ఇంకా మంచి ఆలోచన ఉంటే దాని ప్రకారమే వెళదాము
--వైఙాసత్య 16:34, 29 మార్చి 2006 (UTC)Reply
ప్రతీ పదానికీ పేజీ ఉంటుంది.. ఉండాలి కూడా ననుకుంటా. కాకపోతే అవన్నీ దారిమార్పు పేజీ లవుతాయి. ఇక అసలు పేజీ ఏదనే చర్చ వస్తుంది. ఇది మీరన్నట్లు ఓ మాదిరి గొడవే, ఓ చర్చనీయాంశమే! ఇక్కడో రెండు సూచనలు - 1. ఎక్కువ వ్యాప్తి దేనికి ఉంటే అది. 2. ముందేది వస్తే అది.
ఇక ప్రాంతాలవారీ విభజన విషయం - అసలు యాసలంటేనే ప్రాంతాల వారీగా ఉంటాయి. కాబట్టి అది తప్పదు. అయితే పదాలను బట్టి వర్గీకరణ ఎలాగో తెలీలేదు.. వివరించండి.
ఇక తాలూకాల స్థాయికి వెళ్ళి పదాలను ఇక్కడ పొందుపరిస్తే.. నిజంగా అలా అన్ని పదాలనూ ఇక్కడ చేర్చగలిగితే.. అది ఒక మహత్కార్యమే అవుతుందని నా అభిప్రాయం. __చదువరి 17:39, 29 మార్చి 2006 (UTC)Reply
పదాలను బట్టి వర్గీకరణ అయితే బాగుంటుంది. ఇలా అయితే ప్రాంతాలనీ మరియు ఇతర విధాలైన వాడకాలని కూడా కవర్ చెయ్యొచ్చు. Also because there will always be overlapping.
పదాల ప్రకారం (పదం ఒకేసారి, ప్రాంతం రెండు లేదా ఎక్కువసార్లు)
  • మెత్త (తెలంగాణా, రాయలసీమలో కొన్ని ప్రాంతాలు)
  • దిండు (గుంటూరు, ప్రకాశం జిల్లాలు)
  • టిక్కా (కోస్తాంధ్ర)
  • గద్దె (తెలంగాణా)
  • తలగడ (ప్రాచీనం?)
  • పిల్లో (కొత్త పోకడ)
ప్రాంతాల ప్రకారం
  • ఉత్తరాంధ్ర: దిండు
  • (మిగతా)కోస్తాంధ్ర: టిక్కా
  • రాయలసీమ: మెత్త
  • తెలంగాణా: మెత్త
ఇక పదాలకు పేజీల గురించి: ప్రతీ పదానికి పేజీ ఉంటుంది (ఆ పదానికి వివరణతో, ముఖ్య పదానికి లింకుతో, మరియు ఉదాహారణలు, పద ప్రయోగాలతో సహా). ఉదాహరణకు తలగడ పేజీ లో పద ప్రయోగాలు, ఉదాహారణలు అన్నీ తలగడ గురించే ఉంటాయి. టిక్కా పదాన్ని ఎలా వాడుతారో తెలుసుకోవాలంటే టిక్కా పేజీకి వెళ్ళాల్సిందే. టిక్కా పేజీ లో తలగడ కి గోదావరి జిల్లాల యాస అని చెప్తాం (వాడుక, ఉదాహారణలు కూడా).
అసలు లేదా ముఖ్య పదాన్ని నిర్ణయించడం: చదువరి చెప్పిన అంశాలు నాకు ఆమోదయోగ్యం (ప్రాధాన్యతా క్రమం కూడా అదే).
--వీవెన్ 01:51, 30 మార్చి 2006 (UTC)Reply
యాసల వివరణను ప్రాంతం పరంగా కాక పదం ప్రకారం మార్చాను. __చదువరి 03:37, 30 మార్చి 2006 (UTC)Reply


