నృపనాపిత(పుత్ర) న్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>రాజు మంగలి కథలాగా. ఆ కథ ఇది. ఒక రాజుదగ్గర ఒక మంగలి ఉండేవాడు. ఒకనాడు రాజు మంగలితో 'ఈ ఊళ్లో అందరికన్నా అందమైన పిల్లవాణ్ని తీసుకొనిరా' అని ఆజ్ఞాపించినాడు. మంగలి ఊరంతా తిరిగి చూచినాడు కాని ఎవ్వరూ తన కొడుకంత అందంగా లేడని ఇంటికి వచ్చి తన కొడుకు ఎంతో వికారంగా ఉన్నా 'నా కొడుకు ఎంత అందమైనవాడు' అని అనుకొని కొడుకును కోటలోనికి తీసుకొనిపోయి 'రాజా! మీ ఆజ్ఞానుసారం అందమైన బాలుణ్ణి తీసుకొని వచ్చినాను' అని విన్నవించుకుంటాడు. రాజు ఆ బాలుణ్ణి చూడగానే వీడు నాతో హాస్యం చేస్తున్నాడని అనుకొని కుపితు డౌతాడు. కాని ఎవరి కొడుకులు వారికి ముద్దుగా ఉంటారని కోపాన్ని చల్లార్చుకొని మంగలికి బహుమానమిచ్చి పంపుతాడు. 'కాకిపిల్ల కాకికి ముద్దు' అనే తెలుగు సామెతకు ఇదే భావం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు