గడ

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • వైక్ర్తము/వైకృత విశేష్యము
  • విశెష్యము
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • నిడుపాటి కోల:

గడ అంటే పొడైవైన తిన్నని వృక్ష సంబంధిత కర్ర. చెరుకు గడ, వెదురు గడ మొదలైనవి. వెదురు గడను ఉపయోగించి ఎత్తైన చెట్టు నుండి కాయలను పండ్లను కోయడానికి ఇళ్ళల్లో ఉపయోగిస్తారు.

  • ఓడకంబము* ;

"క. గడకట్టిన యోడపగిది, నడయాడుఁ గ్రియాభియుక్తుఁడట నిష్క్రియుఁడై, యొడిసెల ఱాయిపడిన కయి, వడిఁ దత్వముఁగలయు బంధువర్గము తోడన్‌." శివ. ౨, ఆ.

నానార్థాలు
  1. సమూహము
  2. ఓడ కంబము(స్తంబము)
  3. దోటీ
సంబంధిత పదాలు
  • గడచిన, చెరుకు గడ, వెదురు గడ, గడ కర్ర.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

సమూహము; "సీ. మక్కువఁదేఁకువదక్కి లోఁదవిలి యాడెడు చక్రవాకపు గడలతోడ." నిర్వ. ౮, ఆ. ఓడకంబము* ;"క. గడకట్టిన యోడపగిది, నడయాడుఁ గ్రియాభియుక్తుఁడట నిష్క్రియుఁడై, యొడిసెల ఱాయిపడిన కయి, వడిఁ దత్వముఁగలయు బంధువర్గము తోడన్‌." శివ. ౨, ఆ. కంబము* ."సీ. పరిభూత బిసపద్మభాతులు చేతులు కదళికాయుగళంబు గడలు తొడలు."(ఇక్కడ గడయనగా అరటి చెట్టు యొక్క అడుగు భాగము.) రా. సుం, కాం.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గడ&oldid=964829" నుండి వెలికితీశారు