వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఒక యజ్ఞం. ‘కల్ప సూత్రం’ ప్రకారం ఇది మూడు రోజులు జరిగే యజ్ఞం. మొదటి రోజు చతుష్టోమం. రెండవ రోజు ఉక్థ్యమనే యజ్ఞం. మూడవ రోజు అతి రాత్రం. ఒకప్పుడు అశ్వ మేధ యజ్ఞంలో అరణ్య మృగాలను, గ్రామ్య మృగాలను బలి ఇచ్చే ఆచారం ఉండేది. శుక్ల యజుర్వేదానికి సంబంధించిన శతపథ బ్రాహ్మణంలోని ‘అగ్నిర్వా అశ్వః అజ్యం మేధః’ అనే వాక్యం ప్రకారం అగ్నిలో నేయిని పోసి వ్రేల్చడం మాత్రమే అశ్వమేధమని స్వామి దయానంద తమ సత్యార్థ ప్రకాశంలో స్పష్టం చేశారు.. పూర్వ ప్రభువులు కొందరు ఇందుకు భిన్నంగా దిగ్విజయ యాత్రల కోసం అశ్వాన్ని దాని ఇష్టం వచ్చినట్లు పోనివ్వడం, శత్రు రాజులను జయించడానికి అదొక సాకు కావడం, జుగుప్సాకరమైన మరికొన్ని ఆచారాలను పాటించడం జరుగుతుండేది. వాటికి ఆనాడు సైతం వ్యతిరేకత ఉన్నట్టు పౌరాణిక ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి సామాజిక ఆమోదం గానీ, శాస్త్ర సమర్థన గానీ లేదు. వామాచార ప్రభావం వల్ల యజ్ఞ కాండలో వేద విహితం కాని జుగుప్సాకర ఆచారాలు ప్రవేశించాయని వేదాన్ని విశ్వసించి గౌరవించే పలువురి విశ్లేషణ..[పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010 ]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అశ్వమేధం&oldid=905428" నుండి వెలికితీశారు