చదువరి చెప్పినట్టు మొదట ప్రాంతీయ పదాల పేజీలకు దారిమార్పులతో మొదలుపెడదాము. ఆ తరువాత ఎవరైనా ఉదాహరణకు టిక్కా పదానికి వ్యుత్పత్తి వంటివి రాయదలిస్తే అది స్వతంత్ర పేజీ అవుతుంది. మాండలిక పదాలకు కూడా స్వతంత్ర పేజీలను ప్రోత్సహించకపోయిన నిరుత్సాహపరచకుండా ఉంటే చాలనుకుంటా.
మాటలో ప్రాంతీయతను యాస అంటారు కానీ రాతలో ప్రాంతీయతను కూడా యాస అంటారా? మాండలిక పదాలు అని అనొచ్చు కానీ మాండలికము గురించి వికిపీడియాలో జరిగిన చర్చను దృష్టిలో ఉంచుకొని ప్రాంతీయ పదాలు అని అనొచ్చు.
--వైఙాసత్య 07:58, 30 మార్చి 2006 (UTC)Reply
పిల్లోని ఎక్కడ ఉంచుతాం? అది అన్ని ప్రాంతాలలోనూ వచ్చిన కొత్త పోకడ కదా. అలాంటప్పుడు వాటిని ప్రాంతీయ పదాలు అనగలమా? ఒక పదానికి ఉన్న పురాతన, గ్రాంధీక, కొత్త వాడుకలని వేరే విభాగంలో చేర్చుదామా? అన్నింటిని కలిపి యాసలు, లేదా రూపాంతరాలు (లేదా మరో పదమో) అంటే ఎలా ఉంటుంది? --వీవెన్ 01:56, 31 మార్చి 2006 (UTC)Reply

ఇతర భారతీయ విక్షనరీలు <small>మార్చు</small>

ఇతర భారతీయ విక్షనరీలెలా ఉన్నాయో చూసాను. స్థూలంగా ఇదీ వాటి కథ.

  • హిందీ: హిందీ విక్షనరీ ఇలా ఉంది
    1. భాషాభాగం: నామవాచకమా, క్రియా అనే విషయం
    2. లింగం: స్త్రీ/పుం
    3. అర్థాలు: అర్థం ఇస్తున్నారు, వాక్య ప్రయోగం కనపడలేదు
    4. అనువాదం: ఇతర భాషా పదాలు ఇంగ్లీషు, ఫ్రెంచి, గుజరాతీ పదాలు కనిపిస్తున్నాయి. ఫ్రెంచి తెలిసిన వ్యక్తి ఉన్నారనుకుంటా
    5. ఇవికూడా చూడండి అంటూ సంబంధిత పదాల జాబితా, వాటికి లింకులతో సహా ఇస్తున్నారు
    6. ఈ పదానికి వికిపీడియా లింకును కూడా ఇస్తున్నారు
  • కన్నడ: కన్నడ విక్షనరీలో పెద్దగా విషయం లేదు. ఓ నలభై యాభై పదాలున్నప్పటికీ.., అవి నామకార్థం పేజీలే!
  • తమిళం: నాకరవం రాదు. అయితే ఇంగ్లీషు అర్థం మాత్రమే ఇస్తున్నట్లున్నారు.
  • మలయాళం: కొన్ని వందల పేజీలుండొచ్చు. పేజీలో ఇంగ్లీషు అర్థం ఉంది.
  • మరాఠీ: మన పరిస్థితే.. ఏమీ లేదు.
  • గుజరాతీ: కొన్ని వందల పేజీలున్నాయి కానీ, పేజీలో విషయం తక్కువ. కొన్నిటిలో ఇంగ్లీషు అర్థం, కొన్నిటిలో గుజరాతీ అర్థం ఉన్నాయి. __చదువరి.

యాస వేరు పదాల భేదం వేరు <small>మార్చు</small>

యాస వేరు పదాల భేదం వేరు

యాస అంటే ఒకే పదాన్ని వేరు వేరు రకాలుగా పలకడము వచ్చాడన్నా, వచ్చిండన్నా వరాల తెలుగు ఒకటే నన్నా

మనము ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలు దిండు, మెత్త అన్నీ కూడా ఒకే పదానికి వివిధ ప్రాంతాలలో వాడే పదాలు

కాదా? Chavakiran 12:10, 10 April 2006 (UTC)

మీరన్నది సరైనదే కిరణ్! యాస కాదది. మాండలిక పదం అనొచ్చా? __చదువరి 13:25, 10 April 2006 (UTC)
అన్ని పదాలూ సమానమే
మనము కొన్నింటిని మాండలికము అనవద్దు
ప్రతి పదమునూ కూడా మనము ఓ సమానార్థముగా చెప్పుదాము
ఉదాహరణకు దిండు వద్ద ఇతర సమానార్థాలలో మిగిలిన పదాలు ఇచ్చి, వివరములలో ఈ పదము ఎక్కువగా వాడే ప్రాంతమును ఇచ్చిన బాగుంటుంది. మాండలికము is a kind of old concept, in this democracy and in this wiki world everything is equal ఏమంటారు? Chavakiran 02:53, 11 April 2006 (UTC)

సరైన ఆలోచన. 202.65.149.94 03:22, 11 April 2006 (UTC)

విక్షనరీలో బొమ్మలు <small>మార్చు</small>

విక్షనరీలో బొమ్మలు చేర్చకూడదని ఏమైనా నియమము ఉన్నదా? ఒక చిత్రము వేయి పదాలతో సమానము అన్నట్టు ప్రతి పేజీలో దానికి సంబంధించిన ఒక బొమ్మ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయము. ఉదాహరణకి ఈ తరాము తెలుగు వారికి చర్నాకోల్, కమండలము, పీట లాంటివి బొమ్మతో సహా చూస్తే సులువుగా అర్ధము అవుతాయి

  • అయితే బొమ్మల సంఖ్య ఒకటి లేదా రెండుకు మించ కూడాదు.
  • బొమ్మలు పేజీలో పై భాగమున కుడి వైపు అమర్చాలి
  • వీలైనంతగా వికిమీడియా కామన్స్ లోని బొమ్మలనే ఉపయోగించాలి. అక్కడ లేని బొమ్మలు కామన్స్ లో అప్లోడ్ చేసి ఉపయోగించాలి

--వైఙాసత్య 14:44, 10 April 2006 (UTC)

బొమ్మలు చేర్చడం మంచి ఆలోచనే. అయితే బొమ్మలు నామ వాచకాలకే కదా చేర్చగలుగుతాము? (అన్ని క్రియలకు, విశేషణాలకు బొమ్మలు చూపడం సాధ్యం కాదు/అవసరం లేదు).ఇక్కడ రెండు మార్గాలున్నాయి~:

1. అక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీలో లాగ అవసరమైన చోట ఒకటి కంటే ఎక్కువ బొమ్మలను చూపడం. ఉదాహరణకు పక్షి అన్నచోట అన్ని పక్షుల బొమ్మలూ ఒకే చోట ఉంచి ఒక్కో బొమ్మ నుంచి ఆ పక్షికి సంబంధించిన పదానికి లింకు ఇవ్వొచ్చు.

2. వీలున్న చోటల్లా ఏ పదానికి ఆ పదం దగ్గర విడివిడిగా బొమ్మలు ఉంచడం.(కోడిపుంజు అనే పదం దగ్గర కోడిపుంజు బొమ్మ, కొక్కిరాయి అనే పదం దగ్గర కొక్కిరాయి బొమ్మ) అప్పుడు ఏ పదానికీ ఒకటి కంటే ఎక్కువ బొమ్మలు అవసరముండవు. 202.65.149.94 16:16, 10 April 2006 (UTC)

బొమ్మలు తప్పనిసరిగా ఉండాలి. __చదువరి 17:40, 10 April 2006 (UTC)
Return to the project page "ప్రతిపాదిత మూస".