తెలుగు గ్రామాల పేర్లు

పేర్లలో ఉన్న పదాలను ఆధారంగా చేసుకుని తెలుగువారి గ్రామనామాలను నాలుగు విధాలుగా విభజించవచ్చు.

  • తెలుగువారి గ్రామాల పేర్లు సాధారణంగా రెండు పదాలతో ఏర్పడుతుంటాయి. ఉదాహరణగా తీసుకుంటే కంచుమర్రు (కంచు, మర్రు), పాలమూరు (పాలము, ఊరు), గండికోట (గండి, కోట) వంటివి ఎన్నో ఉన్నాయి.
  • ఒక పదంతో ఏర్పడిన పేర్లు కూడా ఉన్నాయి. ఉదా: అత్తిలి, దర్శి, తడ, కంభం.
  • పేరులో మూడు పదాలు ఉన్న గ్రామాలు ఉన్నాయి. ఉదా: దొంగల గన్న వరం (దొంగల, గన్న, వరం), తూర్పు లంక పల్లి (తూర్పు, లంక, పల్లి).
  • నాలుగు పదాలతో కూడిన పేర్లున్న గ్రామాలు. ఉదా: నీళ్ళు లేని తిమ్మా పురం.

ఒకే పేరుతో ఉన్న గ్రామాలు తప్పితే ఇతర గ్రామాల పేర్లన్నిటిలోనూ ఉండే ఆఖరి పదం (suffix)రెండు, మూడు, నాల్గు పదాలున్న గ్రామాల్లోనైనా సాధారణంగా గ్రామాన్ని వర్గీకరించడంలో ఉపయోగపడుతూంటాయి. వైవిధ్యభరితమైన పేర్లు ఎన్నో ఈ ఉత్తర పదంలో కనిపిస్తాయి. కొండ (నీరుకొండ), గుండం (మోక్షగుండం), మంద (ఆవులమంద), చెరువు (మేళ్ళచెరువు), బయలు (గుర్రాలబయలు), గుంట (త్రోవగుంట), తోట (మల్లెతోట), కాలువ (కాటిగాని కాలువ), కట్టుబడి (అధ్వాన్నం నారాయణ కట్టుబడి), వనం (తులసివనం), కొండ్రలు(చేబ్రోలు వీరప్పకొండ్రలు), త్రోవ (తలుపులమ్మత్రోవ), శాత్తు (పరమశాత్తు), నరవ (బెడుదుల నరవ), కాణి (వరగాణి), కుంట (యాతాలకుంట), కటకం (ధాన్యకటకం), ఏరు (పాలేరు), రాల (దుగ్గిరాల), ముక్కల (నిడుముక్కల), అంకి (పోరంకి), మడుగు (గుండ్లమడుగు), బండ ( గాజులబండ), వంపు (నదివంపు), తిప్ప (నాగాయతిప్ప), రాయి (విజయరాయి), గడ్డ (పులిగడ్డ), సముద్రం (తిమ్మసముద్రం), రేవు (వాడరేవు), కోట (దేవరకోట), పట్టు (పూతలపట్టు), మడక (పూడిమడక), వాడ (విజయవాడ), లంక (కృష్ణలంక), మెట్ట (దిగువమెట్ట), మామిడి (దొరమామిడి), వరం (గన్నవరం), దరి (పెన్నదరి), కడప (దేవునికడప), పెంట (వనిపెంట), వాకిలి (యాటవాకిలి), దొరువు (జల్లుల దొరువు) వంటివి అసంఖ్యాకమైన ఉత్తరపదాల జాబితాలో కొన్ని.
పేర్లలో ఈ ఉత్తరపదాలు రావడానికి భౌగోళికమైన కారణాలు ఉంటాయి. కటకం అన్న పదం అడవిలోని పల్లెను సూచించే పదం. కొండత్రోవలోని పల్లెను నరవ అంటారు. వాగులు వంకల పక్కన ఉండి, ఏమాత్రం వరదలు వచ్చినా మునిగిపోయే ఊళ్లను పూడి అంటారు. బయలు-మేతకు వదిలే స్థలం, పాలెం- ప్రాంత పాలెగాడి నివాసస్థలం, గడ్డ-ఏటి ఒడ్డున ఎత్తైన భూభాగం, లంక-నదీమధ్యలోని విశాల భూభాగం అని అర్థాలు వస్తాయి. ఈ పేర్లు గల పలు గ్రామాలకు ఆయా నైసర్గిక స్థితి ఉండడం ప్రాచీన గ్రామనామాలను భౌగోళిక స్థితిగతుల అంచనాతో పెట్టినట్టు సూచిస్తోంది.
