మిశ్రమవర్ణాలలో ఉండే రాగులు
రాగులు/తైదులు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఇది నిత్య బహువచనము.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • రాగి వార్షిక ధాన్యపు పంట.
  • స్వస్థలము ఇథియోపియాలోని ఎత్తుప్రదేశాలు.
  • అయితే నాలుగువేల సంవత్సరాలకు పూర్వము భారత దేశములో ప్రవేశపెట్టబడినది.
  • రాగులు మెట్ట పైరు.
  • రాగులు చిరు ధాన్యము.
  • రాగులు బియ్యానికి ప్రత్యామ్న్యాయ ధాన్యం. పిండి పదార్ధ ప్రధాన ఆహారం. వీటిని ముడిగానే పిండి చేసి వాడుతారు కనుక ఆరోగ్యానికి మరింత శ్రేష్టం. వీటిని సంకటి, అన్నము, జావ తయారు చేయడానికి ఉపయోగిస్తారు.రాగి పిండితో రొట్టెలను తయారు చేస్తారు. ప్రస్తుత కాలంలో మధుఖ వ్యాధి గ్రస్తులు వీటిని ఎక్కువగా తింటారు కనుక వీటిని కొన్ని చోట్ల ఇడ్లీలు, దోశలు కూడా చేస్తున్నారు. రాగి పిండితో బూరెలు లాంటి పిండి వంటలు చేస్తారు. ప్రస్తుతం మార్కెట్టులో రాగి సేమ్యా లభ్యమౌతుంది. రాగి అంబలి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. మజ్జిగతో కలిపిన రాగి అంబలి వేసవి తాపం తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

చోళ్లు/ తైదలు

నానార్థాలు

తైదులు,

సంబంధిత పదాలు
  1. రాగి సంకటి, రాగిఅంబలి, రాగిరొట్టె, రాగిఇడ్లీ, రాగిపిండి, రాగిసేమ్యా, రాగిపిండి బూరెలు, రాగి మాల్ట్.,రాగు లడ్డు.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • రాగులను దంచి కేకులు, పుడ్డింగులు, పారిట్జులు వండవచ్చు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=రాగులు&oldid=959358" నుండి వెలికితీశారు