వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక కొత్త పదం. బహుళమైన అణువులు, బృహత్‌ అణువు అనే మాటలకి సంక్షిప్త రూపం. మొట్టమొదట ఈ మాటని తెలుగుభాషా పత్రికలో ప్రయోగించారు. తరువాత వేమూరి వేంకటేశ్వరరావు రాసిన జీవరహస్యం, రసగంధాయ రసాయనం అనే పుస్తకాలలోనూ, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus (Asian Educational Services, New Delhi, India 2002) లోనూ ఉంది.
బహువచనం
  • బణువులు

అర్థ వివరణ

<small>మార్చు</small>

Atom అనే ఇంగ్లీషు మాటని అణువు అని కొందరూ, పరమాణువు అని కొందరూ తెలిగిస్తూ వస్తున్నారు. కాని atom కి అణువు అన్న అర్ధమే ఎక్కువ ప్రాచుర్యం లో ఉంది. ఊదా. అణు శక్తి, అణు బాంబు, అణుప్రమాణం. వీటిని పరమాణు శక్తి, పరమాణు బాంబు, పరమాణు ప్రమాణం అని ఎవ్వరూ అనటం లేదు. కనుక atom అంటే అణువు అని స్థిరపరచి, పరమాణువు అంటే sub-atomic particles (like electrons, protons, neutrons)అనే అర్ధం స్థిరపచి వాడితే బాగుంటుంది. అప్పుడు molecule కి మరొక మాట కావలసి ఉంటుంది. కనుక కొన్ని అణువుల సమూహాన్ని బహుళమైన అణువులు లేదా బణువులు అని తెలుగుభాషా పత్రికలో, 1968 ప్రాంతాలలో ఒకరు ప్రతిపాదించేరు.

నానార్థాలు
లేవు
సంబంధిత పదాలు
అణువు, పరమాణువు, బృహత్‌బణువు
వ్యతిరేక పదాలు
లేవు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

బణుభారం = molecular weight బణుసంధానం = condensation, joining two molecules to make a bigger molecule బృహత్ బణువు = mega molecule

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>

నా. కొన్ని అణువుల సమూహం;

"https://te.wiktionary.org/w/index.php?title=బణువు&oldid=853662" నుండి వెలికితీశారు