గ్రామనామాల్లోని ప్రథమభాగంలోని పదాల్లో కూడా ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. వ్యక్తులు, కులాలు, వృత్తులు, భౌగోళిక స్థితిగతులు, వృక్షజాతులు, జంతుజాతుల పేర్లే కాక పలు విశేషణాలు కూడా చోటుచేసుకుంటాయి. వ్యక్తుల పేర్లతో-జంగారెడ్డిగూడెం, రాజమహేంద్రవరం, మహబూబ్‌నగర్, హైదరాబాద్ తదితర జనావాసాలు, కులాల పేర్లతో బ్రాహ్మణ చెరువు, బోయగూడెం, రెడ్డిపాలెం, మేదరమెట్ల వంటి ఊళ్ళు, వృక్షజాలంతో ఆకుతీగల పాడు, చింతపల్లి, మర్రివలస, కోరుమామిడి, తాడిపత్రి వంటి గ్రామాలు, సింగరేణి, గొర్రెకుంట, పిల్లిగెడ్డ, ఉడతలపల్లి వంటి జంతుసంబంధమైన పేర్లున్న గ్రామాలు కొన్ని ఉదాహరణలు. భౌగోళిక స్థితిగతులు ప్రతిబింబించేలా కొండపల్లి, బండమీదిపల్లి వంటివాటి పేర్లు ఉన్నాయి. సుప్రసిద్ధిపొందిన ఓరుగల్లు పట్టణం పేరుకు అర్థం ఒక(ఒరు) రాయి(గల్లు) అన్నది కూడా పట్టణపు భూగోళిక స్థితినే సూచిస్తోంది. అయినంపూడి, అయినవిల్లి పేర్లలోని అయిన శబ్దానికి నదివంపు తిరిగే ప్రదేశంలో దానికి అభిముఖంగా వున్న ప్రదేశమని అర్థం. అలంపురం, రణక్షేత్రం వంటి గ్రామాల్లో ప్రసిద్ధయుద్ధాలు జరగడం వల్ల ఆ పేర్లు వచ్చాయి. విజయవాడ, విజయనగరం నగరాల్లో విజయ శబ్దం విశేషణంగా వచ్చింది. ఒకే పేరుతో దగ్గర ప్రాంతంలోనే రెండు గ్రామాలు ఉన్నప్పుడు అయోమయాన్ని నివారించేందుకు ముందు విశేషణాలు వచ్చి చేరుతాయి. చిన తాడేపల్లి-పెద తాడేపల్లి, చిన అమిరం-పెద అమిరం వంటి జంటలు అలా ఏర్పడ్డవే. వ్యక్తుల నామాలు గ్రామాలకు పెట్టుకోవడానికి కూడా వివిధ కారణాలు ఉంటాయి. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన కులీకుతుబ్ షా తాను ప్రేమించి పెళ్ళిచేసుకున్న హైదర్‌మహల్ పేరుమీదుగా హైదరాబాద్ అనీ నగరానికి పేరుపెట్టారు. తెలుగుచాళుక్యులలో ఒకరి బిరుదైన సర్వసిద్ధి మీద గౌరవంతో ఆ పేరుతో గ్రామం ఏర్పడింది. గ్రామనామాలలో వున్న వైవిధ్యభరితమైన, సూక్ష్మమైన అంశాలు మానవ సాంఘికచరిత్రకు ఆధారాలుగా నిలుస్తాయని అధ్యయనకారులు పేర్కొన్నారు. [1]

అక్షర క్రమంలో తెలుగు గ్రామాల పేర్లు

- - - - - - - - - - - - - అం - - - - - - - - - - - - - - - - -
- - - - - - - - - - - - - - క్ష

తెలుగు గ్రామాల పేర్లు ఏలూరు

   చందర్లపాడు
   చంద్రగిరి
   చాట్రాయి
   చిలుకూరు
   చీదికడ
   చీపురుపల్లి
   చోడవరం
   నందిగం
   నందివాడ
   నక్కపల్లి
   నరసన్నపేట
   నర్సీపట్నం
   నాగాయలంక
   నాతవరం
   నారాయణవనం
   నూజివీడు
   నెల్లిమర్ల
   నందిగామ
   బంటుమిల్లి
   బలిజిపేట
   బాడంగి
   బాపులపాడు
   బుచ్చయ్యపేట
   బొండపల్లి
   భామిని
   భీమునిపట్నం
   భోగాపురం
   మక్కువ
   మచిలీపట్నం
   మదనపల్లె
   మాకవరపాలెం
   ముంచింగి‌పుట్టు
   ముదినేపల్లి
   మునగపాక
   ముసునూరు
   మెంటాడ
   మెరకముడిదాం
   మెళియాపుట్టి
   మైలవరం