వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

నామకరణము

వ్యుత్పత్తి

చుట్ట, కుదిరిక అను పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం

చుట్టకుదురులు... బహువచనము

అర్థ వివరణసవరించు

చుట్టకుదురు అంటే నేల మీద బరువులు కుదిరికగా పెట్టుకునేందుకు, నీటి బిందెల వంటివి అడుగు భాగము రాపిడి వలన అరగ కుండా ఉండడానికి , కుండ వంటివి బరువుతో నేల మీద ఉంచినప్పుడు పగులకుండా ఉండడానికి, వేడి పదార్ధాలు ఉన్నపిడతలు, చట్లు కుదురుగా నిలిచేందుకు ఉపయోగించే సాధనము. వీటిని పూర్వము ఎండుగడ్డిని చుట్టగా చుట్టి తయారు చేసి అమ్మే వాళ్ళు. క్రమేణా ఇవి స్టీలు ఇతర లోహాలతో చేసినవి లభ్యం ఔతున్నాయి. అత్యాధునిక వంట ఇళ్ళలో వీటి ఉపయోగం లేదు. కుదిరికగా నిలవడానికి గుండ్రగా ఉంటాయి కనుక వీటికి చుట్టకుదురు అనే కారణ నామము వచ్చింది. పల్లె వాసులు కొంత మంది తల మీద బరువులు పెట్టుకోవడానికి ఆడవాళ్ళు అయితే తమ పైట చెంగుని మగ వాళ్ళు అయితే తల గుడ్డని చుట్టకుదురు మాదిరి తాత్కాలికంగా చేసి తల మీద పెట్టి తరువాత బరువులను ఎత్తుకుంటారు.

గడ్డిబొందు
1. కుండ మొదలగునవి సరిగా నిలుచుటకు గడ్డి మొదలగు వాటితో చుట్టి క్రింద ఉంచు చుట్ట.= 2. పొయ్యికి ప్రక్కన ఎత్తు తక్కువగా కట్టిన చిన్న = అరుగు. = శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
కుండలు కుదిరికగా నిలుచుటకై వాని క్రింద నుంచెడు వెంటిలోనగువాని చుట్ట, ఆధారకుండము. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
తలమీద కుండలు కుదిరికగా నుండుటకై అడుగుననుంచెడు గడ్డిచుట్ట. = ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు