దశరథుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దశరథుడు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- అయోధ్య మహారాజు. శ్రీరాముని తండ్రి.
- దశ (పది) దిశలలో రథ గమనము కలవాడు. అయోధ్య రాజ్యానికి రఘు వంశపు రాజు . ముగ్గురు -కౌసల్య , సుమిత్ర , కైకేయి భార్యలకు ... రాముడు , లక్ష్మణుడు , భరత ,శత్రుఘ్నులు (నలుగురు) కుమారులు .
- చైత్ర శుద్ధ నవమినాడు దశరథుడు, కౌసల్యలకు శ్రీరాముడు జన్మించెను. మరియు ఆరోజుననే స్వామివారి కళ్యాణ మహోత్సవము కూడా జరుగుటచే ఈరోజును శ్రీరామనవమి పండుగగా జరుపుకొంటారు
- ఇ|| కల్మాషపాదుని పౌత్రుఁడైన మూలకుని (నారీకవచుని) కొడుకు. వృద్ధశర్ముని తండ్రి.
- ఇ|| అజమహారాజు కొడుకు. ఇతనికి ప్రధానభార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి అని మువ్వురు. ఇతఁడు చిరకాలము పుత్రులులేక ఉండి పుత్రకామేష్టి అను యాగముచేసి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అను నలువురు కొడుకులను పడసెను. అందు కౌసల్యాపుత్రుఁడు అగు రామునకు యువరాజ్యాభిషేకము చేయ యత్నించి ఉండుసంగతి కైకేయి ఎఱిఁగి తన కొడుకు అగు భరతునకు ఆయువరాజ్య పట్టము కట్టునట్లును, రామునకు పదునాలుగు సంవత్సరముల వనవాసము ఆజ్ఞాపించునట్లును తన భర్తను అడిగెను. ఆయనకు అది సమ్మతి లేక పోయినను (పూర్వము దేవాసురయుద్ధమునందు దేవతలకు సహాయము చేయఁబోయి శంబరాసురుఁడు అనువానితో యుద్ధముచేయునపుడు ఆయసురుఁడు అనేకమాయలు కావింపఁగా కైకేయి తాను ధవళాంగుఁడు అను మునివలన పడసిన మంత్రవిద్యచేత ఆమాయలనెల్ల అణఁచివేయ అందులకు దశరథుఁడు మెచ్చుకొని నీకు ఏమి వరముకావలెను అడుగుము అనఁగా రెండువరములు అడిగి అవి తనకు కావలసినప్పుడు ఇచ్చునట్లు మాటతీసికొని ఉండెను కనుక ఆవరములు ఇప్పుడు ఇమ్మనిన) దశరథుఁడు ఏమియు చెప్పనేరక ఊరక ఉండెను. కైకేయి రామునితో నిన్ను మీ తండ్రి వనవాసము చేయుటకు పొమ్మనెను అని చెప్ప అతఁడు అట్లేచేసెను.అది కారణముగ దశరథుఁడు మృతిచెందెను.
ఈ దశరథమహారాజు ఒకప్పుడు వేటాడపోయి, ఒక ఋషిపుత్రుడు అంధులగు తన తల్లిదండ్రుల కొఱకు కమండలముతో తటాకమున జలము ముంచుచు ఉండఁగా ఆనీళ్లు ముంచెడు చప్పుడువిని ఏనుఁగు తొండముతో నీళ్లు త్రాగుచు ఉన్నది అని నిశ్చయించి బాణమును సంధించి ఏసెను. ఆయేటు తగిలినతోడనే ఆఋషిపుత్రుడు మృతి పొందెను. పిదప రాజు తన తప్పితము తెలిసికొని అచటికి పోయి అతనిని ఊఱడించి తాను తెలియక ఇట్టిపని చేసితిని అని ఆదంపతులకు చెప్పెను. వారు పుత్రశోకమును భరింపలేక నీవును మావలె పుత్రశోకముచే మృతిపొందుదువుగాక అని శపించి ప్రాణములను విడిచిరి.
- య|| నవరథుని కొడుకు.
- అ|| చూ|| నా|| రోమపాదుఁడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small> |