వర్గం:హిందూ సంస్కారములు

  • ధర్మ సూత్రములలో "చత్వారింశత్ సంస్కారా: అష్టా ఆత్మగుణా:" అనగా 8 ఆత్మ గుణముల సంస్కారములతో పాటుగా మరో 40 సంస్కారములు కలిపి మొత్తం నలభై ఎనిమిది (48) సంస్కారములు వాటి ఆవశ్యకత చెప్పబడినది.
  • ప్రస్తుత ఆధునిక కాలములో చాలా సంస్కారములు చేయుట జరుగుట లేదు. దానికి కారణము లేక పోలేదు. కొన్ని సంస్కారములు చేయవలెనన్న హోమములు అవసరము. * హిందూ సాంప్రదాయములో ఆగమ సంబంధమయిన క్రియలు. ఇవి ప్రతి ఒక్క హిందువు యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుపబడతాయి.
  • తల్లి గర్భములో ప్రవేశించిన సమయము మొదలు కొని, మరణము మరియు తదనంతరము ఆత్మ పరలోక ఆత్మశాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును. దోషములు పోగొట్టుటకు చేయు కర్మలనే సంస్కారములు అని అర్ధము.
  • సంస్కారములు మొత్తము నలభై ఎనిమిది. :