కోలమొసలి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకము
వ్యుత్పత్తి

కోల + మొసలి

అర్థ వివరణ

<small>మార్చు</small>

కోల [పొడవాటి సన్నని కర్ర] వంటి మూతిగల మొసలి. దీనినే కోలుమొసలి లేదా కోల్మొసలి అని కూడా పిలుస్తారు. ఉత్తర భారతదేశమున గంగ, యమున వంటి నదులలో ఎక్కువగా కనిపిస్తుంది. గంగాదేవికి, అలాగే వరుణదేవునికి ఇది వాహనముగా చెప్పబడుతుంది. దీనినే సంస్కృతంలో నక్రము లేదా మకరము అని పిలుస్తారు. దీని జీవశాస్త్రీయ నామం: Gavialis gangeticus (గవియాలిస్ గంగేతికుస్)

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • కోలమొసలి ఉత్తరభారత దేశప్రాంతాలకు తప్ప, భూమిమీద మఱి ఏ ఇతర ప్రాంతానికీ చెందని ఒక ప్రత్యేకమైన మొసలి.
  • తమకున్న సన్నని పొడవాటి మూతివలన కోలమొసళ్లు ఎక్కువగా చేపలు, పీతలు వంటి చిన్నప్రాణులనే తినడానికి ఇష్టపడతాయి.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కోలమొసలి&oldid=967719" నుండి వెలికితీశారు